• తాజా వార్తలు

ఫ్లాష్ సేల్/ ఓపెన్ సేల్ - ఒక మాయాజాలం...

న్ లైన్లో స్మార్టు ఫోన్లు విక్రయించే కంపెనీలు వినియోగదారులను నిరాశపరుస్తున్నాయి. రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ అని ఆఫర్ ఇచ్చి వెబ్ సైట్ ను ఆ ట్రాఫిక్ కు తట్టుకునేలా చేయలేకపోయిన రింగింగ్ బెల్స్ పై వినియోగదారులు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎల్ఈ టీవీ ఫోన్ కూడా వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. ఇంతవరకు రెండు విడతలుగా ఫ్లిప్ కార్డులో ఫ్లాష్ సేల్ చేసి రికార్డులు సృష్టించిన ఈ ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్ ప్రారంభించింది. గురువారం ఇది మొదలైనప్పటికీ కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని కనిపించడంతో చాలామంది నిరాశ చెందారు.

ఎల్ఈ 1ఎస్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ లో గురువారం ఓపెన్ సేల్ కు పెట్టారు. హైఎండ్ ఫీచర్లతో అందుబాటు ధరలో లభ్యమవుతున్న ఈ ఫోన్ దక్కించుకునేందుకు ప్రయత్నించిన వినియోగదారులకు ఆశాభంగం ఎదురైంది. అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే ఫోన్లు అన్నీ అమ్ముడయ్యాయన్న మెసేజ్ కనిపించడంతో ఎందరో నిరాశ చెందారు.  సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై మండిపడుతున్నారు. ఎన్ని ఫోన్లు అమ్ముతామో చెప్పకుండా తమను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ సీరియస్ కామెంట్లు పెడుతున్నారు.

మొదటి ఫ్లాష్ సేల్స్ లో 2.2 లక్షల ఫోన్లు విక్రయించడంతో ఓపెన్ సేల్ లో కనీసం 2 లక్షల ఫోన్లు అమ్మకానికి పెడుతుందని భావించారు. జనం ఇంతలా విమర్శలు కురిపిస్తున్నా ఎల్ఈటీవీ నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు. అయితే... ఇదే సంస్థకు చెందిన రూ.33 వేల ఫోన్ ఎల్ఈ మ్యాక్స్‌ అమ్మకాలు పెంచడానికే తక్కువ ధర ఫోన్ ను అందుబాటులో ఉంచడం లేదన్న వాదన ఒకటి వినిపిస్తోంది.

 

జన రంజకమైన వార్తలు