నెల రోజులు దాటిపోయిన లాక్‌డౌన్‌తో అన్ని వ్యాపారాలు స్తంభించిపోయాయి. ఈ-కామర్స్ సంస్థలను కూడా నిత్యావసరాలు తప్ప మరే వస్తువులను విక్రయించేందుకు వీల్లేకుండా కేంద్రం ఆర్డర్స్ పాస్ చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో కూడా నిత్యావసర వస్తువులే అమ్ముకోగలుగుతున్నాయి. లాక్‌డౌన్ గడువు దగ్గర పడుతుండడంతో ఆన్‌లైన్లో నిత్యావసరాలే కాకుండా ఇతర వస్తువులను కూడా అమ్ముకునేందుకు వీలు కల్పించాలని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెంట్రల్ గవర్నమెంట్‌ను కోరాయి. అయితే దీన్ని గవర్నమెంట్ ఇంకా ఆమోదించలేదు.
చిన్న వ్యాపారులను ఆదుకుంటాం
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈ కామర్స్ కంపెనీలు వాస్తవానికి వస్తువులు అమ్మవు. వస్తువులు తయారుచేసి అమ్మేవాళ్లకు ఇవి ఓ ఫ్లాట్‌ఫామ్ మాత్రమే. తమ ఫ్లాట్‌ఫామ్‌పై ఆ సరకులను డిస్‌ప్లే చేస్తాయి. వాటిని కస్టమర్లు చూసి ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్‌ను తయారీదారుకు పంపిస్తాయి. వాళ్లు సరుకును కొనుగోలుదారుకు పంపిస్తారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌తో తమ ఫ్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి జీవించే వేల మంది చిన్న, మధ్యతరహా వ్యాపారులు అష్టకష్టాలు పడుతున్నారని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్
కేంద్రానికి చెప్పాయి.
అవసరాలు ఉన్నాయి కూడా
నిజానికి ప్రజలకు నిత్యావసరాలతోపాటు ఇతర సరకులు కూడా అవసరమవుతున్నాయి. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పాడైనవారు కొత్తవి కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నారని, తమకు వాటిని అమ్మడానికి అవకాశం ఇస్తే వాటిని తయారుచేసే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మేలు చేసినట్లవుతుందని ఈ రెండు కంపెనీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అలా చిన్న, మధ్య తరహా వ్యాపారులకు కూడా కష్టకాలంలో కాస్త చేయూత ఇచ్చినట్లవుతుందని చెప్పాయి. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారికి ఎలక్ట్రానిక్ వస్తువులు అవసరమవుతున్నాయని, కాబట్టి వాటి సరఫరాకు అవకాశమివ్వాలని కోరాయి.
, ఆన్‌లైన్ వస్తువుల విక్రయాలను అనుమతించడం ద్వారా వారికి తిరిగి జీవనోపాధి లభిస్తుందని తెలిపాయి.
సేఫ్టీ పాటిస్తామని హామీ
మా డెలివరీ స్టాఫ్‌కు పూర్తి భద్రత కల్పిస్తాం.
కస్టమర్లతో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ డెలివరీ చేస్తాం.
పూర్తి శానిటైజేషన్ చేసిన ప్యాకింగ్‌తో అందిస్తాం అని విజ్ఞప్తి చేశాయి..
ప్రభుత్వం ఏమంటుందో?
వాస్తవానికిరెండో విడత లాక్డౌన్ ప్రకటించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిత్యావసరేతర వస్తువులు సప్లయి చేయడానికి ఈ కామర్స్ కంపెనీలకు అవకాశమిచ్చింది. ఫ్లిప్ కార్ట్ లాంటి సైట్లు ఈమేరకు సప్లయి చేస్తామని ప్రకటనలు కూడా ఇచ్చాయి. అయితే కేసులు పెరగడంతో కేంద్రం ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. మే 3 తర్వాత అన్నా అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి.