• తాజా వార్తలు

ATM లో డబ్బులు విత్ డ్రావల్ మాత్రమే కాదు! మరో 9 ఉపయోగకరమైన పనులు చేయొచ్చు!

 

సాధారణంగా మనం ATMను ఉపయోగించి ఏం చేస్తాము? ఏముంది మన డబ్బు విత్ డ్రా చేసుకుంటాము లేదా బ్యాలన్స్ చెక్ చేసుకుంటాము అంతేకదా! కొంతమంది అయితే మనీ ట్రాన్సఫర్ చేస్తారు. ఈ మధ్యే క్యాష్ డిపాజిట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి కదా! అయితే ATMను ఉపయోగించే మనం చేసే సాధారణ పనులతో పాటు మరికొన్ని కూడా చేయవచ్చని మనలో ఎంతమందికి తెలుసు? అందుకే అసలు ATMను ఉపయోగించి మనం చేయగలిగిన 9 రకాల పనులను గురించి ఒక సవివర వ్యాసం అందిస్తున్నాం. చదివేయండి.

1. ఫిక్సెడ్ డిపాజిట్ ను ఓపెన్ చేయవచ్చు లేదా విత్ డ్రా చేసుకోవచ్చు

మీరు మీ బ్యాంకు ATM కార్డును ఉపయోగించి ఫిక్సెడ్ డిపాజిట్ ను ఓపెన్ చేయవచ్చు. కొన్ని కొన్ని బ్యాంకులు ఈ సర్వీస్ ను అందిస్తాయి. ATM మెనూ లో ఓపెన్ ఫిక్సెడ్ డిపాజిట్ అనే దానిని సెలెక్ట్ చేసుకుని కాల వ్యవధిని కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత డిపాజిట్ చేస్తున్నారో ఆ అమౌంట్ ను ఎంటర్ చేసి కన్ఫాం చేసి మిగతా అవసరమైన వివరాలను ఎంటర్ చేస్తే చాలు , మీ ఫిక్సెడ్ డిపాజిట్ ఓపెన్ అవుతుంది.

2. మీ మొబైల్ ను రీ ఛార్జ్ చేసుకోవచ్చు.

చాలా బ్యాంకులు ఈ సర్వీస్ ను అందిస్తున్నాయి. మొబైల్ ఆపరేటర్ ల ప్రీపెయిడ్ సర్వీస్ లను ఈ ATMలను ఉపయోగించి రీ ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం మీ ఫోన్ నంబర్ మాత్రమే కాక మీ స్నేహితుల మరియు కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్ లను కూడా ఈ ATM ను ఉపయోగించి రీ ఛార్జ్ చేయవచ్చు. మీ ATM

మెనూ లో రీ ఛార్జ్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని మొబైల్ నంబర్ మరియు రీ ఛార్జ్ చేసే అమౌంట్ ఎంటర్ చేస్తే చాలు మీ రీ ఛార్జ్ పూర్తి అవుతుంది.

3. ఇన్ కం టాక్స్ చెల్లించవచ్చు.

ATM లను ఉపయోగించి ఆదాయ పన్ను చెల్లించే సౌకర్యాన్ని కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. అడ్వాన్స్డ్ టాక్స్, సెల్ఫ్ అసెస్మెంట్ టాక్స్,  టాక్స్ డ్యూ లు కూడా  ATMను ఉపయోగించి చెల్లించవచ్చు. మొట్టమొదటగా ఈ సౌకర్యాన్ని ఉపయోగించడానికి ముందు బ్యాంకు యొక్క వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. మీ ఎకౌంటు నుండి డబ్బు తగ్గించబడిన తర్వాత ATM ఒక యూనిక్ నంబర్ ను జనరేట్ చేస్తుంది. దీనిని CIN అంటారు. 24 గంటల తర్వాత బ్యాంకు వెబ్ సైట్ ను విజిట్ చేసి CIN ను ఉపయోగించి చలానను ప్రింట్ తీసుకోవచ్చు.

4. క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు

దీని గురించి చాలా మందికి తెలుసు. దాదాపు అన్ని బ్యాంకు లూ ఈ సేవలను అందిస్తున్నాయి. చాలా బ్యాంకులు వాటి ATMల పక్కనే CDM లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఒక్కో ట్రాన్సక్షణ్ కూ రూ 49,900/- ల వరకూ డిపాజిట్ చేయవచ్చు. రూ 100, 500, 1000ల నోట్ లను మాత్రమే ఇది అంగీకరిస్తుంది.

5. ఇన్స్యూరెన్స్ ప్రీమియం చెల్లించండి.

LIC, HDFC లైఫ్ మరియు SBI లైఫ్ లాంటి భీమా కంపెనీలు ATM ల ద్వారా వాటి భీమా ప్రీమియం చెల్లించేందుకు వీలుగా బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పాలసీ నంబర్ ను మీతో ఉంచుకుంటే చాలు ATM మెనూ లో బిల్ పే అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మీ కంపెనీని సెలెక్ట్ చేసుకుని మీ పాలసీ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ను ఎంటర్ చేసి ప్రీమియం అమౌంట్ ను కూడా ఎంటర్ చేసి కన్ఫాం చేయాలి. మీరు ప్రీమియం చెల్లించబడుతుంది.

6. పర్సనల్ లోన్ కు అప్లై చేయవచ్చు.

చిన్న చిన్న పర్సనల్ లోన్ లను అప్లై చేయడానికి మీరు బ్యాంకు దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. లేదా బ్యాంకు ప్రతినిధితో ఫోన్ లో కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. ప్రైవేటు సెక్టార్ లోని కొన్ని బ్యాంకులు ATMల ద్వారా చిన్న చిన్న పర్సనల్ లోన్ లకు అప్లై చేసే సదుపాయాన్ని కల్పిసున్నాయి. మీ లోన్ అమౌంట్ అనేది మ మీ ట్రాన్సక్షన్ వివరాలు, ఎకౌంటు బాలన్స్, శాలరీ క్రెడిట్ లు, క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు రీ పే మెంట్ లు తదితరాలపై ఆధారపడి ఉంటుంది.

7. క్యాష్ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు

ఇది కూడా దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా కాలం నుండీ బ్యాంకు లు ఈ సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీకు నెట్ బ్యాంకింగ్ సౌకర్యం లేకపోతే ATM ను ఉపయోగించి మీ స్నేహితులకు కానీ తెలిసిన వారికి కానీ డబ్బు పంపించవచ్చు. మీరు ఎవరికైతే డబ్బు పంపాలి అనుకుంటున్నారో వారి ఎకౌంటు వివరాలు మీ బ్యాంకు లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఆన్ లైన్ లో అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజుకి గరిష్టంగా రూ 40,000/- ల వరకూ ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.

8. మీ బిల్లులు చెల్లించవచ్చు.

మీ టెలి ఫోన్ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు, గ్యాస్ బిల్, మరియు ఇతర బిల్లులను కూడా మీ ATM ల ను ఉపయోగించి చెల్లించవచ్చు. కాకపోతే మీరు పే మెంట్ చేసే ముందు మీ బ్యాంకు వెబ్ సైట్ లో సంబందిత వివరాలు రిజిస్టర్ చేయవలసి ఉంటుంది.

9. రైల్వే టికెట్ లను బుక్ చేయవచ్చు

పబ్లిక్ సెక్టార్ బ్యాంకు లైన SBI మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకు లాంటి కొన్ని బ్యాంకులు ATMల ద్వారా రైల్వే టికెట్ లను బుక్ చేసుకునే సౌకర్యాని అందిస్తున్నాయి. అదికూడా రైల్వే స్టేషన్ లకు దగ్గర లోని ఎంపిక చేసిన కొన్ని ATM ల లోనే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎక్కువ దూరం ప్రయాణించే సర్వీస్ లకు మాత్రమే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

 

"

జన రంజకమైన వార్తలు