క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ పేమెంట్ విధానంతో పాటు వ్యాలెట్ పేమెంట్, క్యాష్ కార్డులు వంటివి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా నగదు రూపంలో చెల్లింపులు తగ్గుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా నగదు రహిత సమాజం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే చాలా దేశాల్లో చెల్లింపుల్లో నగదు కనిపించడం లేదు. భవిష్యత్తులో కొన్ని దేశాల్లో కరెన్సీ నోట్లు, నాణాలు కనుమరుగు అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్నట్లుగా ఉంది. కొన్ని దేశల్లో చెల్లింపుల తీరు పరిశీలిస్తే అవి 100 శాతం నగదు రహిత దేశాలుగా మారడానికి ఎంతో కాలం పట్టదని అర్ధమవుతోంది. అంతేకాదు .. ప్రపంచమంతా కూడా కొన్నాళ్లు నగదు రహిత చెల్లింపుల పద్ధతిలోకి పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అది సాధ్యమైనప్పుడు ఇప్పుడు వీధివీధినా కపిపిస్తున్నా ఏటీఎం యంత్రాలు కూడా మూలనపడడం ఖాయం. నగదు రహితంగా మారుతున్న దేశాల్లో తొలి పది స్థానాల్లో ఉన్న దేశాల్లో ఎలా ఉందో చూద్దామా.. బెల్జియం .. 100 శాతం నగదు రహితంగా మారేందుకు సమీపంలో ఉన్న దేశాలు ఈ జాబితా లో బెల్జియం ముందుంది. ఈ దేశంలో మొత్తం చెల్లింపుల్లో 93 శాతం నాన్ కేష్ పేమెంట్లే,ఇక్కడ నగదు రూప చెల్లింపులపై ఆంక్షలూ ఉన్నాయి. 3 వేల యూరోలు దాటిన మొత్తాన్ని నేరుగా నగదు రూపంలో చెల్లిస్తే 2,25,000 యూరోలు వరకు జరిమానా విధించేలా చట్టం ఉంది. ఈ దేశంలో 86 శాతం మంది ప్రజలకు డెబిట్ కార్డులు ఉన్నాయి. ప్రాన్స్.. ఇక్కడ 92 నాన్ కేష్ పేమెంట్లే, బెల్జియం మాదిరిగానే నగదు రూప చెల్లింపులు గరిష్ఠ పరిమితి 3 వేల యూరోలు మాత్రమే. దేశ ప్రజల్లో 69 శాతం మందికి డెబిట్ కార్డులున్నాయి. కెనడా.. నో కేష్ పేమెంట్లు ఇక్కడ 90 శాతం. దేశ ప్రజలలో 88 శాతం మంది డెబిట్ కార్డులున్నాయి.దీంతో కెనడాలో 2013 నుంచి పలు నాణేల ముద్రణ మానేశారు.దాని వల్ల ఏడాదికి 11 మిలియన డాలర్ల ఖర్చు తగ్గిందట. బ్రిటన్.. 90 శాతం నగదు రహిత చెల్లింపులే.ఇక్కడ సిటీ బస్సుల్లో నగదు తీసుకోరు.ప్రీ ప్రెయిడ్ కార్డు కానీ ..వ్యాలెట్ పేమెంట్ వంటి విధానాలు కానీ ఫాలో కావాల్సిందే. స్వీడన్.. 89 శాతం నగదు రహిత చెల్లింపులు జరుగుతున్నాయి ఇక్కడ.96 శాతం మంది డెబిట్ కార్డులున్నాయి.1970 నలుయుయలనెదెయలనుదె ప్రాంతంలో స్వీడన్ లో బ్యాంకు దొంగతనాలు ఎక్కువగా జరిగావి.ఇప్పుడు ఈ దేశావ్యాప్తంగా ఏడాదికి ఒకటి కూడా అలావంటిది జరగడం లేదట.అసలు ఇక్కడ బ్యాంకుల్లో నగదు నిల్వలు కూడి చాలా స్వల్పమట. ఆస్ట్రేలియా.. 86 శాతం నగదు రహిత చెల్లింపులు . నెదర్లాండ్స్.. 85 శాతం అమెరికా.. 80 శాతం జర్మనీ... 76 శాతం దక్షిణ కొరియా.. ఇక్కడ నగదు రహిత చెల్లింపులు 70 శాతం. నిజానికి మిగతా దేశాలకంటే ఒక దశలో దక్షిణ కొరియా నగదు రహిత చెల్లింపులు భారీగా ఉన్నా క్రెడిట్ కార్డులకు అలవాటు పడి ప్రజలు అప్పులపాలవుతుండడంతో అక్కడి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించి కళ్లెం వేసింది. దాంతో ఈ విషయంలో దక్షిణ కొరియా. పదో స్ధానంలో సరిపెట్టుకుంది. |