డీమానిటైజేషన్ తో ఆన్‌లైన్ షాపింగ్ బిజినెస్ తగ్గిందా? గతంలో మాదిరిగా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేవారు తగ్గారా? అందుకే ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ ఇలా ఆఫర్లు గుప్పిస్తున్నాయా.. ఇలాంటి ప్రశ్నలు చాలా చోట్ల వినిపిస్తూనే ఉన్నాయి. అయితే డీమానిటైజేషన్ తర్వాత ఆన్‌లైన్ షాపర్స్ దృక్పథంలో మార్పు వచ్చిందని, విలాసవంతమైన వస్తువులు (లగ్జరీ గూడ్స్) కొనే ఆన్‌లైన్ కస్టమర్లు పెరిగారని అలాంటి వస్తువులు విక్రయించే వెబ్‌సైట్లు చెబుతున్నాయి. అయితే వీటిలో బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్‌తోపాటు సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ కు కూడా ఆదరణ పెరుగుతోంది. పెద్దగా వాడని వస్తువులకు కూడా ఆన్‌లైన్‌లో 40 నుంచి 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని ఎక్కువ మంది వీటిని కొనడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో కొనేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే డిస్కౌంట్ ఉంటేనే కొనే ధోరణి పెరిగిందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
500, 1000 నోట్లు రద్దు చేసిన తర్వాత పరిస్థితుల్లో తమకు కొత్త కస్టమర్లు పెరిగారని లగ్జరీ ప్రొడక్ట్స్ అమ్మే కాన్ఫిడెన్షియల్ కోచ్చర్, డార్వీస్ వంటి సంస్థలు చెబుతున్నాయి. కాన్ఫిడెన్షియల్ కోటర్ సంస్థ లగ్జరీ ప్రొడక్ట్స్‌ను మూడు కేటగిరీలుగా విక్రయిస్తుంది. నెవర్ యూజ్డ్ అనే కేటగిరీలో పూర్తిగా బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ ఉంటాయి. జంట్లీ యూజ్డ్ , ఫెయిర్లీ యూజ్డ్ కింద సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయిస్తుంది. అయితే ఇవి పెద్దగా వాడనివే ఉంటాయి. నెవర్ యూజ్డ్ ప్రొడక్ట్స్‌ను 30నుంచి 40 శాతం డిస్కౌంట్‌తో అమ్ముతున్నారు. జంట్లీ యూజ్డ్ వి 40 నుంచి 60 % డిస్కౌంట్‌తో దొరుకుతున్నాయి. ఫెయిర్లీ యూజ్డ్ వాటికి మరింత డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో విలాసవంతమైన వస్తువులు కొనాలని ఉన్నా రేటు చూసి వెనక్కి తగ్గేవారు ఇలాంటి ఆఫర్లలో కొనడానికి బాగా ముందుకొస్తున్నారు. అంతేకాదు అంతకు ముందు బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్‌ను కొనేవారు కూడా డీమానిటైజేషన్ తర్వాత జంట్లీ యూజ్డ్ వాటిని కొంటున్నారు. ఈ విభాగంలో తమ అమ్మకాలు డీమానిటైజేషన్ తర్వాత 15 శాతం పెరిగాయని కాన్ఫిడెన్షియల్ కోచ్చర్ ఫౌండర్ అన్వితా మెహ్రా చెప్పడం ఇందుకు నిదర్శనం. లూయీస్ విటాన్, గూచీ, చెనెల్ వంటి బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని చెప్పారు.
డిస్కౌంట్ మేటర్స్..
డీ మానిటైజేషన్ తో తాము చాలా భయపడ్డామని, అయితే తర్వాత కొత్త కస్టమర్లు కూడా పెరిగారని ఫ్యాషన్ పోర్టల్ డార్వీస్. కామ్ ఫౌండర్ నకుల్ బజాజ్ అన్నారు. ఫెండీ, జిమ్మీ ఛూ, బర్‌బ్రీ, ఎంపరో ఆర్మానీ వంటి ప్రఖ్యాత కంపెనీల ప్రొడక్ట్స్‌ను తాము ఎక్కువగా అమ్ముతామన్నారు. డీమానిటైజేషన్ జరిగిన కొత్తలో నష్టపోయిన సేల్స్‌ను ఈ కొత్త కస్టమర్లతో పెంచుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అయితే సేల్స్‌ను నిర్ణయించేది ప్రస్తుతం డిస్కౌంట్లేనని చెప్పారు. ఎంపరో ఆర్మనీపై తమ పోర్టల్‌లో 60 % డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు. మిగిలిన వాటికి 30 నుంచి 60% డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు. కాగా క్యాష్ ఆర్డర్స్ బాగా తగ్గి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నయన్నారు. డార్వీస్. కామ్ స్టో ర్స్‌లో మొన్నటి వరకు 75% క్యాష్ ట్రాన్సాక్షన్లే నడిచేవని, నవంబర్, డిసెంబర్‌ల్లో ఇవి 20 శాతానికి పడిపోయానని నకుల్ బజాజ్ వివరించారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు కూడా 80 శాతం పెరిగాయని చెప్పారు.
స్మిట్టన్ అనే మరో లగ్జరీ ప్రొడక్ట్స్ పోర్టల్ కూడా డీమానిటైజేషన్ తర్వాత మంచి ప్రోగ్రెస్ చూపించింది. దీని మెంబర్లు ఈ రెండు నెలల్లో 25 వేల నుంచి 50 వేలకు పెరిగారని కంపెనీ కో ఫౌండర్ స్వగతా సారంగి చెప్పారు.