• తాజా వార్తలు

స్టేట్‌బ్యాంక్‌లో నెట్‌ బ్యాంకింగ్‌ వాడటం ఎలా..!

ప్రస్తుతం అన్ని వ్యవస్థలు దాదాపు అన్‌లైన్‌ మయం అయిన తరుణంలో బ్యాంక్‌సేవలు కూడా సులభతరం చేస్తూ చాలాకాలంగా ఇంటిలో కూర్చునే తమ కార్యకలాపాలు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. దీనితో బ్యాంక్‌లో చాంతాడంత లైన్‌లో నిలుచుని సమయం వృధా చేసుకోకుండా ఎంచక్కా మొబైల్‌ లేదా పీసీ నుంచి బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చు. బ్యాంకింగ్‌ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చాలా మందికి అకౌంట్‌లు ఉంటాయి... కానీ ఇప్పటికి చాలామంది డబ్బు ట్యాన్స్‌ఫర్‌ ఇతర వాటికి బ్యాంకుకు వెలుతూ ఉంటారు. సాధారణ వ్యక్తులు అంటే తెలియక వెలుతున్నారు అనుకోవచ్చు.. బాగా చదువుకున్న వారు సైతం ఇప్పటికి లావాదేవీల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. నెల్‌బ్యాంకింగ్‌తో సులభతరంగా తమ లావాదేవీలను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒకసారి బ్యాంకుకు వెళ్లి నెట్‌బ్యాంకింగ్‌ ఫారం పూర్తి చేసి వారిచ్చే కిట్‌ తెచ్చుకుని దానిని యాక్టివేట్‌ చేసుకోవడమే.

నెట్‌బ్యాంకిగ్‌ యాక్టివేట్‌ చేసుకోవడం ఎలా..!

చాలామంది బ్యాంకుకు వెళ్లి కిట్‌ తెచ్చుకుంటారు కానీ... దానిని ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు నేను చెప్పే సులభ పద్దతుల ద్వారా చాలా ఈజీగా నెట్‌బ్యాంకింగ్‌ని యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

1) బ్యాంకు వారు ఇచ్చిన కిట్‌ను జాగ్రత్తగా ఉంచుకుని... నెట్‌బ్రౌజ్‌లో గూగుల్‌ ఓపెన్‌ చేసి ''అన్‌లైన్‌ ఎస్‌బిఐ' అని టైపు చేసి ఎంటర్‌ నొక్కాలి. అందులో పర్శనల్‌ బ్యాంకింగ్‌ని సెలక్ట్‌ చేసుకుంటే లాగిన్‌ అనే ఆప్శన్‌ వస్తుంది. దానిని క్లిక్‌ చేయాలి. ఆ తరువాత కంటిన్యూ టూ లాగిన్‌ ఆప్శన్‌ వస్తుంది. దానికి క్లిక్‌ చేయగానే ఇది వరకు మీరు లాగిన్‌ అయిన వారు అయితే నేనుగా యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వవచ్చు. కొత్త వారు అయితే వాటి పక్కనే య్యూ యూజర్‌, రిజిస్టేషన్‌ హేర్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. అక్కడ ఓపెన్‌ అయిన బాక్స్‌లో వారు అడిగిన వివరాలు ఎంటర్‌ చేసి సబ్‌మీట్‌ క్లిక్‌ చేయాలి. సీఐఎఫ్‌ నెంబర్‌ బ్యాంకు వారు ఇచ్చిన కిట్‌లో ఉంటుంది. అకౌంట్‌ నెంబర్‌, బ్యాంక్‌ కోడ్‌ తదితర వివరాలు పాస్‌ బుక్‌ మీద ఉంటాయి వాటిని పూర్తి చేయాలి.

2) వివరాలు నింపి సబ్‌మీట్‌ క్లిక్‌ చేయగానే మొదట యూసర్‌ నేమ్‌, న్యూ పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోమని అడుగుతుంది. వాటిలో యూజర్‌నేమ్‌కి మీకిష్టం వచ్చిన వాటిని పెట్టుకోవచ్చు.. కానీ పాస్‌వర్డ్‌కి మాత్రం ఖచ్చితంగా న్యూమరిక్‌, అంకెలతో పాటు మీకు గుర్తు ఉండే విధంగా కొన్ని అక్షరాలను కూడా కలిపి పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అది పూర్తి అయిన తరువాత మళ్లీ ప్రోపైల్‌ పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసుకోమని అడుగుతుంది. అసలు ఇది దేనికి అంటారా..? మీరు కొత్తగా ఎవరిదైనా అకౌంట్‌ యాడ్‌ చేసుకోవాలి అంటే ఈ పాస్‌వర్డ్‌ తప్పనిసరిగి ఉండాలి. ఎవరికైనా యూసర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ తెలిసినా డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రోఫైల్‌ పాస్‌వర్డ్‌ తెలిసి ఉండాలి. ప్రోఫైల్‌ పాస్‌ వర్డ్‌ని క్రియేట్‌ చేసుకోవడానికి కూడా తప్పనిసరిగా న్యూమరిక్‌, అంకెలతో పాటు మీకు గుర్తు ఉండే విధంగా కొన్ని అక్షరాలను కూడా కలిపి పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. లాగిన్‌ పాస్‌వర్డ్‌ అయితే ప్రతి 90రోజులకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవలసి ఉంటుంది. కానీ ప్రోపైల్‌ పాస్‌వర్డ్‌ మాత్రం లైప్‌టైమ్‌ అలాగే ఉంచుకోవచ్చు. దీనిని ఎప్పుడో కానీ మనం వాడం కాబట్టి కాస్తా గుర్తు ఉండే విధంగా పాస్‌వర్డ్‌ని క్రియేట్‌ చేసుకోవడం ఉత్తమం. వీలైతే దానిని భధ్రంగా ఎక్కడైనా రాసి పెట్టుకోవడం మంచిది.

3)  ఇలా రెండింటిని క్రియేట్‌ చేసుకున్న తరువాత... ఏ బ్యాంకు అకౌంట్‌కైనా సరే మీరు డబ్బును పంపవచ్చు. కాకపోతే సదరు బ్యాంకు వివరాలును ముందుగా మీరు మీ అకౌంట్‌లో సేవ్‌ చేసుకోవాలి.

అకౌంట్‌ను సేవ్‌ చేసుకోవడం ఎలాగో తెలుసుకుందా..!

ముందుగా మీరు నెట్‌బ్యాంకింగ్‌లోకి లాగిన్‌ అయ్యాక... వరుసగా ఉన్న బార్‌లో కొన్ని ఆప్శన్స్‌ కనిపిస్తాయి. వటిలో మొదట అకౌంట్‌ తరువాత పేమేంట్‌,ట్యాన్స్‌ఫర్‌ ఇలా ఉంటాయి. వాటిలో ప్రోపైల్‌ అనే ఆప్శన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. తరువాత చాలా ఆప్శన్స్‌ వస్తాయి. వాటిలో మేనేజ్‌ బేనిఫిషరీ అనే ఆప్శన్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. తరువాత ప్రోఫైల్‌ పాస్‌వర్డ్‌ని ఎంటర్‌ చేయాలి. కేవలం కొత్త అకౌంట్‌ నంబర్‌ని యాడ్‌ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రోఫైల్‌ పాస్‌వర్డ్‌ ఉపయోపడుతుంది.

ప్రోఫైల్‌ పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసిన ఒక బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. దానిలో ఇన్‌ట్రా బ్యాంక్‌(దీనిలో కేవలం సేమ్‌బ్రాంచ్‌ అకౌంట్‌ని సేవ్‌ చేసుకోవాలి), ఇంటర్‌ బ్యాంక్‌(దీనిలో ఇతర బ్యాంక్‌ వివరాలను సేవ్‌ చేసుకోవాలి) మిగతావి ప్రస్తుతానికి అవసరం లేదు. బ్యాంకును బట్టి సెలక్ట్‌ చేసుకుని వివరాలు ఎంటర్‌ చేయాలి. ఇతర బ్యాంకులను సేవ్‌ చేయాలి అంటే ఖచ్చితంగా సదరు బ్యాంక్‌ యొక్క కోడ్‌ తెలిసి ఉండాలి. ఒకవేల లేకపోతే దానిని గూగుల్‌లో తెలుసుకోవచ్చు. సదరు బ్రాంచ్‌ ఉన్న ప్రదేశాన్ని ఎంటర్‌ చేస్తే వివరాలు తెలుస్తాయి. వీటిని నింపిన తరువాత కండీషన్స్‌ బాక్స్‌లో టిక్‌మార్క్‌ని సెలక్ట్‌ చేసుకుని సబ్‌మీట్‌ చేయాలి. తరువాత అకౌంట్‌ నంబర్‌, సదరు వ్యక్తి పేరు వంటి వివరాలు వస్తాయి. పేరు పక్కన చిన్న సున్నాలాగా ఉంటుంది. దానిలో టిక్‌మార్క్‌ చేస్తే దాని కింద ఒక చిన్న బాక్స్‌ ఓపేన్‌ అవుతుంది. ఇప్పుడు మీ రిజిస్టర్‌ మొబైల్‌కి ఒక పాస్‌వర్డ్‌ వస్తుంది. దానిని ఎంటర్‌ చేసి అప్రూవ్‌ చేయాలి. తరువాత ఓకేనా నొక్కితే మీరు ఎంటర్‌ చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయని గుర్తించినట్లు లెక్క.

ఇలా అకౌంట్‌ నంబర్‌ సేవ్‌ చేసుకున్న తరువాత బ్యాంక్‌ అప్రూవ్‌ చేయడానికి 4గంటల సమయం పడుతుంది. ఒకరోజులో కేవలం ఒక అకౌంట్‌ నంబర్‌ మాత్రమే సేవ్‌ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అకౌంట్‌ అప్రూవ్‌ అయిన తరువాత మీరు తిరిగి లాగిన్‌ అయ్యి ఇప్పుడు పేమెంట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌ అప్శన్‌లోకి వెళ్లి డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. బ్యాంకు నియమాలను బట్టి సేమ్‌బ్రాంచ్‌ అయితే  24గంటలు ఎప్పుడైనా డబ్బు పంపుకోవచ్చు. ఇతర బ్యాంకులకు డబ్బును పంపాలి అంటే దాని కిందనే సమయం గురించిన వివరాలు ఉంటాయి. ఒకవేల సమయం మించిపోయినా, ఆ రోజు బ్యాంకుకు సెలవు ఉన్నా మరుసటిరోజు డబ్బు వారి అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుంది.

మొబైల్‌ యాప్‌ సేవలు కూడా సులభతరం..!

ప్రతిఒక్కరికి ఆండ్రాయిడ్‌ మొబైల్‌లు వచ్చిన తరువాత అరచేతలో అన్ని జరిగిపోతున్నాయి. బ్యాంకు సేవలు కూడా చాలా సులభంగా మొబైల్‌లో ఉపయోగించుకోవచ్చు. స్టేట్‌బ్యాంక్‌ ఎనీవేర్‌ అని ప్లేస్టోర్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకుని వాటి సేవల్ని మీరు పొందవచ్చు. లేదా బ్యాంకుకు వెళ్లి మొబైల్‌ బ్యాంకింగ్‌ రిజిస్టర్‌ చేసుకుంటే వారు ఇచ్చే యాప్‌ సహయంతో నెట్‌ బ్యాంకింగ్‌ లేకున్నా కేవలం మొబైల్‌ యాప్‌ సహాయంతో బ్యాంకు సేవల్ని పొందవచ్చు. అంతేకాకుండా అకౌంట్‌ని యాక్టివేట్‌ చేసుకోవడం సులభంతో పాటు... వెంటనే యాక్టివేట్‌ అయ్యి, ఆ వెంటనే ఇతరులకు డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. కాకపోతే దీనికోసం తప్పని సరిగా మొదటిసారి మీ మొబైల్‌తో పాటు బ్యాంకుకు వెళ్లవలసి ఉంటుంది.

ఇలా క్రియేట్‌ చేసుకున్న తరువాత మీరు అనేక రకాల సేవలను నెట్‌ బ్యాంకిగ్‌ సహాయంతో పొందగలుగుతారు. అంతేకాకుండా ప్రస్తుతం మొబైల్‌, ఫవర్‌, డిటిహెచ్‌ ఇలా అనేక రకాల వాటికి డబ్బును నేరుగా అన్‌లైన్‌లోనే చెల్లింపులు జరపవచ్చు. మీరు ఎక్కడికి వెళ్లకుండానే హాయిగా ఇంటిలో కూర్చుని ఈ సేవలు అన్ని వినియోగించుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు