• తాజా వార్తలు

పేటీఎం యూజర్లకు శుభవార్త, ఇకపై ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చు 

ప్రముఖ డిజిటల్ వాలెట్ యాప్ పేటీఎం తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పేటీఎం ఈకామర్స్ పేమెంట్ సిస్టమ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీ ట్రాన్స్ జెక్షన్ ఫీజులు ఎత్తేసింది. అందులో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్లపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలను విధించడం లేదని ఆ సంస్థ తెలిపింది. పేటీఎంలో క్రెడిట్ కార్డు పేమెంట్లపై 1 శాతం, డెబిట్ కార్డులపై 0.9 శాతం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్‌పై రూ.12 నుంచి రూ.15 వరకు ట్రాన్సాక్షన్ చార్జీలు ఉంటాయని గత రెండు, మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో పేటీఎం స్పందించి పై ప్రకటన చేసింది.

ఈ మేరకు పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఒక ప్రకటనను విడుదల చేసింది. కస్టమర్లు ఎలాంటి అదనపు చార్జిలు లేకుండానే ఆయా మాధ్యమాల్లో చెల్లింపులు చేసుకోవచ్చని పేటీఎం తెలిపింది. పేటీఎంను గతంలోలాగే ఎలాంటి చార్జీలు లేకుండా వాడుకోవచ్చని ఆ సంస్థ చెప్పుకొచ్చింది. అలాగే భవిష్యత్తులోనూ ఆయా లావాదేవీలపై ఎలాంటి చార్జీలను విధించబోమని పేటీఎం స్పష్టం చేసింది.

పేటీఎంలో కస్టమర్లు ఛార్జీల రూపంలో కోల్పోయే సొమ్మును తిరిగి పొందేందుకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)విధానాన్ని అమలు చేయనున్నట్టు నివేదికలు తెలిపాయి. సాధారణంగా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన యూజర్లకు 1శాతం ఛార్జ్ చేస్తుంటే.. డెబిట్ కార్డు ద్వారా (0.9శాతం) వరకు ఛార్జ్ చేస్తోంది. నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా పేమెంట్ చేసిన లావాదేవీలపై రూ.12 నుంచి రూ.15వరకు ఛార్జ్ చేస్తోంది.

పేటీఎం యూజర్లు.. మర్చంట్ UPI చెల్లింపులకు డెబిట్ కార్డులు వాడుకోవచ్చు. లేదా.. ఇతర Utility సర్వీసు ప్రొవైడర్ల సర్వీసును (క్రెడిట్ కార్డు ఛార్జీలు లేకుండా) కస్టమర్లు వినియోగించుకోవచ్చునని  పేటీఎం, సాఫ్ట్ బ్యాంకు, అలీబాబా గ్రూపు సూచించింది. 

2018 ఏడాదిలో డిజిటల్ ట్రాన్స్ జెక్షన్స్ ఎక్కువ మొత్తంలో వినియోగించుకునేలా  ప్రోత్సహించేందుకు ప్రభుత్వం MDR ఛార్జీలను ఎత్తివేసింది. డెబిట్ కార్డులు, BHIM, UPI, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్స్ ద్వారా రూ.2వేలు వరకు లావాదేవీలు జరిపిన  వినియోగదారులకు MDR విధానం వర్తించేలా తీసుకొచ్చింది.

జన రంజకమైన వార్తలు