ఆధార్.. మనకు అత్యవసరమైన డాక్యుమెంట్ ఇది. ప్రస్తుతం ఏం పని జరగాలన్నా ఆధార్‌ను తప్పనిసరిగా అడుగుతున్నారు. ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్‌కు లింక్ అయి ఉండే మొబైల్ నంబర్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఏదైనా సైట్లో ఆధార్ చెక్ చేసేటప్పుడు కచ్చితంగా మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. కానీ ఒక్కోసారి మనకు ఆ ఓటీపీ కూడా రాదు. దీంతో కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. మరి ఇలా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్ ఓటీపీ రానప్పుడు ఏం చేయాలి. ఈ సమస్యను ఎలా అధిగమించాలో చూద్దామా..
మీరు భారత పౌరులైతే ఆధార్ ఎంత కీలకమో మనకు తెలిసే ఉంటుంది. మనకు ఎక్కడ అవసరమైన ఇది ఐడెంటీ ఫ్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. కేవైసీ చెక్ చేయడం కోసం ఆధార్ వెరిఫికేషన్ మస్ట్ కూడా. కానీ ఓటీపీ ఆధారంగా ఈ చెకింగ్ జరగడమే ఇక్కడ ఇబ్బంది. చాలాసార్లు మన మొబైల్ నంబర్‌కు ఈ ఓటీపీ రాకపోవడంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటాం. యూఐడీఏఐ పంపిన ఈ ఓటీపీ వస్తేనే మన డాక్యుమెంట్ వెరిఫై అవుతుంది. దీనికి కారణం మన మొబైల్ నంబర్ యూఐడీఏఐ డేటాబేస్‌లో లేకపోవడమే. మనం ఆన్‌లైన్‌లో మనం మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి ఇది అప్‌డేట్ కాదు. దీంతో మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా ఓటీపీ మాత్రం రాదు. ఇంకో కారణం ఏమిటంటే మన ఫోన్‌కు సరిగా సిగ్నల్ లేకపోవడం. యాక్టివ్‌గా లేకపోవడం!
ఏం చేయాలి..
ఆధార్ కార్డు కోసం ఎన్‌రోల్ చేసుకున్నప్పుడు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ ఇచ్చామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు నంబర్ మార్చినట్లైతే ఆధాయూఐడీఏఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మన ఆధార్ వ్యక్తిగత వివరాలు కొత్త ఫోన్‌తో అప్‌డేట్ చేసుకోవాలి. మై ఆధార్.. ఆధార్ సర్వీసెస్, వెరిఫై ఈ మెయిల్, మొబైల్ నంబర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కొత్త నంబర్ ఎంటర్ చేసి ఓకే చేయాలి. ఆ తర్వాత మీరు మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా ఆధార్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఒకేవేళ మీ ఇబ్బంది తీరకపోతే 1947 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.