చైనాకు చెందిన స్మార్టు ఫోన్ మేకర్ షియోమీ అమ్మకాల్లో నిత్యం రికార్డులు స్థాపిస్తున్న సంగతి తెలిసిందే. ఏ కొత్త మోడల్ రిలీజ్ చేసినా నిమిషాల్లో లక్షల ఫోన్లు అమ్ముడుపోతుండడం ఒక్క షియోమీకే సాధ్యమవుతోంది. కాగా.... ఈ సంస్థ గత నెలలో విడుదల చేసిన తన నూతన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 4 కూడా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మే 23వ తేదీన ఈ ఫోన్ విడుదల కాగా ఇప్పటివరకు ఏకంగా 10 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి.
మే 23న ఇది రిలీజ్ కాగా అదే రోజున నిర్వహించిన ఫ్లాష్ సేల్‌లో కేవలం 8 నిమిషాల్లోనే 2.50 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయి. కాగా అప్పటి నుంచి ఈ ఫోన్ ప్రతి మంగళవారం జరిగిన ఫ్లాష్ సేల్‌లో లభ్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్ విడుదలై 30 రోజులు దాటగా దీన్ని ఇప్పటి వరకు 10 లక్షల మంది కొనుగోలు చేశారు. నోట్ 4 కన్నా రెడ్‌మీ 4 ఫోన్‌నే ఎక్కువగా కొంటున్నారని షియోమీ ఇండియా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
రీజన్ ఇదే...
కాగా షియోమీ గతేడాది తీసుకొచ్చిన రెడ్ మి3 ఎస్ వేరియంట్లు 40 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. 3ఎస్ రికార్డులను రెడ్ మీ 4 బ్రేక్ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. తక్కువ ధరకే మంచి ఫీచర్లు ఉండడం... ఇందులో బేసిక్ మోడల్(2జీబీ/16 జీబీ) కేవలం రూ.6999కే దొరుకుతుండడం... బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుండడం వంటివి ఈ ఫోన్ల సక్సెస్ కు కారణాలుగా తెలుస్తోంది.
తక్కువ ధరకే బెస్ట్ స్పెషిఫికేషన్స్
* 5 అంగుళాల హెచ్డీ డిస్ ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్
* 4100ఎంఏహెచ్ బ్యాటరీ
* 1.4గిగాహెడ్జ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ఆక్టా-కోర్ చిప్
* 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్
* మైక్రో ఎస్డీకార్డు ద్వారా 128జీబీ వరకు విస్తరణ మెమరీ
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
* 13ఎంపీ రియర్ కెమెరా
* 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
* డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్
* 4జీ ఎల్టీఈ
* బ్లాక్, మెటల్ రంగుల్లో అందుబాటు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్