ఇప్పుడు నడుస్తుందంతా ఆన్‌లైన్ యుగమే. ఏం కావాలన్నా వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం సాధారణ విషయంగా మారిపోయింది. ఇందుకోసం డెబిట్ కార్డులతో పాటు ఎక్కువశాతం క్రెడిట్ కార్డులను కూడా ఉపయోగిస్తున్నాం. అయితే మనం చేసే ప్రతి ఖర్చును ప్రతి ట్రాన్సాక్షన్స్‌ను బ్యాంకులు వెనక నుంచి గమనిస్తూ ఉంటాయి. మీ ట్రాన్సాక్షన్లను బట్టే గూగుల్, ఫేస్‌బుక్ కూడా యాడ్స్ ఇస్తుంటాయి. అయితే మన ఆన్‌లైన్ షాపింగ్ డేటా నుంచి బ్యాంకులు కమిషన్ సంపాదిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా! మరి ఎలా సంపాదిస్తున్నాయో చూద్దామా!
మీ ఖర్చులను కనిపెట్టి
మనం చేసే ప్రతి ఖర్చు వివరాలు బ్యాంకు దగ్గర ఉంటాయి. మన అలవాట్లను బట్టి మన ఎక్కువగా ఖర్చు పెట్టే వాటిని గమనించి బ్యాంకులకు కూడా అందుకు సంబంధించిన ఆఫర్లను మనకు ఇస్తుంటాయి. అయితే ఇలా ఆఫర్లు ఇచ్చినందుకు కూడా రిటైలర్ల నుంచి బ్యాంకులు కమిషన్లు తీసుకుంటాయన్న సంగతి మనకు తెలియదు. మనం ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువు ఆర్డర్ ఇస్తే దీనికి సంబంధించిన ఆఫర్లలో బ్యాంకులు కూడా కొంత కమిషన్ కట్ చేసుకుంటాయి. ఇది బ్యాంకులకు, రిటైలర్లకు ఉండే లింక్. రిటైర్లకు తమ వస్తువులు అమ్ముడుపోతే.. బ్యాంకర్లకు కమిషన్ వస్తుంది. మరోవైపు గూగుల్, ఫేస్‌బుక్ కూడా తమ వినియోగదారుల సెర్చ్‌ను యూజ్ చేసుకుని దానికి తగ్గట్టుగానే యాడ్స్ ఇస్తుంటాయి.
బ్యాంక్ ఫాలో అవుతుంది
మనం చేసే ఖర్చులు ఎవరికీ తెలియవని మనం అనుకుంటూ ఉంటాం. కానీ బ్యాంకు మనల్ని నీడలా ఫాలో అవుతుంది. మనం చేసే ప్రతి ఖర్చును లెక్కలేసి పెడుతుంది. మన క్రెడిట్ ఇన్షర్మేషన్‌ను ఎప్పటికప్పుడు భద్రం చేస్తుంది. నిజానికి ఇది ఫెయిర్ కాదు. ఎందుకంటే మనకు సంబంధించిన సున్నితమైన విషయాల్ని ఎవరూ దాయకూడదు. కానీ బ్యాంకు మాత్రం ఆ పని చేస్తుంది. దీని వల్ల ఉపయోగం ఉంది. నష్టం కూడా ఉంది. మనకు తెలియకుండానే మన ఖర్చుల్లో కమిషన్ తీసుకోవడం కూడా ఈ నష్టంలో భాగమే.