మీరు ఐసీఐసీఐ ఖాతాదారులా? మీ డెబిట్ కార్డ్ ఇంట్లో ఉంచి బయటికెళ్లినప్పుడు అర్జెంటుగా డబ్బులు డ్రా చేయాల్సి వచ్చిందా? మీరు ఏటీఎంలో డెబిట్ కార్డ్ పెట్టి మనీ విత్‌డ్రా చేసుకుంటే ఎవరైనా పిషింగ్ చేసి మీ కార్డ్ డిటెయిల్స్ కొట్టేస్తారని భయపడుతున్నారా? అయితే ఇలాంటి ఇబ్బందులన్నీ ఇక ఉండవు. ఎందుకంటే డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే ఏటీఎంలో డబ్బులు తీసుకోగలిగే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ సౌకర్యాన్ని ఐసీఐసీఐ ఇటీవలే ప్రవేశపెట్టింది. దాన్ని ఎలా వాడుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి.
ఇదిగో స్టెప్ బై స్టెప్ పద్ధతి
1. ఐసీఐసీసీ బ్యాంక్ మొబైల్ (ఐమొబైల్) యాప్ ఓపెన్ చేయండి.
2. సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి Cash Withdrawal at ICICI Bank ATM ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
3. మీరు ఎంత విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ ఎంటర్ చేసి, అకౌంట్ నెంబర్‌ను సెలెక్ట్ చేయండి.
4. ఈ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి ఒక నాలుగు అంకెల తాత్కాలిక పిన్ నెంబర్‌ను క్రియేట్ చేసుకోండి.
5. ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్‌తో లింకయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది.
6. ఇప్పుడు ఏదైనా ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంకు వెళ్లండి
7. ఏటీఎం మిషన్‌లో Cardless Cash Withdrawalను క్లిక్ చేయండి.
8. మీ మొబైల్ నెంబర్‌ను, ఇంతకు ముందు మీకు వచ్చిన ఓటీపీ నెంబర్‌ను ఎంటర్ చేయండి. చివరిగా మీరు క్రియేట్ చేసుకున్న టెంపరరీ పిన్ నెంబర్‌ను కూడా ఎంటర్ చేయండి.
9. ఇప్పుడు మీరు ముందే నిర్ణయించుకున్న అమౌంట్‌ను ఎంటర్ చేయండి.
10. అంతే మీకు ఏటీఎంలో నుంచి క్యాష్ వచ్చేస్తుంది. కార్డ్ లేకుండానే క్యాష్ విత్‌డ్రాయల్ విజయవంతంగా పూర్తి చేసినట్లే.
ఇవి గుర్తు పెట్టుకోండి
* మీరు కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ కోసం సెట్ చేసుకున్నటెంపరరీ పిన్, మీకు వచ్చిన ఓటీపీ రెండూ కూడా తర్వాత రోజు రాత్రి 12గంటల వరకు పని చేస్తాయి. (ఉదాహరణకు మీరు 5వ తేదీ పిన్, ఓటీపీ తీసుకుంటే అవి 6వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. )
* ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు రోజుకు 20వేల రూపాయలు మాత్రమే కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ద్వారా తీసుకోగలరు. అలాగే ఒకసారి విత్‌డ్రాయల్ మ్యాగ్జిమం లిమిట్ కూడా 20వేల రూపాయలు మాత్రమే.
* ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఫెసిలిటీ దేశంలోని 15వేల ఐసీఐసీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంది.
పక్కా సెక్యూరిటీ
కార్డ్ అందుబాటులో లేనప్పుడు క్యాష్ తీసుకోవడానికి మాత్రమే కాదు. సెక్యూరిటీపరంగానూ ఈ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ మంచి ఆప్షన్. ఎందుకంటే ఏటీఎంల్లో స్కిమ్మర్ మిషన్లు పెట్టి మీ కార్డ్ డిటెయిల్స్ కొట్టేసి కార్డ్ క్లోన్ చేసే ముఠాలు బాగా పెరిగిపోయాయి. కార్డ్‌లెస్ విత్‌డ్రాయల్‌లో అసలు కార్డే ఏటీఎంలో పెట్టం కాబట్టి కార్డ్ స్కిమ్మర్ల గురించి ఫికర్ లేదు. అంతేకాదు ఓటీపీ మన మొబైల్‌కే వస్తుంది కాబట్టి సెక్యూరిటీ మరింత బాగున్నట్లే. కాకపోతే ఈ ఓటీపీ ఎవరికీ చెప్పకండి. ఎందుకంటే మీ ఫోన్ నెంబర్ వాళ్లకు తెలిసి ఉంటే ఈజీగా విత్‌డ్రా చేసేసుకునే ప్రమాదం ఉంది.