ఇ-కామర్స్ సైట్లలో పేమెంట్ చేయాలంటే ముందుగా కార్డ్ యాడ్ చేసుకోవాలి. లేదా ఏదైనా పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒక్కోసారి పేమెంట్ విఫలం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ ఇందు కోసం షాపింగ్ చేసిన ప్రతిసారీ ఏటీపీ ఎంటర్ చేసే ప్రాసెస్‌ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం వీసా సేఫ్ క్లిక్ (వీఎస్‌సీ) కార్డును లాంఛ్ చేసింది. రూ.2 వేల లోపు ట్రాన్సాక్షన్ చేస్తే ఎలాంటి ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో పూర్తవుతుంది. అయితే ఫ్లిప్ కార్ట్ వన్ క్లిక్ పేమెంట్ వెనుక ఉన్న మర్మమెంటి?
వన్లీ వీసా యూజర్లకేనా!
వీసా సేఫ్ క్లిక్ కార్డు కోసం ఫ్లిఫ్‌కార్ట్.. వీసాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ఫస్ట్ ఇన్‌యాప్ డివైజ్ బేస్డ్ నెట్‌వర్క్ అంథంటికేషన్ సొల్యుషన్‌తో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాస్టర్ కార్డ్, రూపే లాంటి పేమెంట్ కార్డులకు ఇది వర్తిస్తుందా! అంటే లేదనే చెప్పాలి. వీసా యూజర్లకు మాత్రమే పని చేసేలా ఈ ఫీచర్లు ఉన్నాయి. దీని వల్ల మిగిలిన కార్డులు వాడుతున్న యూజర్లు వీసా సేఫ్ క్లిక్ కార్డును యూజ్ చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.
కస్టమర్ డ్రాఫ్ ఆఫ్
అయితే వీసా సేఫ్ క్లిక్ ఆప్షన్ లేకపోవడంతో గణనీయంగా కస్టమర్లు తగ్గిపోతున్నారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లలో ఓటీపీ బేస్డ్ అథంటికేషన్ అతి పెద్ద విప్లవమని ఫ్లిప్‌కార్ట్ ఫిన్‌టెక్ అండ్ పేమెంట్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయిన్‌పల్లి చెబుతున్నా ఇది ఎంతవరకు కస్టమర్లకు చేరువు అవుతుందనేది కీలకం. అయితే ఓటీపీ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు వీఎస్‌సీ మంచి మార్గమని నిపుణులు అంటున్నారు. షాపింగ్‌లో అదనపు ప్రాసెస్ లేకుండానే కస్టమర్లు ముందుకు సాగచ్చననేది వారి మాట.