నేటి సమాజం లో షాపింగ్ మరియు దాని పోకడలు పూర్తిగా మారిపోయాయి. ఇంటర్ నెట్ రాకతో మనం షాపింగ్ చేసే విధానం సమూలంగా మారిపోయింది. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా మనకు డబ్బు తో పాటు సమయం కూడా అడ అవుతుంది అందరూ ఒప్పుకుంటున్న విషయం; ఇది చాలా సులభంగానూ మరియు సరదా గానూ ఉంటుంది. ఇంటర్ నెట్ షాపింగ్ ద్వారా మనం ప్రపంచం మొత్తం లో ఎక్కడనుండైనా షాపింగ్ చేయవచ్చు. వివిధ రకాల వర్తకుల మధ్య ధరలను పోల్చి చూడవచ్చు. వీటిలో మనకు నచ్చిన వస్తువును నచ్చిన ధరలో కొనుగోలు చేయవచ్చు. అదికూడా మనం కొన్న వస్తువు నేరుగా మన ఇంటికే వచ్చే విధంగా!
వివిధ రకాల స్టోర్ లను తిరిగి వాటిని కొనవలసిన అవసరం లేదు. ఏది కావాలన్నా మన అరచేతిలోనే స్మార్ట్ ఫోన్ రూపం లో ఉంటుంది, అక్కడే షాపింగ్ చేయవచ్చు. అర చేతి షాపింగ్ భలే విచిత్రం గా ఉంది కదా! క్రెడిట్ కార్డు ఫ్రాడ్, ఐడెంటిటీ థెఫ్ట్ లాంటి కొన్ని కొన్ని సేఫ్టీ ఇష్యూ లను మినహాయిస్తే ఆన్ లైన్ షాపింగ్ అనేది చాలా సౌకర్యవంతమైన మరియు సులభమైన షాపింగ్ మార్గం.
ఇలా ఆన్ లైన్ లో షాపింగ్ చేసేటపుడు కొన్ని టెక్నిక్ లు పాటించడం ద్వారా మన షాపింగ్ ను మరింత ఫలప్రదం గా మార్చుకోవచ్చు. అలాంటి కొన్ని టిప్స్ గురించి ఈ ఆర్టికల్ లో చర్చించడం జరిగింది.
1. ఏ వస్తువును కొనాలో ముందే నిర్ణయించుకోండి.
మనం కొనాలి అనుకున్న దానిపై ఒక సరైన ప్రణాళిక ను కలిగి ఉండడం చాలా మంచిది. ఆన్ లైన్ షాపింగ్ ప్రారంభించేముందు అది చాలా అవసరం కూడా. ఒక్కోసారి డిస్కౌంట్ లు మనలను టెంప్ట్ చేసే విధంగా ఉంటాయి. వాటిని చూసి అవసరం ఉన్నా లేకపోయినా కొనేస్తారు. అలా చేయడం వలన డబ్బు వృధా తప్ప మరో ప్రయోజనం ఉండదు. కాబట్టి మనకు ఏది అవసరమో దానికి తగ్గ ప్రణాళిక రచించుకోవడం చాలా ముఖ్యం.
2. ప్రత్యేక మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్ ల గురించి వెదకండి.
ఆన్ లైన్ షాపింగ్ చేసేటపుడు కొన్ని స్పెషల్ ఆఫర్ లను చూడడం వలన కొంత వరకూ దబు ఆదా అవుతుంది. గ్రేట్ డీల్స్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్ లను పొందడానికి మీరు కూపన్ వెబ్ సైట్ లను కూడా వెదకవచ్చు.
3. ధరలను పోల్చండి.
మీకు అవసరమైన వస్తువుల యొక్క ధరలను పోల్చడం అనేది ఆన్ లైన్ షాపింగ్ లో ఒక తెలివైన ప్రక్రియ. ఇలా ధరలను పోల్చడానికి కూడా అనేక రకాల వెబ్ సైట్ లు నేడు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ఇంతకుముందు మన వెబ్ సైట్ లో సమగ్రంగా చర్చించడం జరిగింది. కేవలం ధరలను మాత్రమే గాక మీరు ప్రోడక్ట్ యొక్క ఫీచర్ లను కూడా పోల్చి చూడవచ్చు.
4. సరైన షాపింగ్ సైట్ ను సెలెక్ట్ చేసుకోండి.
ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ చేయకుండా సరైన షాపింగ్ వెబ్ సైట్ ను స్లేచ్ట్ చేసుకోవడం కూడా ముఖ్యమైన విషయం. బాగా పేరుమోసిన సైట్ లు అయితే వివిధ రకాల వస్తువులతో పాటు నమ్మకం కూడా లభిస్తుంది.అంతేగాక సరైన సైట్ ను సెలెక్ట్ చేసుకోవడం వలన మనకు కావలసిన దానిపై ఒక స్పష్టత వస్తుంది. ఉదాహరణకు మనకు ఒక మొబైల్ ఫోన్ కావాలనుకోండి, కేవలం మొబైల్ ఫోన్ లానే అందించే సైట్ లు అనేకం ఉన్నాయి. దుస్తులు కావాలి అనుకోండి, అనేక రకాల మోడల్ లు, భారీ డిస్కౌంట్ లను అందించే సైట్ లు కూడా ఉన్నాయి. కాబట్టి సరైన సైట్ ను ఎంచుకోవడం కూడా ముఖ్యమైన విషయం.
5. టాక్స్ లు, డ్యూటీ లు మరియు ఎక్స్ చేంజ్ పాలసీ లను అర్థం చేసుకోవడం.
అంతర్జాతీయ రిటైలర్ ల నుండి కొన్ని ప్రోడక్ట్ లను కొనేటపుడు అందులో వస్తువు యొక్క ధర తో పాటు మిగతా ఛార్జ్ లు ఏవైనా ఉన్నాయేమో చూసుకోవాలి. కస్టమ్ డ్యూటీ లు, షిప్పింగ్ ఛార్జ్ లు, ఇంపోర్ట్ డ్యూటీ లు, ఇతర టాక్స్ లు లాంటి అదనపు ఛార్జ్ లు వేసినపుడు కొంతమంది నిరాశకు గురవుతూ ఉంటారు, అలా కాకుండా వాటి గురించి ముందే తెలుసుకుంటే వాటికి తగ్గట్లు షాపింగ్ చేయవచ్చు కదా!
6. సమయాన్ని సరి చూసుకోండి
ఈ సైట్ లు అందించే భారీ డిస్కౌంట్ ల వలన వీటిని అనేక మంది ప్రతీ రోజూ చూస్తూ ఉంటారు. దీనివలన అ సైట్ కు ట్రాఫిక్ ఎక్కువ పెరిగి సర్వర్ నిదానంగా ఉండడం వలన మీరు కావాలి అనుకున్నది తొందరగా లోడ్ అవ్వదు. కాబట్టి మీరు ఉదయం లేదా రాత్రి వేళల్లో షాపింగ్ చేయడం వలన ఎటువంటి చికాకు లేకుండా ప్రశాంతంగా మనకు కావాలనుకున్న దానిని కొనవచ్చు.
7. బెస్ట్ పే మెంట్ మోడ్ ను సెలెక్ట్ చేసుకోండి.
పే మెంట్ చేసేటపుడు డెబిట్ కార్డు కు బదులు క్రెడిట్ కార్డు ద్వారా చేయడం మంచిది. ఎందుకంటే డెబిట్ కార్డు ద్వారా హ్యాకర్ లు మన బ్యాంకింగ్ సమాచారాన్ని హ్యాక్ చేసే అవకాశం ఉంది. కొన్ని క్రెడిట్ కార్డు కంపెనీలు ఆన్ లైన్ షాపింగ్ కోసం సింగల్ యూస్ క్రెడిట్ కార్డు నెంబర్ లనూ మరియు మీ అకౌంట్ కు కొన్ని అదనపు రక్షణ ఫీచర్ లనూ అందిస్తాయి. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ మీకు అంత సురక్షంగా కనిపించకపొతే క్యాష్ ఆన్ డెలివరీ ని ఎంచుకోవచ్చు. దీనికి మించినది లేదు.
8. సెక్యూర్ ఇంటర్ నెట్ కనెక్షన్ ను ఉపయోగించండి మరియు మీ సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసుకోండి.
ప్రముఖ ఈ కామర్స్ సైట్ లన్నీ డేటా ఎన్ క్రిప్షన్ కోసం సెక్యూర్ సాకెట్ లేయర్ ను కానీ లేదా సెక్యూర్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ మిషన్ ను కానీ ఉపయోగిస్తాయి. అలాంటివె మంచివి. మీ ఆర్థిక వ్యవహారాలను పాప్ అప్ మెసేజ్ ల ద్వారా అడగుతూ సైట్ ల జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది.దీనితో పాటు మీ సిస్టం లోని సాఫ్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి.