ప్రస్తుతం టెక్నాలజీ కంపెనీల్లో ఫిన్ టెక్‌ల హవా నడుస్తోంది. అంటే టెక్నాలజీ విత్ ఫైనాన్స్ అన్నమాట. పేమెంట్ యాప్స్ అన్నీ ఇలా వచ్చినవే. పేమెంట్ యాప్‌గా గూగుల్ తెరపైకి తెచ్చిన గూగుల్ తేజ్ యాప్ ఇప్పుడు రూపు మార్చుకుంటోంది. అంతేకాదు ఇన్‌స్టంట్ లోన్స్ కూడా యూజర్లకు ఆఫర్ చేయబోతోంది.
నాలుగు బ్యాంక్‌లతో టై అప్
గూగుల్ తన పేమెంట్ యాప్ తేజ్‌ను గూగుల్ పే (Google Pay)గా మార్చనుంది. అయితే ఇందులో ఉన్న ఫీచర్లేమీ మారలేదు. అయితే కొన్ని కొత్త సౌకర్యాలు వస్తున్నాయి. అందులో ముఖ్యమైంది గూగుల్ ఇన్‌స్టంట్ లోన్స్.
* గూగుల్ తేజ్‌కు ప్రస్తుతం ఇండియాలో నెలకు 2కోట్ల 20 లక్షల మంది యాక్టివ్ యూజర్లున్నారు. వీరికి లోన్స్ కూడా ఆఫర్ చేసి బిజినెస్ పెంచుకోవాలని గూగుల్ ప్లాన్ చేస్తోంది.
* ఇందుకోసం ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఫెడరల్, కోటక్ మహీంద్రబ్యాంక్‌లతో టై అప్ పెట్టుకుంది. వీటితో కలిసి గూగుల్ పే (గూగుల్ తేజ్)యూజర్లకు ఇన్‌స్టంట్ లోన్లు ఇవ్వబోతుంది.
*యూజర్లకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఆఫర్ చేసి లోన్స్ బిజినెస్‌లోకి రావాలన్నది గూగుల్ ప్లాన్.
ఎవరికి పోటీ?
ఇప్పటికే మొబీక్విక్ లాంటి పేమెంట్ యాప్స్ కొన్ని యూజర్లకు ఇన్‌స్టంట్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. పేటీఎం కూడా అలీబాబా-సాఫ్ట్ బ్యాంక్ బ్యాకప్‌తో ఇలాంటి ఫీచర్‌నే త్వరలో తీసుకురాబోతోంది. వీటన్నింటికీ గూగుల్ పే నుంచి పోటీ తప్పదు. ఎందుకంటే గూగుల్ తేజ్ అనేది మనీ ట్రాన్స్‌ఫర్‌కు అందరికీ బాగా ఈజీగా ఉపయోగపడుతున్న యాప్. కాబట్టి యూజర్ల సంఖ్య బాగానే ఉంది. వాళ్లు యాక్టివ్‌గా కూడా ఉంటున్నారు. లోన్ ఫెసిలిటీ కూడా వస్తే గూగుల్ పే మరింత ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.