ఏప్రిల్ నెల సగం కూడా గడవలేదు. ఎండ పేట్రేగిపోతోంది. మార్నింగ్ 9 కూడా కాకముందే వేడిగాలికి జనం భయపడిపోతున్నారు. మిట్టమధ్యాహ్నం ఎండ అయితే నిప్పుల వాన కురిపిస్తోంది. దీంతో ఏసీలు, కూలర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్,ఫ్లిప్‌కార్ట్, షాప్ క్లూస్ వంటివి ఈ డిమాండ్‌ను ఫుల్లుగా వాడేసుకుంటున్నాయి. భారీ అమ్మకాలతో పండగ చేసేసుకుంటున్నాయి.
డిమాండ్‌ను మార్కెట్ చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్, షాప్ క్లూస్ వేగంగా అడుగులు వేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా వీటిలో ఎయిర్‌కూలర్లు, ఏసీలతోపాటు రిఫ్రిజరేటర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి. ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ పేరిట మూడు రోజులపాటు స్పెషల్‌గా ఏసీలు, కూలర్ల విక్రయాలు చేపట్టింది. ఈ మూడు రోజులు సాధారణ రోజుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ సేల్స్ చేసింది. షాప్‌క్లూస్ కూడా గతేడాది ఏప్రిల్‌లో అమ్మినవాటి కంటే మూడు రెట్లు ఎక్కువగా ఏసీలు, కూలర్లు అమ్ముతున్నామని చెప్పింది.
ఒక్క రోజులోనే డెలివరీ..
ఏసీలు విక్రయించడమే కాదు.. సీజన్‌లొ దాన్ని ఇన్‌టైంలో డెలివరీ చేయడం, ఇన్‌స్టాల్ చేయడం చాలాచోట్ల కష్టంగా కనిపిస్తుంది. ఏసీ కొనేవరకు వెంటపడే డీలర్లు వాటిని డెలివరీ చేసి ఇన్‌స్టాల్ చేయడానికి రోజుల తరబడి టైంతీసుకుంటారు. ఈ విషయంలోనూ ఈటెయిలర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అమెజాన్ ఇందుకోసం లార్జ్ అప్లయన్స్‌స్ ను డెలివరీ చేయడానికి డెడికేటెడ్ సప్లయి చైన్‌నే మెయింటెన్ చేస్తోంది. 9 డెడికేటెడ్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు, 33 డెలివరీ స్టేషన్లను కేవలం ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్‌ల వంటి లార్జ్ అప్లయన్సెస్ సప్లయి చేయడానికే ఏర్పాటు చేసింది. దీనివల్ల డెలివరీ ఫాస్ట్‌గా, నమ్మకంగా అవుతుందని కంపెనీ చెబుతోంది. గత సంవత్సర కాలంలో తమ లార్జ్ అప్లయన్స్‌స్ అమ్మకాలు 200% పెరిగాయని అమెజాన్ ప్రకటిస్తోంది. తమ ఆర్డర్లలో 40 శాతాన్ని 24 గంటలకు ముందే కస్టమర్లకు అందిస్తోంది ఫ్లిప్ కార్ట్.
ఇన్‌స్టలేషన్ కూడా..
దీంతోపాటు ఇన్‌స్టాలేషన్‌కు ఏసీ కంపెనీలనే నమ్ముకోకుండానే తామే సపరేట్‌గా కొంతమంది టెక్నీషియన్లను పెట్టుకుని ఇన్‌టైంలో ఇన్‌స్టాలేషన్ కూడా చేయిస్తున్నాయి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్. కొన్ని ఏసీలపై ఇన్‌స్టాలేషన్ ఫ్రీ ఆఫర్లు కూడా ఉన్నా తమ చేతి డబ్బులు పెట్టడానికి కూడా ఈటెయిలర్లు వెనకాడడం లేదు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ ఖర్చు పెద్ద లెక్కలోనిది కాదన్నది వాటి అభిప్రాయం.