సాహిల్ సానీ వినూత్న వేదిక జస్టు బై లైవ్ దేశంలో ఈ కామర్సు రంగం ఊపందుకుంటోంది. బడా బడా ఈ కామర్సు పోర్టళ్లన్నీ B2C ఫార్ములాపైనే(బిజినెస్ టు కంజ్యూమర్) ఫోకస్ చేస్తున్నాయి. మరి రిటైలర్ల సంగతేంటి? డిస్ట్రిబ్యూషన్ కోసం కంపెనీలు ఈ కామర్సు టెక్నాలజీని ఎందుకు వాడుకోకూడదు. సాహిల్ సానీ అనే కుర్రాడికి వచ్చిన ఈ ఆలోచన ఈ కామర్సులో కొత్త ట్రెండు తీసుకొస్తోంది. సాహిల్.. బోస్టన్ కాలేజ్ గ్రాడ్యుయేట్. స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇండియాకు తిరిగొచ్చిన సాహిల్ తమ ఫ్యామిలీ బిజినెస్ అయిన డిస్ట్రిబ్యూషన్ రంగంలో 15 ఏళ్ల పాటు పనిచేశారు. వారి ఫ్యామిలీ కేవలం హర్మాన్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్సు మాత్రమే పంపిణీ చేసేది. అయితే సాహిల్‌కు మాత్రం ఒక్క బ్రాండ్‌కే పరిమితం చేయడం ఇష్టం ఉండేదు కాదు. బిజినెస్ విస్తరించాలన్న కోరికతో మార్కెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొత్త స్టార్టప్ మొదలుపెట్టాడు. లక్షలాది మంది చిన్న కిరాణా వ్యాపారులను డిజిటల్ వేవ్‌లోకి తీసుకురావాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. టైలర్ల ఇబ్బందులు, కష్టాలను అధ్యయనం చేసిన తర్వాత 2015లో జస్ట్ బై లైవ్ వెబ్ సైట్ నెలకొల్పాడు. రిటైలర్లు 40-50 మంది డిస్ట్రిబ్యూటర్లలో డీల్ చేయాల్సి వస్తుంది. ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఒక కంపెనీ ప్రొడక్టు మాత్రమే పంపిణీ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు దయపైనే రిటైలర్లకు స్టాక్ అందుతుంది. క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తారు. అయితే తమకు సరైన ధరకే తమకు సరుకు అందుతోందా? కంపెనీ ఇచ్చే ఆఫర్లు, స్కీంలు తమ దాకా చేరుతున్నాయా అనే సందేహం రిటైలర్లలో ఉంటుంది. ఇండియన్ ఫైనాన్స్ ఇండస్ట్రీలో గొప్ప పేరున్న భరత్ బాలచంద్రన్ వద్ద సాహిల్ ఈ సందేహాలన్నీ వ్యక్తంచేశారు. దేశంలో అప్పులిచ్చే అతి పెద్ద సంస్థను నడుపుతున్న ఆయన.. కొన్ని బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తున్నారు. బాలచంద్రన్ నుంచి ఫైనాన్స్ కిటుకులు తెలుసుకున్నారు. జస్టు బై లైవ్ స్టార్టప్ లో ఆయన సూచనలు ఇంప్లిమెంటు చేశారు. జస్టు బై లైవ్‌లో వివిధ బ్రాండ్ల ఉత్పత్తులు ఉంచారు. రిటైలర్లు అందులోంచి ఈజీగా ఉత్పత్తులను ఎంపిక చేసుకోవచ్చు. క్రెడిట్ కూడా ఇస్తారు. ఈ కొత్త విధానంలో సరుకు కొనుగోలు చేసేందుకు రిటైలర్లను ఒప్పించడం కత్తిమీద సామే అవుతుందని అనుకున్నారు సాహిల్. కానీ అదృష్టవశాత్తూ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. 1000 మందితో కలిసి టీంను ఏర్పాటు చేసి రిటైలర్లను ప్రత్యక్షంగా కలిసి జస్ట్ బై లైవ్ గురించి వివరిస్తున్నారు. జస్ట్ బై లైవ్ పై అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రొఫైల్ లు సెట్ చేసేందుకు సాయం చేస్తున్నారు. జస్టు బైలో ఎలా ఆర్డర్ ఇవ్వాలో నేర్పుతున్నారు. హోల్ సేల్ మార్కెట్ గా... వివిధ సంస్థలకు ఒకే డిస్ట్రిబ్యూటర్ గా జస్టు బైలవ్ 2015 నవంబర్‌లో బాంబే, ఢిల్లీ, బెంగళూరులో లాంఛ్ అయింది. 1000 మంది రిటైలర్లతో ప్రారంభించిన ట్రయల్ సక్సెస్ అయింది. 2016 జనవరి 1 నుంచి ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో యాప్ ఓన్లీ సర్వీసులు ప్రారంభించిన ఈ స్టార్టప్ నెల రోజుల వ్యవధిలోనే 15 సిటీల్లో 25వేల మంది రిటైలర్లకు దగ్గరైంది. ఇదే సమయంలో కంపెనీకి మైలురాయి లాంటి ఫండింగ్‌ను సాధించగలిగింది. జస్టు బై లైవ్ కు నిత్యం వెయ్యి మంది రిటైలర్లు యాడ్ అవుతున్నారు. ఇప్పటి వరకు నెలనెలా 300శాతం గ్రోత్ కనిపిస్తోంది. ప్రస్తుతం వెయ్యి బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను అందుబాటులోకి తేవడం విశేషం. ఈ స్టార్టప్‌కు ప్రస్తుతం 15 వేర్ హౌస్‌లున్నాయి. ఆన్ లైన్ వ్యాపారంలో ఇలా డిస్ట్రిబ్యూషన్ యాంగిల్ సక్సెస్ కావడంతో దీనిపై మరికొందరు దృష్టి సారిస్తున్నారు. |