కొత్త ఇంటికి మారారు.. అక్కడ ఫ్యాన్లు బిగించాలి. వాషింగ్ మిషన్‌కు వాటర్ కనెక్షన్ ఇవ్వాలి. ఏసీ ఇన్‌స్టాల్ చేయాలి.. వీటిన్నింటికీ ఎలక్ట్రీషియన్ కావాలి. కానీ కొత్త చోటు. ఎలక్ట్రీషియన్ ఎక్కడుంటారో తెలియదు. వచ్చినా ఎంత అడుగుతారో తెలియదు.
బాత్‌రూంలో పైపు లీకవుతోంది. నీళ్లన్నీ వృథా అయిపోతున్నాయని ఇంట్లో ఒకటే గొడవ. ప్లంబర్ వస్తే పది నిముషాల పనే. కానీ ఎక్కడ దొరుకుతారు? ఒకవేళ దొరికినా అంత చిన్నపనికి రాలేమంటే..
నాన్నా ఫంక్షనుంది.. ఆ బ్యూటీపార్లర్ చాలా దూరం. మీరు తీసుకెళ్లండి.. అమ్మాయి అడిగితే కాదని చెప్పలేం. తీసుకెళదామంటే ఆఫీసు పని ఒత్తిడి.. ఏం చేయాలి?
పండగ దగ్గరికొచ్చేసింది. ఇద్దరికీ ఉద్యోగాలు.. పిల్లలకు చదువుల హడావుడి. అలాగని బూజులు వేలాడుతూ, మురికిపట్టేసిన ఫ్లోరింగ్, షింక్‌లు శుభ్రం చేసుకోకుండా పండగ చేసుకోలేం కదా.. ఎలామరి?
ఇలాంటి ఏ సమస్యకైనా ఆన్‌లైన్ వేదికగా బోల్డన్ని పరిష్కారాలు దొరికేస్తున్నాయి.
చిన్నచిన్న ఇంటి పనులు.. కానీ సంబంధిత టెక్నీషియన్ వస్తేగానీ మనం చేసుకోలేనివి చాలా ఉంటాయి. నిపుణుల కోసం తిరగాలంటే అన్ని సందర్బాల్లో దొరకరు. ముఖ్యంగా నగరాల్లో, పెద్ద పట్టణాల్లో ఈ పరిస్థితి కాస్త ఇబ్బందికరమే. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు చాలా సంస్థలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సదరు సైట్‌లోకి వెళ్లి మనకు ఏ రకమైన సేవలు అవసరమో ఆ విభాగంలోకి వెళ్లి మన చిరునామా, ఫోన్ నెంబర్ ఇస్తే టెక్నీషియన్‌ను నేరుగా ఇంటికే పంపిస్తారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్, క్లీనింగ్, వాషింగ్.. ఇలా పనిని బట్టి ఛార్జీ ఉంటుంది. పక్కాగా పని తెలిసినవారినే పంపుతారు కాబట్టి పనితీరు ఎలా ఉంటుందోనన్న ఆలోచన కూడా అక్కర్లేదు. ఛార్జి కూడా ఆన్‌లైన్‌లో పే చేయవచ్చు.
హౌస్ జాయ్
ఇంటి వద్దకు వచ్చి సేవలందించేందుకు ఉద్దేశించిన యాప్‌ల్లో బాగా ప్రాచుర్యం పొందిన యాప్ ఇది.
* ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఫోన్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. లొకేషన్ యాక్సెస్ చేసుకుంటే సర్వీసు మరింత వేగంగా అందేందుకు వీలుంటుంది.
* రిజిస్టర్ చేసిన వివరాలతో యాప్‌లో లాగిన్ అయితే హోం పేజీకి వెళతారు.
* మీకు ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయో హోం పేజీలో కేటగిరీల వారీగా కనిపిస్తాయి.
* మీకు అవసరమైన సేవను ఉదాహరణకు ఎలక్ట్రికల్ వర్క్ అయితే ఆ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
* ఫ్యాన్ బిగించాలా.. లైట్లతో సమస్యా ఏ రకం సేవ కావాలో ఎంచుకోవాలి.
* దేనికి ఎంత ఛార్జి ఉంటుందో స్క్రీన్‌పై కనిపిస్తుంది. కావలసిన సర్వీస్‌ను బుక్ చేసుకోవాలి.
* సర్వీసు చేసేందుకు ఏ తేదీన ఎన్ని గంటలకు రావాలో మనమే నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల కేవలం ఆ సర్వీస్ కోసం మన పనుల్ని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
* పేమెంట్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
* ఫ్యాను రిపేర్, టీవీ, ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఏ సర్వీస్ కావాలంటే దానిపై క్లిక్ చేసి ముందుకెళ్లాలి.
* సెలూన్, బ్యూటీషియన్ వంటి సేవలు కూడా ఇంటివద్దే చేయించుకోవచ్చు.
* సేవలపై కొన్నిసార్లు క్యాష్‌బాక్ లేదా డిస్కౌంట్లు కూడా లభ్యమవుతాయి.
* హౌస్ జాయ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్‌పై 200 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. కొన్నిసార్లు ఫస్ట్ ఆర్డర్ ఫ్రీగా కూడా చేస్తారు.
అర్బన్ క్లాప్
హౌస్‌జాయ్ మాదిరిగానే ఇది కూడా హోమ్ సర్వీసులు అందించే యాప్.
* ప్లేస్టోర్ నుంచి అర్బన్‌క్లాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* ఫోన్ నెంబర్, అడ్రస్ వంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. లొకేషన్ యాక్సెస్ చేసుకుంటే సర్వీసు మరింత వేగంగా అందేందుకు వీలుంటుంది.
* రిజిస్టర్ చేసిన వివరాలతో యాప్‌లో లాగిన్ అయితే హోం పేజీకి వెళతారు.
* మీకు ఎలాంటి సేవలు అందుబాటులో ఉంటాయో హోం పేజీలో కేటగిరీల వారీగా కనిపిస్తాయి.
* మీకు అవసరమైన సేవను ఉదాహరణకు ప్లంబింగ్ వర్క్ అయితే ఆ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
* కావలసిన సర్వీస్‌ను బుక్ చేసుకోవాలి.
* సర్వీసు చేసేందుకు ఏ తేదీన ఎన్ని గంటలకు రావాలో మనమే నిర్ణయించుకోవచ్చు.
* పేమెంట్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
* ఫ్యాను రిపేర్, టీవీ, ఫ్రిజ్, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ఏ సర్వీస్ కావాలంటే దానిపై క్లిక్ చేసి ముందుకెళ్లాలి.
* సెలూన్, బ్యూటీషియన్ వంటి సేవలు కూడా ఇంటివద్దే చేయించుకోవచ్చు.
* కారు లేదా బైక్ సర్వీసింగ్ కూడా చేయించుకోవచ్చు. కారు లేదా బైక్ ఎక్కడైనా రోడ్‌లో వెళుతుండగా ఆగిపోయినా యాప్‌లో సర్వీసు బుక్ చేస్తే వెంటనే నిపుణులు వచ్చి తీసుకెళ్లి బాగు చేయించి మీ అడ్రస్‌కు తెచ్చిస్తారు.
* సేవలపై కొన్నిసార్లు క్యాష్‌బాక్ లేదా డిస్కౌంట్లు కూడా లభ్యమవుతాయి.
మరిన్ని యాప్‌లు..
క్వికర్, హెల్పర్ హోం, హోం సర్వీస్ వంటి చాలా యాప్‌లు ఇలాంటి సేవలు అందిస్తున్నాయి.
లాండ్రీ అవసరాల కోసం పిక్ మై లాండ్రీ, క్లిక్ 2 వాష్, విష్ టు వాష్, సెలూన్ సేవలకు గెట్ లుక్ వంటి యాప్‌లున్నాయి.
యాప్‌లే కాదు ఆయా పేర్లతో ఆన్‌లైన్‌లోనూ సైట్లున్నాయి. వాటిలోకి వెళ్లి కూడా సర్వీస్ బుక్ చేసుకోవచ్చు.