ఈ సంవత్సరం మొదట్లో పేమెంట్ బ్యాంకు లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని కంపెనీల పేర్లను రిజర్వు బ్యాంకు ప్రకటించింది. పేమెంట్ బ్యాంకు అనేది ఒక కొత్త తరహా బ్యాంకు. వీటిలో వినియోగదారులు చిన్న చిన్న అకౌంట్ లను ఓపెన్ చేయవచ్చు,తద్వారా డిపాజిట్, విత్ డ్రా లాంటి లావాదేవీల తో పాటు రీఛార్జి లాంటివి కూడా చేసుకోవచ్చు. వీటివలన దేశం లో బ్యాంకు ల యొక్క విస్తృతి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే ఆశ్చర్యకరంగా ఈ జాబితా లో ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్ టెల్ పేరు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. RBI మొత్తం 11 కంపెనీలకు పేమెంట్ బ్యాంకు యొక్క లైసెన్స్ ఇస్తే వాటిలో ఎయిర్ టెల్ ఒకటిగా నిలిచింది. మొత్తానికి ఎయిర్ టెల్ తన పేమెంట్ బ్యాంకు యొక్క పైలట్ ప్రాజెక్ట్ ను రాజస్తాన్ లో ప్రారంభించింది. ఎంపిక చేయబడిన సుమారు 10,000 ల ఎయిర్ టెల్ రిటైల్ స్టోర్ లు పేమెంట్ బ్యాంకు ల యొక్క బ్రాంచ్ లుగా అప్ గ్రేడ్ చేయబడ్డాయి.వినియోగదారులు ఈ బ్రాంచ్ లను విజిట్ చేసి ఎకౌంటు ఓపెన్ చేయవచ్చు, డబ్బు డిపాజిట్ చేయవచ్చు, విత్ డ్రా చేయవచ్చు. మరొక పక్క దేశం లో రెండవ అతి పెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉన్న వోడాఫోన్ కూడా తన M- Pesa సర్వీస్ ద్వారా ఇదే తరహా సేవలను అందించడానికి ముందుకువచ్చింది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ యొక్క నోట్ల రద్దు నిర్ణయమునకు మద్దతుగా వినియోగదారులకు క్యాష్ అవుట్ ఫీచర్ ను ఇది ప్రవేశ పెట్టింది. M- Pesa సబ్ స్క్రైబర్ లు బారులు తీరిన బ్యాంకు క్యూ ల ముందు మరియు ATM ల ముందు గంటల తరబడి నిలబడే అవసరం లేకుండా వోడాఫోన్ అవుట్ లెట్స్ నుండే డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది. 500 మరియు 1000 నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత ప్రజానీకానికి టెలి com ఆపరేటర్ లలోని ఈ తరహా కదలిక అనేది కొంత ఉపశమనం గా మారనుంది. ఒక సాధారణ భారతీయ పౌరునికి వీటి వలన లాభాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.
వోడాఫోన్ M- pesa వాలెట్ వలన లాభాలు
ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంకు యొక్క ఉపయోగాలు
మొత్తానికి పెద్ద నోట్ల రద్దు నేపథ్యం లో వచ్చిన ఈ పేమెంట్ బ్యాంకు లు అనేవి తమ విస్తృతిని మరింత పెంచుకుని వినియోగదారునికి మరింత మేలు చేయాలని ఆశిద్దాం.