జూలై 1 నుంచి కొత్తగా కొన్ని రూల్స్ వస్తున్నాయి. పాత నిబంధనలు పోయి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కాగా ఈ నిబంధనలు రోజువారీ భాగంలో మనం చేసే పనులే. రోజువారీ ఆర్థిక లావాదేవీల ప్రభావం చూపించేవే. మీరు ఎప్పుడూ లావాదేవీలు జరుపుతున్నట్లయితే మీరు తప్పనిసరిగా జూలై 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలి. జిటల్ ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్స్‌ఫర్, వడ్డీ రేట్లు ఇలా అన్నింటిలో కొత్త రూల్స్ వచ్చాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
Basic bank account holders allowed zero balance, RBI directs banks
బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్( BSBD ) అకౌంట్ ఉన్నవారికి RBI ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లకు ఉచితంగా మరో 5 సేవల్ని అందించాలని బ్యాంకుల్ని RBI ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ఏటీఎంలతో పాటు బ్రాంచ్‌తో కనీసం నాలుగు విత్‌డ్రాయల్స్, ఏ బ్రాంచ్‌లో అయినా డబ్బులు డిపాజిట్ చేసే సౌకర్యం లాంటి కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.
Savings Scheme
small saving schemes మీద జూలై 1 నుంచి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముంది.
RTGS & NEFT:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్‌టీజీఎస్, ఎన్ఈఎఫ్‌టీ ఛార్జీలను ఎత్తేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపై జూలై 1 నుంచి RTGS, NEFT ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇకపై RTGS ద్వారా భారీ మొత్తంలో, NEFT ద్వారా రూ.2 లక్షల వరకు మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
SBI Home Loan:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకోవాలనుకునేవారికి జూలై 1 నుంచి రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ ఎస్‌బీఐ ఆఫర్ చేయనుంది. ఇకపై ఎస్‌బీఐ రెపో రేట్ ఆధారంగా Home Loan వడ్డీ రేట్ నిర్ణయిస్తుంది. తద్వారా Home Loan తీసుకునేవారికి మేలు జరగనుంది.
LPG Cylinders:
జూన్ 1న ఎల్‌పీజీ ధరలు కాస్త పెరిగాయి. ఈ పెరిగిన కొత్త ఎల్‌పీజీ ధరలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయి.