• తాజా వార్తలు

ఇకపై ఇంటి నుంచే ఫారిన్ గూడ్స్ షాపింగ్

ఈ-కామర్స్ రంగం దినదిన ప్రవర్ధమానం చెందుతుండడం దేశ ఆర్థికాభివృద్ధికి ప్లస్ అవుతుండడమే కాకుండా దేశాల మధ్య వ్యాపార హద్దులనూ చెరిపేస్తోంది.కొనుగోలు చేయడంలో ఉన్న సౌలభ్యం.. ఎంపికకు ఎన్నో అవకాశాలు.. ఎన్ని వస్తువులు చూసినా ఒక్కటీ కొనకుండా వదిలేయగలిగే అవకాశం.. కొనమని మనల్ని ఎవరూ మొహమాట పెట్టే అవకాశం లేకపోవడం వంటివన్నీ ఈ-కామర్స్ రంగం ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తున్నాయి. అందుకే ఈ కామర్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2018లో ఇది మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా 8,75,600 కోట్ల విలువైన ఆన్ లైన్ వ్యాపారం జరుగుతుందని అంచనా. రీసెంటుగా విడుదలైన పేపాల్ క్రాస్ బోర్డర్ కంజ్యూమర్ రిపోర్టులో ఆన్ లైన్లో విదేశీ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన లేటెస్టు ట్రెండ్ స్పష్టమైంది.

ఈ-కామర్స్ దూకుడు ఇలా..
* 2016 నుంచి ఏటా వ్యాపార వృద్ధి: 31 శాతం
* 2016లో ఇండియన్లు ఆన్ లైన్లో కొనుగోలుచేసిన విదేశీ వస్తువుల విలువ: 58,370 కోట్లు

ఏ దేశం నుంచి ఎక్కువగా..
ఇండియన్ ఆన్ లైన్ షాపర్లలో 25 శాతం మంది విదేశీ వెబ్ సైట్ల నుంచి తరచూ కొనుగోళ్లు చేస్తున్నారట. దీపావళి, క్రిస్మస్ సమయాల్లో ఈ విదేశీ వస్తువుల కొనుగోళ్లు అధికమవుతున్నాయి.
* అమెరికా నుంచి 14 శాతం
* బ్రిటన్ నుంచి 6 శాతం
* చైనా నుంచి 5 శాతం

ఎలా కొంటున్నారు..
* ల్యాప్ ట్యాప్, డెస్క్ ట్యాప్ నుంచి: 56 శాతం
* స్మార్టుఫోన్ల ఆధారంగా: 29 శాతం
* ట్యాబ్లెట్ లు ఉపయోగించి: 10 శాతం

చైనాయే టాప్
ఇండియన్సు ఎక్కువగా అమెరికా వస్తువులను ఆన్ లైన్లో కొంటున్నా ప్రపంచవ్యాప్తంగా చూస్తే మాత్రం ఎక్కువగా చైనా సైట్ల నుంచి కొనేవారే ఎక్కువగా ఉన్నారు. చైనాకు చెందిన ఉత్పత్తులను 21 శాతం మంది కొనుగోలుచేస్తుండగా అమెరికా వస్తువులను 17 శాతం మందే కొంటున్నారు. ఆ తరువాత స్థానంలో బ్రిటన్ 13 శాతం, జర్మనీ 7 శతం, జపాన్ 4 శాతం వాటా కలిగి ఉన్నాయి.

ఎక్కువగా ఏం కొంటున్నారు..
* దుస్తులు, చెప్పులు, యాక్సెసరీస్: 46 శాతం
* ఎలక్ర్టానిక్స్, కంప్యూటర్లు: 29 శాతం
* ట్రావెల్, ట్రాన్స్ పోర్టేషన్: 25 శాతం
* బొమ్మలు, అభిరుచులకు సంబంధించినవి: 23 శాతం
* ఎంటర్టైన్ మెంట్, ఎడ్యుకేషన్: 20 శాతం
* కాస్మోటిక్స్: 20 శాతం

 

జన రంజకమైన వార్తలు