స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ‘SBI Buddy’ మొబైల్ సేవలను నిలిపివేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2FY19)లో ప్రారంభమైన ఖాతాలలో 38 శాతం ‘‘YONO’’ (You Only Need One) పేరిట తాము ప్రవేశపెట్టిన యాప్ ద్వారానే మొదలైనట్లు తెలిపింది. ఆ మేరకు రోజుకు 20వేల ఖాతాల వంతున నమోదవగా, సెప్టెంబరు 27వ తేదీన అత్యధికంగా 31వేలు ప్రారంభమైనట్లు పేర్కొంది. ఇప్పటితో పోలిస్తే సుమారు రెండేళ్ల కిందట రోజుకు 10వేలకన్నా తక్కువ ఖాతాలే ప్రారంభమయ్యేవని వివరించింది. ఇక ప్రస్తుత YONO కొత్త ఖాతాదారులలో 61 శాతందాకా 18 నుంచి 30 ఏళ్లలోపు వారే కావడం విశేషం. YONO యాప్ సాయంతో డిజిటల్‌గానే కాకుండా తక్షణ ఖాతాలను కూడా తెరిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా SBI తెలిపింది. అయితే, ఇంతకుముందు ప్రకటిస్తూ వచ్చిన తరహాలో YONO కింద నమోదైన వినియోగదారులు, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య, దీనికింద నమోదైన లావాదేవీల సంఖ్య లేదా దీనిద్వారా రోజుకు ఎందరు లాగిన్ అయ్యారన్న వివరాలు వంటివేవీ వెల్లడించలేదు. కాగా, ఓ రెండు త్రైమాసికాల కిందట రోజువారీ లావాదేవీలకు సంబంధించి YONOతో పోలిస్తే SBI Buddy వాలెట్‌తోనే ఎక్కువగా నమోదైంది. కాగా, YONO యాప్ ఇప్పుడు ‘‘ఫైనాన్షియల్ సూపర్ స్టోర్’’గానూ ఉపయోగపడుతోంది. ఇందులో ఇప్పుడు ఎస్‌బీఐ ఉత్పత్తులైన SBI Life, SBI Cards, SBI Cam Sec, SBI General Insurance వంటివి అందుబాటులోకి వచ్చాయి. తదనుగుణంగా YONO వేదికపై తాము 60వేల మందికిపైగా ఖాతాదారులకు రూ.500 కోట్లకుపైగా వ్యక్తిగత రుణాలను ముందస్తు మంజూరు చేసినట్లు SBI తెలిపింది.
ప్రత్యామ్నాయ మార్గాలు
బ్యాంకు శాఖలలో నేరుగా కాకుండా ‘‘ప్రత్యామ్నాయ మార్గాల్లో’’ నమోదైన లావాదేవీల వాటా ఈ ఏడాది సెప్టెంబరు 17న 78.45 శాతం కాగా, ఆ నెలాఖరునాటికి 83.47 శాతానికి పెరిగినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఆయా ప్రత్యామ్నాయ మార్గాలవారీగా చూస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ 18.1 శాతం (ఏడాది కిందటితో పోలిస్తే 22 శాతం నుంచి తగ్గుదల); పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ 12.6 శాతం, ఈ-కామర్స్ వేదికలు 12.1 శాతం; మొబైల్ బ్యాంకింగ్ 15.5 శాతం (5.3 శాతం నుంచి పెంపుదల); ఏటీఎం/సీడీఎం 32 శాతం (36.6 శాతం నుంచి తగ్గుదల); బ్యాం కింగ్ కరెస్పాండెంట్ల ద్వారా 3.4 శాతం (5.3 శాతం నుంచి తగ్గుదల); యూపీఐ, YONO ద్వారా 8.7 శాతం (ఏడాది కిందట 0.8 శాతం) లావాదేవీలు నమోదయ్యాయి.
ఆధార్ ఖాతాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని మొత్తం ఖాతాల్లో ఇప్పటివరకూ ఆధార్‌తో సంధానమైనవి 55.07 శాతం మాత్రమే. అంటే... మొత్తం 138 మిలియన్ ఖాతాలకుగాను 76 మిలియన్ల ఖాతాలన్న మాట. ఏడాది కిందట ఇది 72 మిలియన్ ఖాతాలకుగాను 13.2 మిలియన్ ఖాతాలు (54.55 శాతం)గా ఉండేది.
యూపీఐ ద్వారా...
ఏకీకృత చెల్లింపు సదుపాయం (UPI)లో భాగమైన ‘‘SBI Pay’’ యూపీఐ యాప్‌ను వాడుతున్న ఖాతాదారులు ఎందరన్నది మాత్రం స్టేట్ బ్యాంక్ ప్రకటించలేదు. అయితే, ఓ రెండు త్రైమాసికాల కిందట ఈ సంఖ్య 1.84 మిలియన్లుగా ఉండేది. మరోవైపు యూపీఐ కింద లావాదేవీలు, రిజిస్ట్రేషన్ల సంఖ్యను కూడా ఎస్‌బీఐ ప్రకటించని నేపథ్యంలో రెండు త్రైమాసికాల కిందట 0.11 మిలియన్ల లావాదేవీలు, నిత్యం సుమారు 44 వేలదాకా రిజిస్ట్రేషన్లు సాగేవి. కాగా, SBI Payద్వారా 7,99,000 చెల్లింపు ఆమోద టచ్‌పాయింట్లు ఉన్నాయని, నవంబరు 1న యూపీఐ వేదిక మీద 10 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేశామని ప్రకటించడం గమనార్హం.
వ్యాపారుల సమ్మతి
స్టేట్ బ్యాంకు వ్యాపార చెల్లింపుల సమ్మతి టచ్ పాయింట్లు 2.376 మిలియన్ల మేర ఉన్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ జాబితాలో 1,26,000 మంది BHIM; 3,24,533 మంది భారత్ QR; 5,67,483 మంది BHIM-Aadhaar-SBI; 5,59,395 మంది SBI POS (ఇది తగ్గుతూ వస్తోంది); 7.99,000 మంది BHIM SBI Pay మార్గాలలో చెల్లింపులను సమ్ తిస్తున్నారు. అయితే, బ్యాంకింగ్ కరెస్పాండెంట్స్ పేరిట తాము నియమించిన 57,906 మంది ద్వారా సాగిన లావాదేవీల వివరాలపై స్టేట్ బ్యాంక్ ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.