ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ఇండియా కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. యూజర్లకు స్థానిక కొనుగోలుదారులు, విక్రేతల సమాచారం అందించానికి ఇది తోడ్పడుతుంది. ఇందులో పుస్తకాలు, మొబైల్ వంటి విభాగాల్లో కొత్త ఉత్పత్తులతో పాటు యూజ్డ్ గూడ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతానికి ఇందులో పది విభాగాలున్నాయి. బుక్స్, మొబైల్స్, ట్యాబ్లెట్స్, వీడియో గేమ్స్, మొబైల్ కవర్స్, జ్యూయలరీ, మూవీస్, క్లోతింగ్, హోం అండ్ మ్యూజిక్ ఉన్నాయి.
కాగా సంస్థల, పెద్దపెద్ద రిటైలర్లే కాకుండా ఇంట్లో తయారుచేసిన ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయానికి ఉంచే వీలుంటుందని భావిస్తున్నారు. గృహిణులు, ఇంజినీర్లు వంటివారు కూడా కొన్ని ఉత్పత్తులను ఇందులో విక్రయానికి పెట్టడమే దీనికి ఉదాహరణ. ఇందులో యూజ్డ్ అండ్ రీఫర్బిష్డ్ స్టోర్ కూడా ఉంది.
యూజర్లు తమ ప్రొడక్ట్స్ ఇందులో లిస్టింగ్ చేయడం కోసం ఒక ఫాం కూడా ఉంచారు. అందులో వివరాలన్నీ నింపాక యూజర్ విక్రాయానికి ఉంచిన ప్రొడక్ట్ అమెజాన్లో డిస్ ప్లే అవుతుంది.