గత కొన్ని రోజులనుండీ భారత ఆన్ లైన్ షాపింగ్ కస్టమర్ లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం అక్టోబర్ 2 వ తేదీ నుండీ ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభం అవనున్న బిగ్ బిలియన్ డే అమ్మకాలు. దీనికి మరొక రోజు మాత్రమే సమయం ఉండడంతో ఏ రోజు ఏం కొనాలి, డిస్కౌంట్లు ఏ స్థాయిలో ఉంటాయి అన్న విషయాలలో సర్వత్రా ఉత్కంత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్కార్ట్ అందించనున్న ఆఫర్ల గురించి ఒక నిశిత విశ్లేషణను అందిస్తుంది మన కంప్యూటర్ విజ్ఞానం
అక్టోబర్ 2 --- ఫ్యాషన్,హోమ్, టీవీ మరియు గృహోపకరణాలు
ఈ విభాగoలో రిటైలర్లు మొదటి రోజు సుమారు 50-80 శాతం డిస్కౌంట్ను అందించనున్నారు. ఆఫర్ లో భాగంగా BPL వివిడ్ 80 cm టీవీ రూ 12,999/- లకే లభిస్తుంది. సూపర్, డ్రై,టామీ హిల్ ఫిగర్, GAS, మరియు ఎంపోరియో అర్మాని లాంటి టాప్ అంతర్జాతీయ బ్రాండ్ లపై రిటైలర్ లు 50 శాతం డిస్కౌంట్ను అందించనున్నాయి. రే బాన్ సన్ గ్లాసెస్ ఫ్లాట్ 40% డిస్కౌంట్లో లభించనున్నాయి అంతేగాక కొన్ని వస్తువులపై రూ 3,100/- ల డిస్కౌంట్ తో ఇది కొన్ని క్రేజీ డీల్ లను కూడా అందిస్తుంది.
అక్టోబర్ 3 --- మొబైల్ మరియు యాక్సెసరీస్
ఫుల్ HD స్మార్ట్ ఫోన్ లను ఇవి రూ 5,499/- లకే అందించనున్నాయి. మోటో స్మార్ట్ ఫోన్పై మీకు ఫ్లాట్ 40% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేగాక పాపులర్ టాబ్లెట్లపై కనీసం రూ 5,000/-ల డిస్కౌంట్ ను అందించే ప్లాన్ లు కూడా జరుగుతున్నాయి. లెనోవా యొక్క 10400 mAh పవర్ బ్యాంకు కేవలం రూ 799/-లకే లభిస్తుంది. 5.7 ఇంచ్ డిస్ ప్లే 21MP కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ పై ఫ్లాట్ రూ 10,000/- ల డిస్కౌంట్ లభిస్తుంది. లీఎకో స్మార్ట్ ఫోన్ రూ 10,499/- లకే లభిస్తుంది. ఎక్స్ చేంజ్ పై రూ 8,000/- ల డిస్కౌంట్ లభిస్తుంది.
అక్టోబర్ 4 --- ఎలక్ట్రానిక్స్
లిస్టెడ్ వస్తువులను రూ 999/- లనుండే అందుబాటులో ఉంచనున్నారు. రూ 3,000/- ల నుండీ డిస్కౌంట్ ను అందించనున్నారు. ఇంటెల్ కోర్ i3 లాప్ టాప్లు డిస్కౌంట్ ధరలలో లభించనున్నాయి. అన్ని పాపులర్ గేమింగ్ కన్సోల్లపై రూ 11,000/- ల డిస్కౌంట్ లభించనుంది.
అక్టోబర్ 5 మరియు 6
ఈ సేల్ యొక్క ఆఖరి రెండు రోజులలో అన్ని కేటగరీలకు సంబందించిన అన్ని వస్తువులూ వెబ్ సైట్లోనూ మరియు యాప్లోనూ అమ్మకానికి ఉంచనున్నారు. ఎప్పటికపుడు ఇది అందించే వస్తువుల లిస్టును అప్ డేటెడ్గా ఉంచనుంది. ఈ అమ్మకాలలో అందించే మరికొన్ని ఆకర్షణీయమైన ఫీచర్ లను ఇక్కడ అందిస్తున్నాం.
నో కాస్ట్ EMI లు
ఇప్పుడు కొనండి - తర్వాత చెల్లించండి అనే ఆకర్షణీయ మైన ఆఫర్ లను వినియోగదారులకు ఈ సేల్ అందించనుంది. మీరు కొన్న వస్తువు యొక్క ధరను తర్వాత వడ్డీ లేని వాయిదాల రూపం లో మీరు చెల్లించవచ్చు. ఇది ఒక్కో వస్తువు కు ఒక్కో రకం గా ఉండే అవకాశం ఉంది.
పాత వస్తువుల ఎక్స్ చేంజ్
ఈ బిగ్ బిలియన్ డే సేల్ సందర్భంగా మీ పాత వస్తువులను ఎక్స్ చేంజ్
చేసుకుని కొత్త వస్తువులను కొనే అవకాశం కూడా ఉంది. కాకపోతే వస్తువు
విలువను బట్టి మీరు మరికొంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది. ఎంత
చెల్లించాలి అనేది మీ పాత వస్తువు ఉన్న స్థితి పై ఆధార పడి ఉంటుంది.
ఎక్కువ కొనండి- ఎక్కువ ఆదా చేయండి.
మీరు కొనే వస్తువుల సంఖ్యను బట్టి కూడా మీకు డిస్కౌంట్ లు లభిస్తాయి. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా కొంటె అంత ఎక్కువ డిస్కౌంట్లను మీరు పొందే అవకాశం ఉంది. ఎక్కువ కొంటే వాటిపై అదనపు డిస్కౌంట్ లను కూడా పొందే అవకాశం ఉంది.
|