అన్నింటికీ ఆన్‌లైన్ వచ్చేసింది. సినిమా టిక్కెట్లకేం తక్కువ? అందుకే టిక్కెట్లను ఆన్‌లైన్‌లో కొనుక్కునేందుకు చాలా యాప్‌లు అందుబాటులోకి వచ్చేశాయి. మొబైల్ ఫోన్ యాప్‌ల్లో సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవడం చాలా సులువు. జస్ట్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ పేరు, ఈ మెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలు నమోదు చేస్తే చాలు మీ పేరున ఓ ఎకౌంట్ తయారైపోతుంది. కావల్సినప్పుడల్లా యాప్‌లోకి వెళ్లి మీకు నచ్చిన సినిమాకు నచ్చిన రోజున టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే చాలు టిక్కెట్ వివరాలతో మీ సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అదే మీ టిక్కెట్. థియేటర్‌లో దాన్ని చూపించి నేరుగా లోపలికి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
చాలా సౌకర్యం
* సినిమాకు వెళదామనుకుంటే వారం రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసేసుకోవచ్చు. ఎంత ముందు బుక్ చేసుకుంటే అన్ని సీట్లు అందుబాటులో ఉంటాయి.
* యాప్‌లోకి లేదా ఆ కంపెనీ వెబ్ సైట్‌లోకి వెళితే తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇలా రకరకాల భాషల్లో ఏ థియేటర్‌లో ఏ సినిమా ఆడుతుందో చూపిస్తుంది. ఏ రోజు ఏ షోకి ఏ థియేటర్‌కు వెళ్లాలనేది మనమే నిర్ణయించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సీట్లను బట్టి థియేటర్‌లో ఏ వరుసలో కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు.
* దీనివల్ల మీకు బోల్డంత టైమ్ కలిసొస్తుంది. షో మొదలవడానికి పది, పదిహేను నిముషాల ముందు థియేటర్‌కు వెళితే చాలు.
* అన్నింటికంటే ముఖ్యంగా మనం వెళ్లేసరికి టిక్కెట్లు ఉంటాయో లేదోనని హైరానా పడక్కర్లేదు.
* సినిమాతోపాటు పెద్ద నగరాల్లో నాటకాలు, నృత్యప్రదర్శనలు, కామెడీ షోలు వంటి వి కూడా జరుగుతుంటాయి. వీటికి కూడా మొబైల్ యాప్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
* టిక్కెట్లతోపాటు మధ్యలో తినేందుకు స్నాక్స్, కూల్‌డ్రింక్స్ వంటివి కూడా ముందే ఆర్డర్ చేసుకోవచ్చు.
* టికెట్ బుక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీకి చెప్పాలనుకుంటే ఆప్‌లో ఆప్షన్ ఉంది. అక్కడ వాళ్ల ఫోన్ నెంబర్ వేస్తే నేరుగా వాళ్ల సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ వెళ్లిపోతుంది.
* అంతేకాదు మీరు రెండు టిక్కెట్లు కొన్నారు ఫ్రెండ్ దగ్గరో కొలీగ్ దగ్గరో రెండో టిక్కెట్ కు డబ్బులు తీసుకోవాలనుకుంటే షేరింగ్ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేస్తే వాళ్లు ఎంత పే చేయాలో మెసేజ్ వాళ్ల సెల్‌కు వెళుతుంది. వాళ్లు ఆ డబ్బులు అక్కడ పే చేస్తే మీ యాప్‌లోని ఖాతాలోకి వచ్చేస్తాయి.
యాప్‌లున్నాయి చాలా
బుక్ మై షో, జస్ట్‌టికెట్, టికెట్ న్యూ వంటి యాప్‌లతోపాటు పేటీఎం వంటి కొన్ని మొబైల్ వాలెట్ల ద్వారా కూడా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. యాప్‌లే కాదు వీటిపేర్లతో ఆన్‌లైన్లోకి వెళ్లి కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
బుక్ మై షో
* సినిమా టిక్కెట్ ఆన్‌లైన్ బుకింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు బుక్ మై షో. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సినిమా టిక్కెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు. సినిమాలతోపాటు నాటకాలు, కామెడీ షోలు, ఐపీఎల్, ప్రో కబడ్డీ వంటివాటికి టిక్కెట్లు దొరుకుతాయి.
* కొన్నిసార్లు వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెడతారు. అంటే రెండు టిక్కెట్లు కొంటే ఒకదానికి డబ్బులు చెల్లిస్తే చాలు
* వారం మధ్యలో సినిమా టిక్కెట్లపై 50 % వరకు కూడా ఈ యాప్‌లో క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆ ఎమౌంట్ మీ బీఎంఎస్ ఎకౌంట్‌లో కలుస్తుంది. దానితో తర్వాత సారి వాడుకోవచ్చు.
* కొన్నిసార్లు టిక్కెట్ కొంటే స్నాక్స్ ఫ్రీ వంటి ఆఫర్లు పెడతారు.
* బ్యాంకు కార్డులతో చెల్లించేవాళ్లకు కొన్ని ఆఫర్లు ఉంటాయి. ఐసీఐసీఐ కోరల్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుతో బుక్ చేసుకుంటే నెలలో ఒకసారి వన్‌ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ఇస్తున్నారు.
* *టికెట్ బుక్ చేసేటప్పుడు ఫ్రీగా లేదా ఒకటి రెండు రూపాయలకు కొన్ని వోచర్లు కూడా ఇస్తారు. వీటిని మనం తీసుకుంటే పలు రెస్టారెంట్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, కొన్ని దుకాణాల్లో 10 నుంచి 20 శాతం వరకు తగ్గింపు, ఒకటి కొంటే ఒకటి ఆఫర్లు వంటివి దొరుకుతాయి. అయితే వీటిని గడువులోపలే వినియోగించుకోవాలి.
పేటీఎం
* ఈ మొబైల్ వాలెట్ నుంచి కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
* ఎక్కువ వన్ ప్లస్ వన్ ఆఫర్లు దీనిలో దొరుకుతున్నాయి. ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే చాలు