• తాజా వార్తలు

మొబైల్‌ బ్యాంకింగ్‌లో కింగ్ ఎస్బీఐ

దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల్లో అగ్రస్థానంలో నిలిచింది. 2015 డిసెంబర్‌లో విలువ ఆధారితంగా 38.44 శాతం వాటాతో ఎస్‌బిఐ తొలి స్థానంలో ఉందని రిజర్వు బ్యాంకు నివేదికలో వెల్లడైంది. మార్కెట్‌ వాటా పరంగా 35.97 శాతం కలిగి ఉంది. క్రితం డిసెంబర్‌లో ఈ సంస్థలోరూ.17,636 కోట్ల విలువ చేసే 151.83 లక్షల మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిగాయి. 70.01 లక్షల లావాదేవీలతో ఐసిసిఐసిఐ బ్యాంకు రెండో స్థానంలో నిలిచింది. 60.28 లక్షల లావాదేవీలతో యాక్సిస్‌ బ్యాంకు, 39.13 లక్షల లావాదేవీలతో హెచ్‌డిఎఫ్‌సి తరువాత స్థానాల్లో ఉన్నాయి.

కాగా నేరుగా బ్యాంకుల శాఖలకు వెళ్లి లావాదేవీలు నిర్వహించడం చాలావరకు తగ్గిపోతుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుంటుండడంతో బ్యాంకులకు, కష్టమర్లకు కూడా సమయం ఎంతో ఆదా అవుతోందని కోటక్ మహీంద్రా బ్యాంకు డిజిటల్ బ్యాంకింగ్ హెడ్ దీపక్ శర్మ చెబుతున్నారు. మొత్తం మొబైల్ బ్యాంకింగు రంగంలో కోటక్ వాటా 4.5 శాతం ఉండగా... ఆ బ్యాంకు కస్టమర్లలో 35 శాతానికి పైగా మొబైల్ బ్యాంకింగ్ తోనే తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని చెబుతున్నారు.

నిజానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోనే ఎంతో మార్పు రాగా మొబైల్ బ్యాంకింగ్ విస్తృతమయ్యాక మరింత ఈజీగా మారిపోయింది. మొదట్లో అనేక అపోహలు ఉన్నప్పటికీ క్రమేపీ వినియోగదారుల్లో ఉన్న భయాలు పటాపంచలయ్యాయి. మరోవైపు బ్యాంకుల వైపు నుంచి ట్రాంజాక్షన్లకు రక్షణ చర్యలు తీసుకుంటుండగా వినియోగదారులు కూడా జాగ్రత్తలు పాటిస్తూ మోసాలకు గురికాకుండా ఈజీగా లావాదేవీలు జరుపుతున్నారు. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ కంటే మొబైల్ బ్యాంకింగ్ పరిధి విస్తరించింది. ఆరు నెలల కిందటే మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ను మించిపోయిందట.

జన రంజకమైన వార్తలు