ఈకామర్స్ కథ మారుతోంది.. లాక్‌డౌన్‌తో ఈకామర్స్ సంస్థల రూపురేఖలో మారిపోతున్నాయి. రెండు నెలలపాటు వ్యాపారం లేక గ్రాసరీ డెలివరీ చేసిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల కథ ఇంకా గుర్తుందిగా.. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత ఈకామర్స్ కంపెనీ అయిన అమెజాన్ ఫుడ్ డెలివరీలోకి అడుగు పెడుతోంది. మరో వైపు ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ లిక్కర్ డెలివరీకి ఆర్డర్స్ తీసుకుంటోంది.
బెంగళూరుతో షురూ
అమెజాన్ ఇండియా ఫుడ్ డెలివరీని బెంగుళూరుతో ప్రారంభించబోతోంది. బెంగుళూరులోని వైట్‌ఫీల్డ్, యశ్వంతపుర సహా నాలుగు ఏరియాల నుంచి తొలుత ఆర్డర్లు తీసుకోబోతోంది. అమెజాన్ ఫుడ్ పేరుతో ఈ ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంబిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. బెంగళూరులో రెస్పాన్స్ చూసి ఇతర నగరాలకు కూడా ఈ సర్వీసును విస్తరించాలన్నది కంపెనీ ప్లాన్.
లిక్కర్ డెలివరీలోకి స్విగ్గీ
ఇదిలా ఉంటే ఇప్పటికే ఫుడ్ డెలివరీలో ఉన్న జొమాటో, స్విగ్గీ లిక్కర్ డెలివరీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. లేటెస్ట్‌గా స్విగ్గీ జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి లిక్కర్ డెలివరీని ప్రారంభించినట్లు స్విగ్గీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలో ఏపీ, తెలంగాణల్లోనూ లిక్కర్ డెలివరీకి స్విగ్గీ సిద్ధమవుతోంది. ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ డెలివరీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతోంది. స్విగ్గి యాప్‌లో వైన్ షాప్స్ అనే కొత్త సెక్షన్ తీసుకొచ్చింది. దీనిలోకి లిక్కర్ ఆర్డర్ చేయొచ్చు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, బయటికి వెళ్లి కరోనా బారినపడే ప్రమాదం లేకుండా మందుబాబులకు మంచి ఆఫర్ తెచ్చింది స్విగ్గీ. ఏమో చూద్దాం జొమాటో కూడా త్వరలోనే వచ్చేస్తుందేమో..