• తాజా వార్తలు

మీరు కోరుకున్న గాడ్జెట్స్ ఇఎంఐలలో అందిస్తున్న "ఫినోమెనా" - అదీ క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేకుండ

మీరు కోరుకున్న గాడ్జెట్స్ ఇఎంఐలలో అందిస్తున్న "ఫినోమెనా"
అదీ క్రెడిట్ స్కోర్ తో సంబంధం లేకుండా

హై ఎండ్ ఫోన్ లు అంటే ఎక్కువ ధరలలో ఉండే ఫోన్ లను కొనాలని అందరికీ ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యపడదు కదా! ఒకే సారి అంతపెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఫోన్ కొనే స్థోమత అందరికీ ఉండదు. అలాంటి వారి కోసమే EMI లాంటి అవకాశాలు ఉన్నాయి. సరే EMIల ద్వారా అయినా ఈ ఫోన్ కొందాం అని అనుకుంటే వాళ్ళేమో క్రెడిట్ కార్డులను అడుగుతున్నారు. క్రెడిట్ కార్డును మెయింటెయిన్ చేసే కెపాసిటీనే ఉంటే డైరెక్ట్ గా డబ్బు పెట్టి కొనేస్తాము కదా? ఇంకా EMIలు ఎందుకు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళ రూల్స్ వాళ్లకు ఉంటాయి. సరే బ్యాంకు ఋణం అయినా తీసుకుందాం అని అనుకుంటే సవాలక్ష ఎంక్వయిరీలు. బ్యాంకులోన్ ల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అది అందరికీ తెలిసిన ప్రహసనమే కదా!

మరి ఇలాంటి పరిస్థితులలో మనకు నచ్చిన హై ఎండ్ గాడ్జెట్ కొనాలి అనుకునే సామాన్యునికి సహయం చేసే ఆర్థిక సంస్థలు ఏవీలేవా? అని అనుకుంటున్న తరుణంలో కారుచీకటిలో ఆశాదీపంలా కనిపించింది ఫినోమెనా కంపెనీ.

ఇది ఒక విశిష్టమైన లోన్ అప్రూవల్ సిస్టంను కలిగి ఉన్న ఒక ఆర్థిక రంగ స్టార్ట్ అప్ కంపెనీ. మనం పైన చెప్పుకున్న సమస్య లన్నింటికీ ఇది ఒక ప్రత్యామ్నాయాన్ని చూపిస్తుంది. ఇంతకుముందు మనం  ఎక్కడైనా లోన్ తీసుకున్నా లేకపోయినా, మనకు క్రెడిట్ స్కోర్ లేకపోయినా, మనకు అసలు బ్యాంకు ఎకౌంటు లేకపోయినా సరే ఇది మనకు లోన్ ను అందిస్తుంది. అంతేకాదు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకుని  ఈ కామర్స్ సైట్ లలో మనకు నచ్చిన గాడ్జెట్ ను సెలెక్ట్ చేసుకుని దాని ధరతో నిమిత్తం లేకుండా సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. మనకు నచ్చిన గాడ్జెట్ ను మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్క క్లిక్ తో మనకు EMI ఆప్షన్ లను చూపిస్తుంది.

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన జనధన యోజన పథకం గురించి మీరు వినే ఉంటారు. దేశంలో ఏ ఒక్క వ్యక్తీ కూడా బ్యాంకు ఎకౌంటు లేకుండా ఉండకూడదు అన్నదే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. కేవలం బ్యాంకు ఎకౌంటు ఉన్న మాత్రాన సరిపోదు కదా! ఆ ఎకౌంటు ను సరిగ్గా మెయింటెయిన్ చేస్తూ ఉండాలి. అప్పుడే బ్యాంకులు మనకు రుణాలు మంజూరు చేస్తాయి. మన క్రెడిట్ స్కోర్ మంచిగా ఉన్నపుడే బ్యాంకులు కానీ ఇతర ఫైనాన్సు కంపెనీలు కానీ మనకు రుణాలు మంజూరు చేస్తాయి. ఒక వ్యక్తి యొక్క ఆర్థిక కార్యకలాపాలు అంటే బ్యాంకు ఎకౌంటును మెయింటెయిన్ చేయడం, అప్పులు తీసుకోవడం, కోర్టు లావాదేవీలు కలిగి ఉండడం లాంటి ద్వారా క్రెడిట్ స్కోర్ ను నిర్ణయిస్తారనే విషయం అందరికీ తెలిసినదే. మన దేశం లో సుమారు 75 శాతం మందికి పైగా యువ ప్రొఫెషనల్ లు, స్వయం ఉపాధి పొందే వారు, విద్యార్థులు మొదలైన వారికి ఈ క్రెడిట్ స్కోర్ సరిగా ఉండే అవకాశం లేదు, మరి అలాంటపుడు బ్యాంకుల నుండి కానీ లేదా ఈ ఫైనాన్సు సంస్థల నుండి కానీ వారు రుణాలు ఎలా పొందగలరు? నచ్చిన గాడ్జెట్ లను ఎలా కొనగలరు?

ఫినోమెనా ఎలా ఉపయోగపడుతుంది?

ఒక వ్యక్తి యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసే క్రెడిట్ స్కోర్ లాంటి పద్దతులను ఇది అవలంబించదు. ఋణ గ్రహీత యొక్క సామర్థ్యాన్ని నిర్ణయించేందుకు క్రెడిట్ స్కోర్ ను కాకుండా ఒక మెషీన్ ఆధారిత ప్లాట్ ఫాంను వీరు కలిగి ఉన్నారు. ఇది వారి యొక్క క్రెడిట్ వర్తీనెస్ కు 20,000 డేటా పాయింట్ లను అందిస్తుంది.

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఒక అడ్వకేట్ అని అనుకుందాం. అతను హై ఎండ్ స్మార్ట్ ఫోన్ ఒకటి కొనాలి అనుకున్నాడు. అతని ఆదాయం అతనికి వచ్చే కేసు లపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి అతని ఆదాయం లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఈ కారణంగా అతని క్రెడిట్ స్కోర్ కూడా తక్కువగా ఉండవచ్చు. కాబట్టి మన బ్యాంకులు ఫైనాన్సు సంస్థలు అతనికి లోన్ ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంటుంది. అయితే ఫినోమెనా ఇవేమీ పట్టించుకోదు. వెంటనే అతనికి తన మెకానిజం ద్వారా ఎంక్వయిరీ చేసిలోన్ ఇచ్చేస్తుంది. లోన్ ఇచ్చేముందు డైరెక్ట్ గా మనతో ముఖాముఖి మాట్లాడి ఆ ప్రక్రియను వివరిస్తారు, ఆ తర్వాత మన ఇంటికి వారి ప్రతినిధిని పంపించి అవసరమైన డాక్యుమెంట్ లను తీసుకెళతారు. ఒక్క రోజులో లోన్ అప్రూవ్ అవుతుంది. రమేష్ అనే వ్యక్తి కి మరుసటి రోజు తను కోరుకున్న వస్తువు తన చేతిలో ఉంటుంది.

ఫినోమెనా యొక్క ప్రత్యేకతలు ఏమిటి?

సౌకర్యం:

మనం ఇంతకు ముందు చెప్పుకునట్లు దేశంలో కేవలం 2 శాతం మంది మాత్రమే క్రెడిట్ కార్డు హోల్డర్ లు ఉన్నారు. అంటే 98 శాతం మందికి క్రెడిట్ కార్డు లేదు. మరి ఈ ప్రముఖ EMIలు అన్నీ ఆ 2 శాతం మందికే వస్తుంటే మిగతా 98 శాతం మాటేమిటి? ఇదే ఈ కంపెనీ యొక్క సిద్దాంతం. అందరికీ అందుబాటులో రుణాలు మంజూరు చేయడం ద్వారా ఇది మంచి సౌకర్యవంతమైన అవకాశం గా మారింది.

FMI:

దీనిలో మరొక ప్రత్యేకత FMI. అంటే ఫ్లెక్సిబుల్ మంత్లీ ఇన్స్టాల్ మెంట్. EMIల మాదిరిగా కాకుండా మనం నెలకు ఎంత కట్టగాలమో మనమే నిర్ణయించుకోవడమే ఈ FMI. డౌన్ పేమెంట్ మన దగ్గర ఎంత ఉంటే అంత కట్టవచ్చు. FMI కూడా మన సామర్థ్యాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. ఇలా డౌన్ పేమెంట్ ను కూడా మనమే నిర్ణయించుకునే పద్దతి మరెక్కడా లేదు.

వేగం:

మనం రిజిస్టర్ చేసుకుని మనకు నచ్చిన గాడ్జెట్ ను సెలెక్ట్ చేసుకుని లోన్ కి అప్లై చేసుకున్న ఒక్క రోజులోనే మనకు ఋణం మంజూరు చేయబడుతుంది. ఈ వేగమే దీని ప్రత్యేకత.

ఈ సౌకర్యం, వేగం, FMI అనే ప్రత్యేకతలు ఈ ఫినోమెనాను సాధారణ ఫైనాన్సు కంపెనీలకు అతీతంగా ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

 

జన రంజకమైన వార్తలు