జులై 1... ఈ తేదీ ప్రత్యేకత ఏంటో దేశంలో ఎవరిని అడిగినా చెప్తారు. దేశ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలవుతున్నది... దేశవ్యాప్తంగా ఏకరూప పన్ను విధానం అమలవుతున్నదీ ఈ తేదీనే. దీంతో పాటు జులై 1 నుంచి మన జీవితాల్లో మరికొన్ని కీలక మార్పులు కూడా రానున్నాయి. అవేంటో చూద్దామా..
* ఇన్ కం ట్యాక్స్ రిటర్నులు ఫైల్ చేసేవారికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ నంబరు ఇవ్వకుంటే రిటర్నులు చెల్లుబాటు కావు.
* పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
* ఇక నుంచి కొత్తగా పాస్ పోర్టు కావాలనుకునేవారు ఎవరైనా సరే ఆధార్ కార్డు ఉంటేనే దాన్ని పొందగలుగుతారు.
* ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు కూడా ఆధారే ఆధారం.
* రైల్వే టిక్కెట్లపై రాయితీలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి.
* స్కూళ్లు, కాలేజిల్లో స్కాలర్ షిపులకూ ఆధారే కీలకం.
* ప్రజా పంపిణీ వ్యవస్థకు, రేషన్ సరకులకు ఆధార్ తప్పనిసరి.
* ఆస్ర్టేలియా వెళ్లే భారతీయులకు జులై 1 నుంచి ఆన్ లైన్ వీసా సదుపాయం వస్తోంది.
* చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులకు జులై 1 నుంచి సిలబస్ మారుతోంది.