ఎకో, డాష్, డ్రోన్, గో
ఈ కామర్స్ రాకతో షాపింగ్ యొక్క తీరు, పరిధి , విస్తృతి అన్నీ మారిపోయాయి. షాప్ లకి వెళ్లి షాపింగ్ చేయాలి అనే సాంప్రదాయ షాపింగ్ ధోరణులను ఆన్ లైన్ షాపింగ్ అనేది సంపూర్ణం గా మార్చివేసింది. అమెజాన్ , స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లాంటి అనేక సంస్థలు ఈ రంగం లో రాణిస్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తునాయి. మొదట్లో కొన్ని అంశాలకే పరిమితం అయిన ఈ ఆన్ లైన్ షాపింగ్ క్రమంగా తన విస్తృతి ని పెంచుకుంటుంది. నేడు ఆన్ లైన్ లో దొరకని వస్తువేదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఈ కంపెనీలు కూడా పోటీ పడి మరీ దాదాపు అన్ని వస్తువులనూ ఆన్ లైన్ లో అందిస్తున్నాయి. ప్రస్తుతం నిత్యావసర వస్తువులు కూడా ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి. కూరగాయలు కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. ఇన్ స్టా కార్ట్, దిన్, ప్లేట్ జాయ్ లాంటి స్టార్ట్ అప్ లు అమెరికా లో ఇప్పటికే నిత్యావసరాల డెలివరీ లో ప్రముఖంగా ఉంటుండగా మన దేశం లో బిగ్ బాస్కెట్ మరియు గ్రోఫర్స్ లాంటి సంస్థలు ఇప్పుడిప్పుడే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వీటిలో చాలా వరకూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. ఇవి ఎప్పుడు లాభాల బాట పడతాయో కాలమే నిర్ణయించాలి. కేవలo స్టార్ట్ అప్ లు మాత్రమే గాక కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా నిత్యావసరాల డెలివరీ పై కన్నేశాయి. వాటిలో ప్రముఖమైనవి అమెజాన్ మరియు గూగుల్.
గూగుల్
ముందుగా మనం గూగుల్ గురించి చెప్పుకోవాలి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ గత సంవత్సరం ఫిబ్రవరి లో గూగుల్ ఎక్స్ ప్రెస్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. శాన్ఫ్రాన్సిస్కో మరియు లాస్ ఏంజిల్స్ లలోని కొన్ని ప్రాంతాలకు సరుకుల డెలివరీ కి గూగుల్ దీనిని ప్రారంభించింది. ప్రాజెక్ట్ వింగ్ లో భాగంగా గూగుల్ ఈ సర్వీస్ ను ప్రారంభించింది. ప్రాజెక్ట్ వింగ్ అంటే డ్రోన్ ల ద్వారా సరుకులను చేరవేయడం అన్నమాట. ఈ డ్రోన్ లను వినియోగించాలన్నా లేక వీటిని కంట్రోల్ చేయలన్నా ఒక మానవ ఆపరేటర్ అవసరం. అయితే గూగుల్ యొక్క ఈ ప్రాజెక్ట్ ద్వారా US లోని గ్రాసరీ మార్కెట్ లో ఒక ప్రముఖమైన స్థానాన్ని గూగుల్ సంపాదించింది. దీనినుండి ప్రేరణ పొందిందో లేక పోటీ గా దిగిందో కానీ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన అమజాన్ కూడా నిత్యావసర మార్కెట్ లోనికి ప్రవేశించింది. కేవలం ప్రవేశం మాత్రమే కాదు నిత్యావసర మార్కెట్ లో గుత్తాధిపత్యం కోసం అనేక రకాల వినూత్న ప్రయోగాల తో ముందుకు వచ్చింది. వాటి గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
డాష్ బటన్
నిత్యావసరాల మార్కెట్ లో అమెజాన్ యొక్క విస్తృతిని వివరించుకోవాలి అంటే మనం ముందుగా డ్యాష్ బటన్ గురించి చెప్పుకోవాలి. ఇది 2015 మార్చి లో లాంచ్ చేయబడింది. నిత్యావసర వస్తువుల డెలివరీ ని సులభతరం చేసే ఉద్దేశం తో అమెజాన్ దీనిని ప్రారంభించింది. కిచెన్ అవసరాలకు, ఇతర నిత్యావసర వస్తువుల కోసం ప్రతీ సారి మార్కెట్ కు వెళ్ళవలసిన అవసరం లేకుండా కేవలం డ్యాష్ బటన్ ను ప్రెస్చేస్తే చాలు. మీకు ఏం కావలంటే అది మీ ఇంటికి వస్తుంది. మీ ఇంట్లో డిటర్జెంట్ అయిపోయిందా? అయితే టైడ్ డ్యాష్ బటన్ ప్రెస్ చేయండి, కూల్ డ్రింక్ అయిపోయిందా? అయితే కోకా కోల బటన్ ప్రెస్ చేయండి. ఇలా మనం ఇంట్లో వాడుకునే ప్రతీ వస్తువుకూ, ప్రతీ అవసరానికీ సంబందించిన డ్యాష్ బటన్ లను ఉపయోగించడం ద్వారా మనం షాప్ కి వెళ్ళే అవసరం లేకుండానే వాటిని పొందగలము.
అయితే అమెజాన్ దీనికోసం ప్రతీ డాష్ బటన్ కూ 5 డాలర్ లు ఛార్జ్ చేస్తుంది. మొట్టమొదటిగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్న వారికి ఈ 5 డాలర్ లు అమెజాన్ తిరిగి వారి ఎకౌంటు కు క్రెడిట్ చేస్తుంది.
మాట్లాడండి , షాపింగ్ చేయండి-- అమెజాన్ ఎకో తో
ఫైర్ ఫోన్ ద్వారా స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో విఫలయత్నం చేసిన అమెజాన్ ఆశ్చర్య కరమైన రీతిలో నిత్యవసరాల డెలివరీ రంగం లో ఎకో ని ప్రవేశ పెట్టింది. ఇది AI అసిస్టంట్ అలెక్సా తో పవర్ చేయబడి ఉంటుంది. ఇది ఒక స్పీకర్ లా పనిచేస్తూ మీ అవసరాలను అర్థం చేసుకుని వాటికి ప్రతిస్పందిస్తుంది. మీరు సంధించే అన్ని ప్రశ్నలను ఇది అర్థం చేసుకుని ప్లేయింగ్ మ్యూజిక్, క్యాబ్ లను తీసుకోవడం లాంటి ప్రక్రియ లను ప్రదర్శిస్తుంది. అచ్చం ఇలాగే నిత్యావసరాలను కూడా కేవలం మేకు ఏం కావాలో ఈ ఎకో లో చెప్పడం ద్వారా వాటిని మీ ఇంటికే రప్పించవచ్చు. అయితే ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. నిత్యావసర వస్తువులను మనం చూడక పోయినా సరే ఆర్డర్ చేయవచ్చు. అదే ఒక TV లేక ఫ్రిజ్ లాంటివి కావాలంటే లా చేయలేము కదా! పిక్చర్స్ చూడాలి, రివ్యూ లు చదవాలి, సైజు చూడాలి. నిత్యావసరాలకు రివ్యూ లు చదవాల్సిన అవసరం లేదు కదా!
డ్రోన్
ఈ డ్రోన్ లను అమజాన్ 2013 నుండీ అభివృద్ధి చేస్తూ వస్తుంది. నిత్యవసర వస్తువలను డెలివరీ చేయడం లో అమజాన్ యొక్క అన్ని ఉత్పాదన లలోనూ మొదటి స్థానం లో ఉంటుంది ఈ డ్రోన్ సర్వీస్. అత్యంత వేగంగా సరుకులను చేయవేయడం లో డ్రోన్ లకు సతి లేదు. US లో దీని టెస్టింగ్ పూర్తీ అయి UK లో కూడా దీనిని ప్రారంభించారు. అయితే దీనికి ఉన్న కొన్ని ప్రతికూలత ల దృష్ట్యా ఇంకా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికే నిత్యావసరాల మార్కెట్ పై తన పట్టును నిలుపుకునేందుకు అమజాన్ కు ప్రధాన ఆయుధాలలో ఇది కూడా ఒకటి.
అమజాన్ గో
డ్రోన్, డ్యాష్ బటన్, ఎకో లు వినియోగదారులు తమ నిత్యావసరాలను ఆన్ లైన్ ద్వారా పొందే వీలు కల్పిస్తున్నాయి. ఫోన్ ద్వారానో, డ్యాష్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానో మనం వీటిని పొందుతాము. మరి వీటిని చూడాలి అంటే. అంటే మంకు కావలసిన వస్తువులను చూసి పరేక్షించి తీసుకోవ్లై అంటే ఎలా? ఇలాంటి సందర్భాలలో అమజాన్ గో బాగా ఉపయోగపడుతుంది. ఒక నెల రోజుల క్రితం ఇది ప్రారంభం అయింది. మనకు కావలసిన వస్తువలను వీడియో డెమో రూపం లో ఇది చూపిస్తుంది. దానిని చూసి మనకు నచ్సినదాన్ని షాపింగ్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ వినూత్న ప్రయోగం US లో కేవలం ఒక్క స్టోర్ లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్ లో మరిన్ని స్టోర్ లకు దీనిని విస్తరించే యోచనలో అమజాన్ ఉంది.
చూశారుగా, డ్రోన్, డ్యాష్ బటన్, ఎకో, గో ఇలా ఈ నాలుగు ప్రధాన ఆయుధాలుగా చేసుకుని అమజాన్ నిత్యావసర మార్కెట్ పై తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం లో ఉంది. ఆ ప్రయత్నం లో చాలా వరకూ విజయవంతం అయింది కూడా .
"