వాలెట్లు, యూపీఐలు వచ్చాక ఇండియాలో మనీ ట్రాన్స్‌ఫర్ దాదాపు ఉచితం అయిపోయింది. కానీ విదేశాల్లో ఉన్నవారికి డబ్బులు పంపాలంటే నేటికీ ఖర్చుతో కూడిన వ్యవహారమే. అయితే ఆ ఖర్చును సాధ్యమైనంత తగ్గించి చౌకగా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి కూడా మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.
ట్రాన్స్ఫర్
ఇంటర్నేషనల్‌గా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడానికి రెమిటెన్స్ ప్రొవైడర్లు ఉంటాయి. వీటిలో ఒక్కోటి ఒక్కో తరహాలో ఛార్జి చేస్తాయి. ఏ ప్రొవైడర్ ఎంత ఛార్జి చేస్తుందో చూపించడానికి మనకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటిలో బాగా ప్రముఖమైనది ట్రాన్స్ఫర్ (Transfr). ఇది ఫ్రీ సర్వీసు. ఇందులో మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు ఎంత మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారు? ఏ దేశం నుంచి ఏ దేశానికి పంపాలనుకుంటున్నారో వివరాలు ఎంటర్ చేస్తే చాలు. ట్రాన్స్ఫర్ రియల్ టైమ్‌లో సెర్చ్ చేసి ఏ రెమిటెన్స్ ప్రొవైడర్ మీ మనీ ట్రాన్స్‌ఫర్‌కి ఎంత ఛార్జి చేస్తుందో ఓ లిస్ట్‌గా చూపిస్తుంది. అంతేకాదు మీరు పంపే దేశంలో మన కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ రేటు ఎంత ఉంటుందో కూడా చూపిస్తుంది. ప్రతి రెమిటెన్స్ ప్రొవైడర్ ఛార్జి వివరాలతోపాటు పక్కనే దానికి సంబంధించిన లింక్ కూడా వస్తుంది. మీకు నచ్చిన ప్రొవైడర్‌ను పక్కనున్నలింక్ క్లిక్ చేసి నేరుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఈ నాలుగు ప్రొవైడర్లూ చూడొచ్చు
ట్రాన్స్ఫర్ సర్వీసు ఒక్క సింగిల్ పేజీ వెబ్‌సైట్. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. దానిలో మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్, ఎక్కడి నుంచి ఏ దేశానికి మనీ పంపుతున్నారనే వివరాలు ఎంటర్ చేయాలి. క్షణాల్లో మీకు స్క్రీన్ మీద నాలుగు రెమిటెన్స్ ప్రొవైడర్లు కనిపిస్తాయి.
1. ట్రాన్స్‌ఫర్‌వైజ్ (TransferWise)
2. ఇన్‌స్టారెమ్ (InstaRem)
3. కరెన్సీ ఫెయిర్ (CurrencyFair)
4. ట్రాన్స్‌ఫర్ (TransferGo)
వీటిలో ప్రతిదాని ముందు ఆ ప్రొవైడర్ ఎంత ఛార్జి చేస్తుంది, ఎక్స్చేంజ్ రేట్ ఎంత అనే వివరాలుంటాయి. తక్కువ ఛార్జీలున్న దాన్ని ఎంచుకుని, దాని ముందున్న లింక్ క్లిక్ చేసి మీ మనీని ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.