భారత్‌లో ప్రయాణ రంగంలో ఓలా, ఉబర్ కంపెనీలు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే అదో పెద్ద తలనొప్పి. సొంత వెహికల్ ఉంటే ఫర్వాలేదు. అదే బయట వాహనాలపై ఆధారపడాల్సి వస్తే పరిస్థితి దారుణంగా ఉండేది. ముఖ్యంగా ఇంటర్వ్యూలు లాంటి ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు బస్‌లు పట్టుకుని వెళ్లేసరికే పనైపోయిదే. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిన ఓలా, ఉబర్ కార్లు వినియోగదారుల అవసరాలు తీరుస్తూ భారీ ఎత్తున వ్యాపార సామ్రాజ్యాన్ని కట్టుకున్నాయి. ఒక దశలో ఈ రెండు పోటీపడి ఒకటిని మించి ఒకటి ఆఫర్లు గుప్పించాయి. దీంతో ఇప్పుడు వినియోగదారులు కూడా బయటకు వెళ్లడం పెద్ద సమస్యగా భావించట్లేదు. ముఖ్యంగా కుటుంబంతో సహా వెళ్లాల్సి వచ్చినప్పుడు బస్‌లు, ఆటోలను పట్టుకోవాల్సిన ఇబ్బందులు తగ్గిపోయాయ్. దీంతో ఓలా, ఉబర్‌ల మధ్య పోటీ మరింత తీవ్రతరమైంది. కీలక సమయాల్లో సర్ ఛార్జీలు పెంచడం కూడా ఈ పోటీలో భాగమే. ఐతే ఈ సర్ ఛార్జీల గురించి గొడవ తలెత్తడంతో వాటిని ఈ రెండూ కొన్ని నగరాల్లో ఉపసంహరించాయి. ఐతే వినియోగదారులకు అవసరాలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఓలా కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఈ వ్యూహంలో భాగంగా ఆ సంస్థ మైక్రో కార్లను రంగంలోకి దింపింది. మధ్య తరగతి వినియోగదారులకు తక్కువ రేట్లలో మంచి సదుపాయాలున్న కారు ప్రయాణాన్ని కల్పించడంమే మైక్రో ఉద్దేశం. ఈ కొత్త వ్యూహం సత్ఫలితాలను ఇస్తోందని ఓలా చెప్పింది. మరోవైపు ఓలా కొత్త ప్రయోగం విజయవంతం కావడంతో అలాంటి వ్యూహాన్నే తామూ అమలు చేయాలని ఉబర్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికి కొన్ని నగరాల్లో మాత్రమే అమల్లో ఉన్న ఈ మైక్రో కార్ సిస్టమ్ త్వరలోనే 75 నగరాలకు విస్తరించనుంది. సాధారణంగా ఓలా, ఉబెర్‌లో గో, పూల్, ఎక్స్, ఎస్‌యూవీ లాంటివి ఉంటాయి. వీటిలో ఏ కారు కావాలో వినియోగదారులు నిర్ణయించుకుంటారు. కానీ ఇవన్నీ ఎక్కువ ధరల్లోనే ఉండటంతో కొంతమంది వినియోగదారులు ఈ ప్రయాణాలను విరమించుకుంటున్నారు. అలాంటి యూజర్లను ఆకర్షించడానికి అందుబాటులోని రేట్లతో ఓలా మైక్రో కార్ల సదుపాయాన్ని కల్పించింది. అందుబాటులో ఉన్న రేట్లతో ఎయిర్ కండిషన్డ్ కార్లతో ప్రయాణం లక్ష్యంగా ఓలా ముందుకు కదులుతోంది. so-fareast-font-family:"Times New Roman"; mso-hansi-font-family:Arial;color: #222222'> ఉత్తరాంచల్‌లో తయారు చేస్తున్నారు. ఒక్కో ప్లాంట్‌ను రూ.250 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఒక్కో ప్లాంట్ 5 లక్షల ఫోన్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. |