• తాజా వార్తలు

దీపావ‌ళికి ల్యాప్‌టాప్ కొన‌బోతున్నారా? అయితే 7 బెస్ట్ బార్గెయిన్స్ మీ కోసం!

ఈ దీపావ‌ళికి ఓ మంచి ల్యాప్‌టాప్ కొనాల‌ని మీరు భావిస్తున్న‌ట్ల‌యితే మీకు అనువైన మంచి ఆఫ‌ర్లు అటు ఆన్‌లైన్‌, ఇటు ఆఫ్‌లైన్‌లో బోలెడున్నాయి. ఈ మేరకు విక్ర‌య‌దారులు విస్తృత శ్రేణిలో, భారీ డిస్కౌంట్ల‌తో మీకు డివైజ్‌లు అందించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుత బ‌డ్జెట్ ధ‌ర‌లో మీరు ఓ కొత్త‌, అప్‌గ్రేడ్ ల్యాప్‌టాప్‌ను సొంతం చేసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం. ఒక‌వేళ మీరు ల్యాప్‌టాప్ కొన‌డం ఇదే మొద‌టిసారి అయినా ప‌ర్వాలేదు... ఈ పండుగ వేళ మీకు అత్యుత్త‌మ ఆఫ‌ర్‌తో… అత్యాధునిక డివైజ్ ల‌భిస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక మీ అవ‌స‌రాల‌కు త‌గిన ల్యాప్‌టాప్ ఏదో నిర్ణ‌యించుకోవ‌డంలో తోడ్ప‌డేందుకు కొన్ని ఉత్త‌మ స్పెసిఫికేష‌న్లు, బ‌డ్జెట్ ధ‌ర‌గ‌ల ల్యాప్‌టాప్‌ల వివ‌రాలు మీ కోసం...
DELL INSPIRON 3565
నిత్య వినియోగానికి భేషైనది ఈ డెల్ ఇన్‌స్పిరాన్ ల్యాప్‌టాప్‌. అత్యాధునిక హార్డ్‌వేర్‌తోపాటు ఇందులో ముఖ్య‌మైన ఇంట‌ర్న‌ల్స్ ఉన్నాయి. బ‌ల‌మైన నిర్మాణంతో దీర్ఘ‌కాలం మ‌న్నుతుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ స్టోర్ల‌లో ఆఫ‌ర్లున్నాయి. స్పెసిఫికేష‌న్లు: • ఫుల్ HD 15.6 అంగుళాల డిస్‌ప్లే; • ఏడో త‌రం ఏఎండీ డ్యూయెల్ కోర్ A6 APU; • 4GB ర్యామ్; •    500GB హార్డ్ డిస్క్ డ్రైవ్‌; • ఉబుంటు; • యూఎస్‌బీ 2.0; • యూఎస్‌బీ 3.0; • HDMI; • 3-in-1 కార్డ్ రీడ‌ర్‌; • ODD; • ఇథ‌ర్నెట్‌.
ASUS VIVOBOOK X507
ఈ ల్యాప్‌టాప్ ఇటీవ‌లే మార్కెట్‌లోకి విడుద‌లైంది. ధ‌ర‌తో పోలిస్తే దీనిలో చాలా మంచి ఫీచ‌ర్లు ఉన్నాయి. మంచి హార్డ్‌వేర్ ఉన్నందువ‌ల్ల రోజువారీ వినియోగానికి చాలా అనువుగా ఉంటుంది. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ స్టోర్ల‌లో ఆఫ‌ర్లున్నాయి. స్పెసిఫికేష‌న్లు: • ఫుల్ HD 15.6 అంగుళాల డిస్‌ప్లే; • ఆరో త‌రం ఇంటెల్ i3 ప్రాసెస‌ర్‌; • 4GB DDR4 ర్యామ్; • 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజి; • ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌; • యూఎస్‌బీ 2.0; • యూఎస్‌బీ 3.0; • HDMI; • ఇథ‌ర్నెట్‌.
LENOVO V110
బ‌డ్జెట్ ధ‌ర‌లో లభించే ఈ ల్యాప్‌టాప్ నిత్య వినియోగానికి తిరుగులేనిద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇందులో మ‌న‌కు అవ‌స‌ర‌మైన ఫీచ‌ర్లతోపాటు ర‌క‌ర‌కాల విధులు నిర్వ‌ర్తించ‌గ‌ల స‌దుపాయాల‌న్నీ ఉన్నాయి. దీనిపై అమెజాన్‌లో ఆఫ‌ర్ ఉంది. స్పెసిఫికేష‌న్లు: • ఫుల్ HD 15.6 అంగుళాల యాంటీ గ్లేర్ స్క్రీన్‌; • 2.4GHz ఏఎండీ A6-9210 ప్రాసెస‌ర్‌; • 4GB ర్యామ్; • 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్; • యూఎస్‌బీ 2.0; • యూఎస్‌బీ 3.0; • HDMI; • ఇథ‌ర్నెట్‌; • ఫుల్ సైజ్ కీబోర్డ్‌; • 180 డిగ్రీల కోణంలో రొటేట్‌కాగ‌ల స‌ర‌ళ‌మైన మ‌డ‌త‌బందు కీలు (hinge).
ASUS EEEBOOK FLIP
ఓ ట్రెండీ ల్యాప్‌టాప్ కావాల‌ని మీరు భావిస్తుంటే ఈ క‌న్వ‌ర్ట‌బుల్ ‘ట్రిపుల్ ఈ బుక్ ఫ్లిప్‌’ మీకెంతో అనువైన‌ది. ఈ పోర్ట‌బుల్ ల్యాప్‌టాప్‌కు మంచి బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉంది. దీనిపై అమెజాన్‌లో ఆఫ‌రుంది. స్పెసిఫికేష‌న్లు: • 11.6 అంగుళాల ట‌చ్ డిస్‌ప్లే;  • 1.60 GHz ఇంటెల్ సెలెరాన్ N3050 ప్రాసెస‌ర్‌; • 2GB DDR3 ర్యామ్; • 64GB eMMC స్టోరేజ్‌; • యూఎస్‌బీ 3.0; • మైక్రో HDMI పోర్ట్‌; • 360 డిగ్రీల కోణపు డిజైన్‌; ట్యా బ్‌, టెంట్‌-ల్యాప్‌టాప్ మోడ్‌; విండోస్ 10; బ్యా ట‌రీ లైఫ్ 7 నుంచి 8 గంట‌లు.
LENOVO IDEAPAD 320
లెనోవో ఐడియాప్యాడ్ 320లోని అగ్ర‌శ్రేణి ప్రాసెస‌ర్‌, మంచి ప‌నితీరు దృష్ట్యా ఇదొక‌ మంచి బ‌డ్జెట్  ల్యాప్‌టాప్ అనే చెప్పాలి. మ‌నం చెల్లించే సొమ్ముకు త‌గిన విలువ‌గ‌ల డివైజ్‌. దీనిపై అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ స్టోర్ల‌లో ఆఫ‌ర్లున్నాయి. స్పెసిఫికేష‌న్లు: • 15.6 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌; • 1.8 GHz ఏఎండీ E2-9000 APU; • 4GB DDR3 ర్యామ్; • 1TB హార్డ్ డిస్క్ డ్రైవ్‌; • యూఎస్‌బీ 2.0; • యూఎస్‌బీ 3.0; • HDMI; • ఏఎండీ Radeon R2 గ్రాఫిక్స్‌; విండోస్ 10; బ్యా ట‌రీ లైఫ్ 5 నుంచి 6 గంట‌లు.
ASUS VIVOBOOK E203NAH
మీరెక్క‌డికి కావాలంటే అక్క‌డికి ఎంచ‌క్కా తీసుకెళ్ల‌గ‌ల ల్యాప్‌టాప్ ఇది. ఓ చిన్న ప్యాకేజీలో ముఖ్య‌మైన ఫంక్ష‌న్ల‌న్నీగ‌ల బుల్లి ప‌రిక‌రమిది... దీనిపై అమెజాన్‌లో ఆఫ‌ర్లున్నాయి. స్పెసిఫికేష‌న్లు: • 11.6 అంగుళాల డిస్‌ప్లే; • ఏడో త‌రం ఇంటెల్ సెలెరాన్ డ్యూయెల్ కోర్ ప్రాసెస‌ర్‌; • 2GB DDR3 ర్యామ్; • 500GB హార్డ్ డిస్క్ డ్రైవ్‌; విండోస్ 10; బ్యా ట‌రీ లైఫ్ 10 గంట‌లు; • యూఎస్‌బీ 2.0; • యూఎస్‌బీ 3.0; • HDMI. 
HP 15-BG007AU
మ‌నం పైన చెప్పుకొన్న జాబితాలో హెచ్‌పి కంపెనీ ల్యాప్‌టాప్ ఇదొక్క‌టే. అయిన‌ప్ప‌టికీ ఇది బ‌డ్జెట్ ధ‌ర‌లో ల‌భించే ఒక శ‌క్తిమంత‌మైన డివైజ్‌. మ‌ల్టీ టాస్కింగ్‌లో దిట్ట‌... ఏ ప‌రిస్థితిలోనైనా ప‌నిచేయ‌గ‌ల స‌మ‌ర్థ‌త దీని సొంతం. దీనిపై అమెజాన్‌లో ఆఫ‌ర్లున్నాయి. స్పెసిఫికేష‌న్లు: • 15.6 అంగుళాల హెచ్‌డి స్క్రీన్‌; • ఏడో త‌రం ఏఎండీ క్వాడ్ కోర్ A6-7310 APU ప్రాసెస‌ర్‌; Radeon R4 గ్రాఫిక్స్ మెమ‌రీ; • 4GB ర్యామ్; • 500GB SATA  హార్డ్ డిస్క్ డ్రైవ్‌; • యూఎస్‌బీ 2.0; • యూఎస్‌బీ 3.0; • HDMI; • బ్యాక్‌లిట్ కీబోర్డ్‌; విండోస్ 10.

జన రంజకమైన వార్తలు