• తాజా వార్తలు

స్మార్ట్ ఫోన్ లో షాపింగ్ కానిచ్చే వారు నిర్ణయాలు తీసుకునే విధానం ఎలా ఉంటుంది ?

 
గడచిన శతాబ్ద కాలం నుండీ సైన్సు సాధించిన పురోగతి వలన మానవుని జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఎన్నో , మరెన్నో నూతన ఆవిష్కరణ లు మానవ జీవన నైపుణ్యాలను సమూలంగా మార్చి వేసి మనిషికి ఒక కొత్త నాగరికతనూ, ఒక సౌకర్యవంతమైన జీవన విధానాన్ని అలవరచాయి. నేడు మానవుడు అనుభవిస్తున్న సకల సౌఖ్యాలకూ టెక్నాలజీ లో వచ్చిన మార్పులే కారణం అనేది అందరూ అంగీకరించే విషయం. అయితే ఈ శతాబ్ద కాలం లో గత దశాబ్దం ఒక ఎత్తు మిగిలిన 90 సంవత్సరాలూ ఒక ఎత్తు. అవును ఈ దశాబ్ద కాలం లో మారినంత వేగంగా మరే కాలం లో నూ మనిషి జీవన విధానాలు మారలేదు. దీనిని కారణం స్మార్ట్ ఫోన్ లు. అవును ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ లు మనిషి యొక్క జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడమే అనే స్థాయి నుండి ఫోన్ అంటే అన్ని పనులకూ ఉపయోగించేది అనే స్థాయి కి ఈ స్మార్ట్ ఫోన్ లు మానవ జీవితాన్ని మార్చాయి. నేటి స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువశాతం ఉపయోగిస్తున్న అంశం ఆన్  లైన్ షాపింగ్. ఈ కామర్స్ అనేది ప్రవేశించాక దాదాపు అన్ని రంగాలలోనూ విపరీతమైన మార్పులు వచ్చాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు షాప్ కి వెళ్ళే బదులు ఆన్ లైన్ లో కొనేయవచ్చు కదా అనుకుంటున్నారు. ఈ మధ్య జరిపిన ఒక సర్వే లు ఫోన్ ను కలిగిన ఉన్న వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ నే ఇష్ట పడుతున్నారని తేలడం దీనికి ఒక ఉదాహరణ. అయితే ఇంత పెద్ద మొత్తం లో వినియోగదారులు ఆన్ లైన్ షాపింగ్ ను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? ఆన్ లైన్ లో ఏదైనా వస్తువును కొనేటపుడు వినియోగదారుల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఆ సమయం లో వారు నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ఎలాంటి అంశాలలో ఆన్ లైన్ లో ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు ? అనే అంశాల పై ఒక విశ్లేషణ ఈ వ్యాసం.
     ఈ మధ్యే జరిగిన ఒక సర్వే ప్రకారం 90 శాతం మంది వినియోగదారులు ఫ్యాషన్, ట్రావెల్, మ్యూజిక్, మూవీ లు లాంటి వాటిపై ఆన్ లైన్ లో ఖర్చు పెట్టడానికి మొబైల్ ఫోన్ లను ఉపయోగిస్తున్నారు. 36 శాతం మంది భీమా, పెట్టుబడులు లాంటి వాటికోసం ఇప్పటికీ తమ కంప్యూటర్ నే నమ్ముకుంటున్నారు.దానిపైనే ఆధార పడుతున్నారు. అంటే వీరందరూ అక్కడ కొంటున్నారు అని అర్థం కాదు. రేట్ లు, డిజైన్ లు, మోడల్ లు, ఆఫర్ లు తదితర విషయాలను చెక్ చేసుకోవడానికే ప్రాథమికంగా వీటిని ఉపయోగిస్తున్నారు. ఆ తర్వాత అవి వారికి నచ్చితే కొంటున్నారు లేకపోతే లేదు.
2015 వ సంవత్సరం వరకూ ఆన్ లైన్ షాపింగ్ అనేది దాదాపు మొత్తం PC లు లేదా లాప్ టాప్ ల ద్వారానే నడిచింది. కానీ ఎప్పుడైతే ఈ కామర్స్ సైట్ లన్నీ తమ తమ మొబైల్ యాప్ లను విడుదల చేశాయో ఆ ట్రాఫిక్ అంతా ఇటువైపు మళ్ళింది. కార్ లు, హౌసింగ్ మొదలైన ఖరీదైన వస్తువుల కోసం అయితే ఆన్ లైన్ లో వెతికి, లోతైన పరిశోధన చేసి ఒక నిర్ణయానికి వచ్చాక ఫిజికల్ గా షో రూమ్ కి వెళ్లి అక్కడ కొంటున్నారు. అంటే ఆన్ లైన్ ను కొనడానికి మాత్రమే గాక చెక్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు అన్నమాట.
మరొక రిపోర్ట్ లో ఇండియా లో 2015 వ సంవత్సరం లో ఎంతమంది ఫుడ్ ని ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేశారు అని పరిశోధిస్తే సుమారు 85 శాతం మంది వినియోగదారులు మొబైల్ ఫోన్ ల ద్వారా ఫుడ్ ను ఆర్డర్ చేశారు. వీటిలో ఒక మిలియన్ కు పైగా ఫుడ్ ఆర్డర్ లు జోమాటో యాప్ ద్వారా జరిగినవి. ( ఈ సర్వే మెట్రో నగరాలలో జరిగింది ). నగరాలలో ఉండే వినియోగదారుల ఆలోచనను ఇది ప్రతిబింబిస్తుంది. అంటే ప్రోడక్ట్ యొక్క రకాన్ని బట్టి కూడా వినియోగదారులు ఖర్చు చేస్తున్నారన్నమాట!అంటే ఆన్ లైన్ లో కొనడం అనే విషయాన్ని ప్రోడక్ట్ యొక్క రకం అనేది ప్రభావితం చేస్తుంది.
మరొక పరిశోధన ప్రకారం 98 శాతం మంది భారతీయ వినియోగదారులు ఆన్ లైన్ లో కొనేటపుడు క్రెడిట్/డెబిట్ కార్డు ల బదులు క్యాష్ ఆన్ డెలివరీ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఏదైనా వస్తువును ఆర్డర్ చేసటపుడు అది సక్రమంగా మనకు చేరుతుందా లేదా అనే సందేహం వినియోగదారులలో బలంగా ఉంది అని స్పష్టం అవుతుంది. ఇది మన ప్రజల రక్తం లోనే ఉంది అని కొంతమంది చమత్కరిస్తారు కూడా! దీనికి అనుగుణంగా ఈ కామర్స్ సైట్ లు కూడా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ను ఉంచుతున్నాయి.
మొత్తంమీద చూసుకుంటే ఆన్ లైన్ లో వస్తువులను కొనేటపుడు వినియోగదారులు తీసుకునే నిర్ణయాలను ఈ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
ప్రోడక్ట్ లలో ని రకాలు :- వీలైనన్ని ఎక్కువ ఉత్పత్తులు ఉండే సైట్ లానే ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. తదనుగుణంగా ఈ కామర్స్ సైట్ లు కూడా తమ వద్ద వీలైనన్ని ఎక్కువ ఉత్పత్తులు ఉండేలా చూసుకుంటున్నాయి.
సర్వీస్ : తర్వాత ఎక్కువ మంది ఆలోచిస్తున్న అంశం సర్వీస్. పే మెంట్ ఆప్షన్ ఎలా ఉంది, ఎన్ని రోజుల్లో డెలివరీ అందుతుంది అనే అంశాలను కూడా పరిగణన లోనికి తీసుకుంటున్నారు. వీటిలో ఎక్కువ మంది క్యాష్ ఆన్ డెలివరీ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం.

"

జన రంజకమైన వార్తలు