• తాజా వార్తలు

ఫ్లిప్ కార్టులో ఆపిల్ ఫెస్టివల్

పిల్ ఫోన్ కొనాలని ఎవరికి ఉండదు.. కానీ, దాని ధరే భయపెడుతుంది. మంచి డిస్కౌంట్ ఆఫర్ వస్తే కొనాలనుకునేవారు ఉంటారు. అలాంటివారికోసం ఫ్లిప్ కార్ట్ కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది.  ఆపిల్ ఫెస్ట్ పేరుతో మంగళవారం(10వ తేదీ) నుంచి 13 వరకు ఐఫోన్లపై భారీ ఆఫ‌ర్లు ప్రకటించింది.  ఆపిల్ యాక్ససరీస్ పై కూడా ఈ ఆఫ‌ర్లు ఉంటాయ‌ని, అంతేగాక‌ ఐఫోన్ 6 కొనుకునే వారికి అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం రాయితీ కూడా ఇస్తున్న‌ట్లు ప్రకటించింది.
ఫ్లిప్ కార్ట్ ఆఫర్లో ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం రాయితీలో రూ.65 వేలకే ల‌భిస్తోంది. అంతేకాదు.. జీరో పర్సంట్ ఇంట్రెస్టుతో  ఈఎంఐ ప్లాన్ నెలకు రూ.5,147 చొప్పున చెల్లించుకునే వెసులుబాటును క‌ల్పించింది. ఇక‌ రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలి. వాటితో పాటు ఎక్స్చేంజ్ పై రూ.5000 డిస్కౌంట్ తో పాటు అదనంగా ధరపై రూ.3000 తగ్గింపు ఉంటుంది.  ఈ ఐఫోన్లను ఎక్స్చేంజ్ పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నామ‌ని ప్రకటించారు.. కానీ, మోడల్ చెక్ చేస్తే 23 వేల ఎక్స్చేంజి ధర పలకడం కష్టమే. ఇక ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ కు 7 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.  దాంతో అది రూ.55 వేలకు దొరుకుతోంది.  ఎక్స్చేంజ్ పై రూ.23వేల డిస్కౌంట్ తో పాటు అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీనికి కూడా యాక్సిస్ బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం రాయితీ  పొందొచ్చు. ఇక‌ 6 శాతం త‌క్కువ ధ‌ర‌తో ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్ విక్ర‌యిస్తోంది..  దాని ధ‌ర‌ రూ.75,000 కాగా..  128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్ ను రూ.65,000కు ల‌భించ‌నుంది.

ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ వేరియంట్ ధర  రూ.82వేలు. దీనిపైనా రూ.23వేల వరకు ఎక్స్చేంజ్ రాయితీ ఉంది.  క్రెడిట్ కార్డు ఆఫర్, ఎక్స్జేంజి బోనస్ సేమ్.  ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ ను త‌మ వెబ్‌సైట్ ద్వారా రూ.31,990కే అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీని ఎక్స్చేంజ్ పై రూ.24వేల వరకు రాయితీ ఉందని తెలిపింది. అంతేగాక‌ రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై అద‌నం రూ.4,000 డిస్కౌంట్ ను ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఐఫోన్‌ ఈఎంఐ రూ.1,552 నుంచి అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపింది.
ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు త‌మ ఫ్లాట్‌పాం ద్వారా రూ.46,999కు ల‌భిస్తాయ‌ని తెలిపింది. ఎక్స్చేంజ్ పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చని పేర్కొంది.

ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లకు కూడా భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. త‌మ వెబ్‌సైట్ ద్వారా ఈ ఐఫోన్ల‌ను రూ.56,999కు అందుబాటులో ఉన్నాయ‌ని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.  దీనికిగానూ ఎక్స్చేంజ్ పై రూ.23వేల డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మ‌రో రూ.3,000 రాయితీ ఇస్తున్న‌ట్లు తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కి అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఆపిల్ ఐఫోన్ 5ఎస్ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ల‌ను కూడా తాము డిస్కౌంట్ ప్ర‌క‌టించామ‌ని ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ డిస్కౌంట్ తో రూ.19,999కే ఆ ఐఫోన్ ఇస్తున్నామ‌ని, ఎక్స్చేంజ్ పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నామ‌ని పేర్కొన్నారు.

ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై 50, 25 శాతం డిస్కౌంట్‌లు ఉంటాయి.

మొత్తానికి ఈ ఈ-కామర్స్ దిగ్గజం ఆపిల్ ప్రొడక్ట్స్ పై ప్రకటించిన ఆఫర్లు ఎంత హిట్టవుతాయో చూడాలి.

జన రంజకమైన వార్తలు