జులై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ దెబ్బకు ఆన్ లైన్ రిటైలర్లు ఏకంగా 20 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలకు విక్రయించనున్నారు. చాలాకాలంగా అమ్ముడుపోని అనేక వస్తువులను జీఎస్టీ అమలయ్యేలోగా ఎలాగైనా విక్రయించాలని ఈకామర్స్ సంస్థలు భావిస్తున్నాయి. ఇందుకోసం భారీ తగ్గింపు ధరలకు వీటిని విక్రయించడానికి సిద్ధమవుతున్నాయి. సో... జీఎస్టీ దెబ్బకు ఆన్ లైన్లో చాలా వస్తువులు కారు చవగ్గా మారనున్నాయన్న మాట.
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈకామర్స్ సంస్థలతో టై అప్ ఉన్న డబ్ల్యూఎస్, కుడ్ టెయిల్ వంటి విక్రేతలు జులై 1లోగా తమ గోదాములు ఖాళీ చేసేయాలని భావిస్తున్నారు. అంటే... ఆ లోగా వస్తువులను అతి తక్కువ ధరలకైనా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
జులై 1 నుంచి జీఎస్టీ అమలైతే తమ వద్ద ఉన్న వస్తువులకు అదనంగా పన్నులు చెల్లించాలి. సో... ఈ లోగానే స్టాక్ క్లియర్ చేసుకోవాలని చాలా సంస్థలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో సుమారు 20 వేల కోట్ల విలువైన ఉత్పత్తులన తక్కువ ధరలకైనా విక్రయించడానికి సిద్ధపడుతున్నాయి.
ముఖ్యంగా రూ.25 వేల కంటే తక్కువ ధరలు ఉన్న వస్తువులు ఈ క్యాటగిరీలోకి వస్తాయి. అలాంటి చాలా రకాల వస్తువులు ఆన్ లైన్ సేల్స్ లో తక్కువ ధరకు విక్రయించబోతున్నారు. ప్రస్తుతం 25 వేల కంటే తక్కువ ధర ఉండి సీరియల్ నంబర్ ఉన్న వస్తువులపై 100 శాతం ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది. ఆన్ లైన్ వెండర్ల వద్ద ఉన్న వస్తువుల్లో 70 శాతం సీరియల్ నంబరు లేని 25 వేల కంటే తక్కువ ధరవే. సో... ఇవన్నీ ఇప్పడు ఆఘమేఘాలపై అమ్ముకోకపోతే భారీగా పన్ను పోటు తప్పదు. కాబట్టి బీ రెడీ బయ్యర్స్