బారత్‌లో ఇటీవలే వచ్చిన మూడు పేమెంట్ ఆప్షన్లు మీకు తెలసా!
ఇది డిజిటల్ యుగం. ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో పని జరిపించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. వినియోగదారుల అవసరాలు తగ్గట్లే రోజుకో యాప్ పుట్టుకొస్తోంది. అలాగే కస్టమర్లు పేమెంట్ చేయడానికి కూడా యాప్ పుడుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌లో మూడు కొత్త పేమెంట్ ఆప్షన్లు వచ్చాయి. పేటీఎం, మొబిక్‌విక్, జీయో మనీ లాగే ఇవి కూడా వాలెట్‌లాగా ఉపయోగపడనున్నాయి. స్మార్టుఫోన్లు వాడే వారికి ఈ యాప్‌లు అందుబాటులో ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించే వారు ఎప్పుడైనా. ఎక్కడైనా పేమెంట్స్ చేయచ్చు. వీటిలో ప్రధానమైంది యూపీఐ ఎట్ పీఓఎస్ ఆప్షన్. యూనియన్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఇంతకుముందే ఉన్నదే అయినా దానికి ఇప్పుడు పీఓఎస్ తాజాగా వచ్చి చేరింది. దీని ద్వారా వినియోగదారులు రిటైల్ మర్చెంట్ ఔట్ లెట్లలో సులభంగా పేమెంట్ చేయచ్చు. ఐతే ఈ పద్ధతి ద్వారా పేమెంట్ చేయాలంటే మర్చెంట్ యూపీఐ ఎట్ పీఓఎస్ ఆప్షన్‌ను తన టెర్మినల్‌లో యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. డైనమిక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా కస్టమర్ సులభంగా పేమెంట్ చేయచ్చు.
ఇటీవల వచ్చిన మరో పేమెంట్ ఆప్షన్ శాంసాంగ్ పే. ఈ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనికి మన క్రెడిట్, డెబిట్ కార్డులను అటాచ్ చేసుకోవాలి. పేటీఎం, జియో మనీ తదితర వాలెట్‌లాగే శాంసాంగ్ పే1 ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. పీఓఎస్ టెర్మినల్‌ను టాప్ చేయడం ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు. మూడో ఆప్షన్ పేరు భారత్ క్యూఆర్. బార్‌కోడ్ ఆధారంగా పని చేసే పేమెంట్ ఆప్షన్ ఇది. మర్చెంట్ మన దగ్గర ఉన్న కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మూడు ఆప్షన్ల వల్ల ప్రధాన ఉపయోగం ఏంటంటే కార్డు స్వైప్ చేసినప్పడు జరిగే ఫ్రాడ్‌ల నుంచి కాపాడుకోవచ్చు. దీని వల్ల ప్లాస్టిక్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్‌లో ఈ యాప్‌లు ఉంటే చాలు ఎక్కడైనా.. ఎప్పుడైనా పేమెంట్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం భారత్‌లో 1.5 మిలియన్ పీఓఎస్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇప్పడు ఆ సంఖ్య మరో మిలియన్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.