బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదం ఊపందుకుంది. రిటైల్ కంపెనీలు చైనా వస్తువులు అమ్మబోమని చెబుతున్నాయి. మరి ఈకామర్స్ కంపెనీల సంగతేంటి? ఇండియాలో ప్రధానమైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా వస్తువు ఎక్కడ ఉత్పత్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆలోచిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కూడా తమ ఫ్లాట్‌ఫామ్స్ మీద అమ్మే వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయో చెప్పాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్ రిటైలర్స్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చైనా మన సైనికులను హతమార్చిన నేపథ్యంలో ప్రధానంగా చైనా వస్తువులను బ్యాన్ చేసేందుకే వస్తువుల ఉత్పత్తి ఎక్కడ జరిగిందో చెప్పాలనే డిమాండ్ వస్తోంది.
చైనా ఫోన్ల మాటేమిటి?
ఇండియాలో అమ్మే స్మార్ట్‌ఫోన్లలో 80%కి పైగా చైనా తయారీవే. ఈకామర్స్ సైట్లలో ప్రధానమైన వాటా వీటిదే. షియోమి, ఒప్పో, వివో, హువావే, హానర్, రియల్‌మీ, రెడ్‌మీ ఇలా అన్ని ఫోన్ల కంపెనీలూ చైనావే. వీటి ఉత్పత్తి చైనాలో అని చెబితే చైనా ప్రొడక్ట్స్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసేవారు వీటిని కొనకుండా ఉంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశం. ప్రస్తుతానికి అయితే వస్తువుల ఉత్పత్తి ఏ దేశంలో జరిగిందనే అంశాన్ని తమ సైట్లలో ప్రదర్శిస్తామో లేదో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు.