• తాజా వార్తలు

రెడ్ మీ ఫ్యాన్ ఫెస్టివల్ కు రెడీ..


జియామీ అకా రెడ్ మీ ఏటా ఈ ఏడాది కూడా ఫ్యాన్ ఫెస్టివల్ పేరుతో ఆఫర్లతో వస్తోంది. mi.com లో రెడ్ మీ ఫోన్లు, పలు యాక్సెసరీస్ ను తక్కువ ధరలకు విక్రయించేందుకు సిద్ధం చేస్తోంది. దీంతో పాటు రెడ్ మీ యాప్ లో ప్రత్యేకంగా భారీ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.1కే ఫ్లాష్ సేల్ పెట్టనుంది.
రూ.1 ఫ్లాష్ సేల్ లో రెడ్ మీ నోట్-4 విక్రయానికి ఉంచుతున్నారు. దీనికోసం యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6న ఉదయం 10 గంటలకు ఇండియాలో ఈ సేల్ మొదలవుతుంది. అయితే, కేవలం 20 ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటలకు రెడ్ మీ బాండ్-2, 1,000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న పవర్ బ్యాంకులు 50 అందుబాటులో ఉంచనున్నారు. దీంతో పాటు రెడ్ మీ 4ఏ రోజ్ గోల్డ్ వేరియంట్ రూ.5,999 ధరకు... రెడ్ మీ నోట్ 4 మొబైల్స్ రూ.9,999 ధరకు విక్రయించనున్నారు.
రెడ్ మీ నోట్ 4 ఇప్పటికే ఇండియాలో విశేష ఆదరణ పొందింది. ఈ మోడల్ మొబైల్స్ ఇప్పటికే 10 లక్షలకు పైగా విక్రయమయ్యాయి. ఇప్పటివరకు ఆఫ్ లైన్లో విక్రయించిన దీన్ని ఏప్రిల్ 6 నుంచి ఆన్ లైన్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం మార్చి 31 నుంచి ఆర్డర్లు తీసుకుంటున్నారు.
కాగా ఎంఐ మ్యాక్స్ ప్రైమ్ ను 0 పర్సంట్ ఈఎంఐ సదుపాయంతోనూ విక్రయిస్తోంది. మొత్తానికి ఇండియాలో హాట్ సెల్లింగ్ బ్రాండ్ అయిన రెడ్ మీ ఇప్పుడు ఫ్యాన్ ఫెస్టివల్ పేరుతో అభిమానులకు మరింత దగ్గరైపోతోంది.

జన రంజకమైన వార్తలు