మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే మీరు పీఎఫ్ విత్‌డ్రా అంశానికి సంబంధించిన విషయాలను ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. తాజాగా పీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించి ఒక నిబంధన మారింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం మీరు ఆఫ్‌లైన్ మోడ్‌లో పీఎఫ్‌ను విత్ డ్రా చేసుకోలేరట.
ఉద్యోగి ఆధార్ నెంబర్ యూఏఎన్ నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. ఇలాంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌వో పీఎఫ్ క్లెయిమ్స్‌ను తిరస్కరిస్తుంది. యూఏఎన్‌తో ఆధార్ లింక్ అయ్యి ఉంటే అప్పుడు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవాలి.
సాధారణంగా ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులను అవసరాలకు అనుగుణంగా విత్ డ్రా చేసుకోవచ్చు. తాజాగా మారిన రూల్ ప్రకారం ఉద్యోగి ఆదార్ నెంబర్ UAN (యూనివర్సల్ అకౌంట్ నెంబర్) నెంబర్‌తో అనుసంధానమై ఉంటే అప్పుడు ఆఫ్‌లైన్‌లో పీఎఫ్ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకులేరు. ఇలాంటి సందర్భాల్లో ఈపీఎఫ్ఓ.. PF క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. UAN ఆధార్‌తో లింక్ అయి ఉంటే అప్పుడు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలి.
యూఏఎన్‌తో ఆధార్ లింక్ అయినప్పటికీ ఎన్నో కంపెనీలకు చెందిన ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో క్లెయిమ్స్ వస్తున్నాయట. ఫిజికల్ ఫాం ద్వారా క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అలాంటి కేసుల వల్ల ఆలస్యంతో పాటు ఫీల్డ్ ఆఫీస్ పైన భారం పడుతోందని చెబుతున్నారు. అందుకే ఆఫ్‌లైన్ క్లెయిమ్స్ అంగీకరించవద్దని ఆదేశించారట. అందుకే ఆన్‌లైన్ క్లెయిమ్ సర్వీస్ ప్లాట్‌ఫాంను ఉపయోగించాలని కంపెనీలకు సూచించారు. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే, ఆన్ లైన్ అంగీకరించబడుతుంది.
ఆన్‌లైన్ ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలి
EPFO వెబ్ సైట్ http://www.epfindia.com/site_en/ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలోని ఆన్‌లైన్ క్లెయిమ్ ఆప్షన్ ఎంచుకోండి.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పైన క్లిక్ చేయండి.
ఇది మీ UAN నెంబర్ అడుగుతుంది. అలాగే పాస్ వర్డ్ అవసరం.
ఆ తర్వాత మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
మీరు కంపెనీకి విత్‌డ్రా ఫాంను సబ్ మిట్ చేయాల్సిన అవసరం లేదు.
ఫీల్డ్ ఆఫీసర్ ఆటోమేటిక్‌గా ఆన్ లైన్ క్లెయిమ్‌ను వెరిఫై చేసుకుంటారు. అయితే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో మీ KYC పూర్తయి ఉండాలి.