ఐఆర్ సీటీసీ వచ్చిన తరువాత రైల్వే టికెట్ల బుకింగ్ సులభమైపోయింది. అయితే.. ఇందులోనూ ఇంకా సులభమైన విధానాలను కోరుకుంటున్నారు వినియోగదారులు. వారికోసమే ఎంవీసా విధానం తీసుకొస్తోది ఐఆర్ సీటీసీ. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎంవీసా విధానంలో పేమెంటు చేసేలా కొత్త మార్పులు చేసింది.
సెప్టెంబరు 4 వరకు..
ఇందులో భాగంగా సెప్టెంబరు 4 వరకు రూ.50 క్యాష్ బ్యాక్ కూడా ఇస్తోంది ఐఆర్ సీటీసీ. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్లోని ఎంవీసా సెక్షన్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి పే చేస్తేనే ఈ క్యాష్ బ్యాక్ వస్తుంది.
స్మార్టు ఫోన్ల మార్కెట్లో భారత్ హవాయే ఆలంబనగా..
ప్రస్తుతం ప్రపంచంలోనే స్మార్టు ఫోన్ల మార్కెట్ కు ఇండియా అత్యంత కీలక దేశంగా మారింది. దీంతో అందరి దృష్టీ భారత్ పైనే ఉంది. వచ్చే అయిదేళ్లలో భారత్ లో 100 కోట్ల స్మార్టు ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. దీంతో డిజిటల్ పేమెంట్ల వైపు అందరూ మళ్లుతున్నట్లే ఐఆర్ సీటీసీ కూడా అన్ని రకాల డిజిటల్ పేమెంట్లకూ ఓకే చెప్తోంది. అందులో భాగంగానే ఈ క్యూఆర్ కోడ్ మెథడ్ ఫాలో అవుతోంది.