• తాజా వార్తలు

పేయూతో జ‌ట్టు క‌ట్టిన రిల‌య‌న్స్ మ‌నీ..  ఇక యాప్ ద్వారా ప‌ర్స‌న‌ల్ లోన్స్ 

ఇండియాలో లీడింగ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీల్లో ఒక‌టైన  రిల‌య‌న్స్ మ‌నీతో పే యూ జ‌ట్టు క‌ట్టింది. ఇండియాలో క్రెడిట్ మార్కెట్ రోజురోజుకీ విస్త‌రిస్తుండ‌డంతోఈ రంగంలో ఉన్న వ్యాపారావ‌కాశాల‌ను అందిపుచ్చుకోవడానికి పేయూ రిల‌య‌న్స్ మ‌నీతో టై అప్ చేసుకుంది. యాప్ ద్వారా అవ‌స‌ర‌మైన వారికి ప‌ర్స‌న‌ల్ లోన్ ఇవ్వ‌డం ఈ ఒప్పందంలో ప్ర‌ధాన ల‌క్ష్యం. 

15 కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లు
ఇండియాలో క్రెడిట్ మార్కెట్ చాలా వేగంగా డెవల‌ప్ అవుతోంది.  దాదాపు 40 న‌గ‌రాల్లోని 52వేల మంది క‌స్ట‌మ‌ర్లు ఈ మార్చి నాటికి 13,674 కోట్ల రూపాయ‌లు లోన్‌గా తీసుకున్నారు.  లోన్ అవ‌స‌ర‌మై, తిరిగి క‌ట్ట‌గ‌లిగే వారు దాదాపు 15 కోట్ల మంది ఉన్నార‌ని అంచ‌నా.  అయితే వీరిలో చాలా మందికి  ల‌క్ష రూపాయ‌ల్లోపు అప్పు స‌రిపోతుంది. అంటే వందలు, వేలు అప్పు అవ‌స‌ర‌మైన‌వారు కూడా ఉంటారు. ఇలాంటి చిన్న‌వాటికి ప‌ర్స‌న‌ల్ లోన్లు తీసుకుంటే వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉండ‌డమే కాదు ప్రాసెసింగ్ ఫీజు పేరిటా 2,3 వేలు తీసుకుంటున్నాయి బ్యాంకులు. అదీ కాక ల‌క్ష రూపాయ‌ల్లోపు ప‌ర్స‌న‌ల్ లోన్ ఇవ్వ‌డానికి అంత ఇంట్ర‌స్ట్ కూడా బ్యాంకులు చూపించ‌వు. ఇలాంటి ప‌రిస్థితుల్లో లోన్ కావాల్సిన వ్య‌క్తికి, బ్యాంకుల‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌ను తాము ఫిల్ చేయాల‌న్న‌ది ఈ కంపెనీ ల‌క్ష్యం. 

ఎవ‌రికి ఇస్తారు? ఏంటి ప్రాసెస్‌?
* నెల జీతాలు వ‌చ్చేవాళ్ల‌కు, జీతం కాకుండా ఏదో వ్యాపారం చేసుకునేవారికి కూడా లోన్ ఇస్తారు.

* సిట్ర‌స్ యాప్‌పై లేజీ పే ద్వారా ఈ లోన్‌కు అప్ల‌యి చేసుకోవ‌చ్చు. 

*  లోన్‌కు అప్ల‌యి చేసిన వ్య‌క్తి దాన్ని తిరిగి చెల్లించ‌గ‌ల‌రా లేదా అనేది రిల‌య‌న్స్ మ‌నీ త‌నకున్న స్టాఫ్‌, టెక్నాల‌జీ ద్వారా తెలుసుకుని రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని బ‌ట్టి లోన్ ఇష్యూ చేస్తారు.

* 100 రూపాయ‌ల‌ నుంచి ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు లోన్ తీసుకోవ‌చ్చు. 

* 15 రోజుల నుంచి 24 నెల‌ల లోపు తిరిగి చెల్లించ‌వ‌చ్చు. 

10 న‌గ‌రాల్లో ప్రారంభం
ప్ర‌స్తుతానికి అహ్మ‌దాబాద్‌, జైపూర్‌,  హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, చండీగ‌డ్‌, ల‌క్నోల‌తోపాటు ఇండియాలోని టాప్ టెన్ న‌గ‌రాల్లో ఈ స‌ర్వీసును ప్రారంభిస్తున్నారు.  ఈ సంవ‌త్స‌రం పూర్త‌య్యేస‌రికి మ‌రో 110 ప్రాంతాల‌కు స‌ర్వీస్‌ను విస్త‌రించాల‌నేది ప్ర‌ణాళిక‌.  
 

జన రంజకమైన వార్తలు