ఇప్పటికే ధరల విషయం లో పోటా పోటీగా ఉన్న ఇండియా కు చెందిన రిలయన్స్ జియో మరియు చైనా కు చెందిన లి ఎకో కంపెనీ లు తమ మధ్య పోటీని స్మార్ట్ ఫోన్ లనుండి టివి లకు మళ్ళించాయి. టివి ల ధర లలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు రావడం ద్వారా ఇప్పటికే ఈ రంగం లో అగ్రగాములుగా ఉన్న సామ్ సంగ్ , ఎల్ జి, మరియు సోనీ లకు గట్టి పోటీని ఇవ్వనున్నాయి. 4 జి LTE స్మార్ట్ ఫోన్ ల ద్వారా తన ఉనికిని బలంగా చాటుతున్న రిలయన్స్ జియో వివిధ రకాల స్క్రీన్ సైజు లలో లబ్యమయ్యే రీతిలో LYF బ్రాండ్ క్రింద LED TV లను అందించబోతోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ టివి లను మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్ లకు, ఈ కామర్స్ ల లోనూ, అందుబాటులోనికి తీసుకు రానున్నారు. మరొక ప్రక్క లి ఎకో కూడా వచ్చే నెల లోనే తన బ్రాండ్ టివి ని లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఈ సంస్థ ఎంత తక్కువ ధరకు ఈ టివి లను తీసుకు వస్తుందంటే ఆ ధర వలన కంపెనీ కి కనీస లాభాలు కూడా రావు. అయినప్పటికీ ఈ సంస్థ టీవీ లను అందిస్తుందంటే పోటీ ఏ స్థాయి లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ ఇప్పుడు మొత్తం మూడు సైజు లలో టీవీ లను అందిస్తుంది. అవి 43 అంగుళాలు, 50 అంగుళాలు, 65 అంగుళాలు సైజుల లో రిలయన్స్ టీవీ లు లభిస్తాయి.ఇవి హై డెఫినిషన్ 4 కే స్క్రీన్ లను కలిగి ఉంటాయి. అంతేగాక ఈ స్క్రీన్ లు హై స్పీడ్ 4 జి ఇంటర్ నెట్ సర్వీస్ లను అందుకునే విధంగా ఉంటాయి. ప్రస్తుతానికి ఇవి రిలయన్స్ డిజిటల్ స్టోర్ ల లోనూ మరియు ఉద్యోగుల కు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ విధమైన పోటీకి ప్రధాన కారణం 4 జి సర్వీస్ లను వేగం గా వినియోగదారులకు చేరవేయడం లో స్మార్ట్ ఫోన్ ల కంటే టీవీ లే ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్ ల తర్వాత రిలయన్స్ తమ దృష్టిని టీవీ లపై కేంద్రీకరించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ప్రముఖ బ్రాండ్ లన్నీ ధర లు తగ్గించడం లో కుతూహలం గా ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాలు, ఫీచర్ లూ, క్వాలిటీ తదితర విషయాలను దృష్టి లో ఉంచుకుని ధర తగ్గించడం లేదు. కానీ రిలయన్స్ మాత్రం ఎ మాత్రం రాజీ పడకుండా తక్కువ ధర తో పాటు నాణ్యతను కూడా అందించనున్నట్లు రిలయన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కానీ ధర ఎంతనేది మాత్రం గోప్యం గా ఉంచుతున్నారు. చూద్దాం పోటీ మంచిదే కదా ! |