• తాజా వార్తలు

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ పోటాపోటీ ఆఫ‌ర్లు


ఈ -కామ‌ర్స్ వెబ్ సైట్లు పోటీకి మ‌ళ్లీ సై అంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఈ నెల‌లో భారీగా ఆఫ‌ర్లతో ముందుకొస్తున్నాయి. డీమానిటైజేష‌న్‌తో గ‌త ఆరునెల‌లుగా అమ్మ‌కాలు లేని కంపెనీలు త‌మ ప్రొడ‌క్ట్స్‌ను అమ్ముకోవ‌డానికి దీన్ని మంచి ఛాన్స్‌గా ఉప‌యోగించుకోబోతున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ , అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్‌
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేల్ పేరిట మే 14 నుంచి 18 వ‌ర‌కు అన్ని ర‌కాల ప్రొడ‌క్ట్స్‌పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించ‌బోతోంది. ప‌దో యానివ‌ర్స‌రీని పుర‌స్క‌రించుకుని కొన్ని ప్రొడ‌క్ట్స్‌పై 80 % వ‌ర‌కు కూడా డిస్కౌంట్ ఇవ్వ‌నుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ కు ఈ- కామ‌ర్స్‌లో పోటీ ఇచ్చే అమెరిక‌న్ కంపెనీ అమెజాన్ మ‌రో అడుగు ముందుకేసి సేల్ ప్ర‌క‌టించింది. మే 11 నుంచి 14 వ‌ర‌కు గ్రేట్ ఇండియ‌న్ సేల్ ఉంటుంద‌ని ఎనౌన్స్ చేసింది. ఇంత‌కుముందు ఎన్న‌డూ లేనంత బ్లాక్ బ‌స్ట‌ర్ డీల్స్ ఉంటాయంది. ఫ్లిప్ కార్ట్ ఆఫ‌ర్ ప్రారంభ‌మ‌య్యే రోజునే అమెజాన్ ఆఫ‌ర్ క్లోజ్ అవుతోంది. సో రెండు కంపెనీలు క‌న్జ్యూమ‌ర్ల‌ను ఆకట్టుకోవ‌డానికి పోటాపోటీగా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తాయి. అమెజాన్‌లో మంచి ఆఫ‌ర్ ఉంటే జ‌నం కొనుక్కుంటారు కాబ‌ట్టి అంత‌కంటే పెద్ద ఆఫ‌ర్‌నే లేదా బెట‌ర్ ఆఫ‌ర్‌నే ఫ్లిప్‌కార్ట్ ప్రక‌టించాల్సి ఉంటుంది. లేదంటే ఆ సంస్థ ప‌దో వార్షికోత్స‌వ ఆఫ‌ర్ క‌ళ త‌ప్పుతుంద‌ని మార్కెట్ ఎక్స్‌ప‌ర్ట్స్ అంచ‌నా కూడా .
స్మార్ట్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్స్‌, ఫ్యాష‌న్ పైనే ఎక్కువ ఆఫ‌ర్లు
ఈ సేల్ సక్సెస్‌ఫుల్ కావ‌డానికి భారీగా డిస్కౌంట్లు ఇవ్వాల‌ని ఆయా కంపెనీల‌ను ఫ్లిప్ కార్ట్‌, అమెజాన్ రెండూ కోరాయి. త‌మ మార్జిన్ల‌ను త‌గ్గించుకొని దీన్ని కొంత‌వ‌ర‌కు కాంపెన్సేట్ చేస్తామ‌ని చెప్పాయ‌ని ప‌లు కంపెనీల ప్ర‌తినిధులు చెప్పారు. డిజిట‌ల్ వాలెట్ల‌తో బిల్ పే చేస్తే అడిషిన‌ల్ క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు కూడా వ‌స్తాయి. ఫ్లిప్‌కార్ట్ అనుబంధ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్ మింత్రాలోనూ ఆ నాలుగు రోజులు ఆఫ‌ర్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎల‌క్ట్రానిక్‌, ఫ్యాష‌న్ , యాక్సెస‌రీస్‌పై ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వ‌నున్నారు.
శాంసంగ్‌, మోటో, వ‌న్‌ప్ల‌స్ మొబైల్స్‌, సోనీ, ఎల్‌జీ, వ‌ర్ల్‌పూల్‌, ప్యూమా, టైటాన్‌, వ్రాంగ్ల‌ర్‌, బిబా, ఫాస్ట్‌ట్రాక్ వంటి పెద్ద కంపెనీల ప్రొడ‌క్ట్స్‌పై ఎక్కువ ఆఫ‌ర్లు ఉంటాయ‌ని అమెజాన్ ప్ర‌క‌టించింది.

జన రంజకమైన వార్తలు