ఫోన్‌పే యాప్ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో చాలామందికి తెలిసిందే. డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌లో పేటీఎం తర్వాత బాగా పాపులర్ అయిన యాప్ ఫోన్‌పే. ఇప్పుడు కరోనాకు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తామంటూ ముందుకొచ్చింది. ఏంటా కరోనా ఇన్సూరెన్స్, ఎలా తీసుకోవాలి? ఉపయోగాలేంటో ఓ లుక్కేద్దాం
156 రూపాయలతో పాలసీ
కరోనా వైరస్ ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తోంది. దాని లక్షణాలు కనపడితే చాలు అందరూ వణికిపోతున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించి వైద్యం అందజేస్తోంది. నయమయ్యే వరకూ ఉంచి ఇంటికి పంపిస్తోంది. అయితే ఇలాంటి సమయంలో కరోనాకు పనికొచ్చేలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు హాస్పిటల్స్‌లోనూ ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు.
* ఇందుకోసం ఫోన్‌పే.. బజాజ్ అలియంజ్‌తో కలిసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చింది.
* 156 రూపాయలు కడితే ఒక వ్యక్తికి 50 వేల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుంది.
* ఈ పాలసీ కేవలం కరోనా సోకితేనే వర్తిస్తుంది.
* పాలసీ కాలవ్యవధి ఏడాది ఉంటుంది.
* హాస్పిటల్‌లో చేరడానికి నెల ముందు, నెల తర్వాత టెస్ట్‌లు, ట్రీట్‌మెంట్ కూడా ఇన్సూరెన్స్‌లో భాగంగా క్లెయిమ్ చేసుకోవచ్చు.
* పాలసీ తీసుకున్నాక 15 రోజుల తర్వాతే పాలసీ ఫోర్స్‌లోకి వస్తుంది.
ఎలా తీసుకోవాలి?
* ముందుగా మీ ఫోన్‌పే అప్‌డేట్ చేసుకోండి. ఆల్రెడీ అప్‌డేట్ అయి ఉంటే ఓకే
* యాప్ ఓపెన్ చేసి కింద భాగంలో ఉన్న మై మనీని క్లిక్ చేయండి.
* తర్వాత పేజీలో ఇన్సూరెన్స్ అనే సెక్షన్ కింద కరోనా వైరస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
* దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చే పేజీలో కింద గెట్ ది పాలసీ అనే ఉంటుంది. దాన్నిటాప్ చేయండి.
* టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే చేసి పే నొక్కండి.
* తర్వాత పేజీలో పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. సెలెక్ట్ చేసుకుని 156 రూపాయలు చెల్లిస్తే మీ ఫోన్‌పే కరోనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం పూర్తయినట్లే.