గూగుల్ గత ఏడాది మన దేశంలో ప్రవేశపెట్టిన ‘‘గూగుల్ తేజ్’’ పేమెంట్ యాప్ పేరును ఇటీవలే ‘‘గూగుల్ పే’’గా మార్చింది. తాజాగా దీనికి ప్రజాదరణ పొందడం కోసం ఈ యాప్‌ను వాడేవారికి ఆకర్షణీయమైన బహమతులు ఇవ్వనుంది. ఇందులో భాగంగా ‘‘గూగుల్ పే’’ వాడటంద్వారా వినియోగదారులు లక్ష రూపాయలదాకా గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించింది. ఈ లక్కీచాన్స్ కోసం చేయాల్సిందేమిటంటే... సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 9 గంటల్లోగా గూగుల్ పే ద్వారా కనీసం ఐదు లావాదేవీలు నిర్వహించాలి. ఆ మేరకు ‘‘వ్యక్తికీ-వ్యక్తికి మధ్య (P2P), ఇతర బ్యాంకు ఖాతాల్లోకి చెల్లింపులు, వ్యాపారులకు క్యాష్‌మోడ్‌లో చెల్లింపులు, వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు యూపీఐ ఐడీద్వారా చెల్లింపు’’ల రూపంలో ఈ లావాదేవీలు ఉండాలి. దేశంలో పంపిణీ చేయబోయే 5 కోట్ల బహుమతుల్లో ఈ మొత్తం 5 రూపాయల నుంచి లక్ష రూపాయలదాకా ఎంతైనా ఉండొచ్చునని గూగుల్ పే ప్రకటించింది. పూర్తి లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే అవకాశం అదృష్టవంతులైన కొందరు ఖాతాదారులకు మాత్రమే లభిస్తుందని పేర్కొంది. ఇక బిగ్ బజార్‌వంటి ప్రముఖ చిల్లర వ్యాపారసంస్థలతో చెల్లింపుల ఒప్పందం కూడా కుదుర్చుకున్న నేపథ్యంలో ఈసారి దీపావళి పండుగ నాటికల్లా తమ యాప్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తోంది.