భారత్‌లోని చిన్న వ్యాపారుల్లో ఎక్కువ శాతం మందికి సొంత వైబ్‌సైట్ అనేది లేదట. మారుతున్న మార్కెట్ ట్రెండులో వారంతా దానివల్ల నష్టపోతున్నారట. పెద్దపెద్ద స్టోర్లన్నీ ఆఫ్ లైన్ షాపింగ్ ఉన్నా సమాంతరంగా వెబ్ సైట్ కూడా మెంటైన్ చేస్తూ తమ వినియోగదారులు చేజారకుండా చూసుకుంటున్నాయి. కానీ, చిన్న వ్యాపారులు మాత్రం ఆ విషయంలో వెనకబడుతున్నారు. వెబ్ సైట్లు పెట్టుకోకపోవడం వల్ల ఆన్ లైన్ మార్కెట్ ను తట్టుకోలేక కుదేలవుతున్నారు. వెబ్ సైట్ ప్రొవైడింగ్ సంస్థ గోడాడి అధ్యయనం ప్రకారం... 40 శాతం మంది వెబ్‌సైట్‌ను సిద్ధం చేసుకునే స్థాయిలో తమ వ్యాపారం లేదని అనుకుంటూ వెనక్కు తగ్గుతున్నారట. 19 శాతం వెబ్‌సైట్‌ను తయారు చేయించుకోవడం కష్టమని అనుకుంటున్నారట. 17 శాతం మంది వెబ్‌సైట్‌ను తయారుచేయడం తమకు అత్యంత భారం అని పేర్కొన్నట్లు గోడాడీ రీసెర్చి నివేదిక వెల్లడించింది. 40శాతం మంది తమ కంపెనీ వెబ్‌సైట్ కలిగి ఉండేంత పెద్దది కాదని చెపుతున్నారు. అంతేకాదు తమ వద్ద అంత సాంకేతిక పరిజ్ఞానం లేదని అంటున్నారు. అందుబాటు ధరల్లో వీటిని పొందలేకపోతున్నట్లు 17శాతం మంది చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో తమ ఉనికిని కలిగి ఉంటే చాలని మరికొందరు చెపుతున్నారు. దేశంలో సుమారు 51 మిలియన్ల చిన్న మధ్యమ స్థాయి వ్యాపార సంస్థలు(ఎస్‌ఎంబి) పనిచేస్తున్నా యి. ఈ విషయంలో ప్రపంచంలోనే రెండోస్థానంలో భారత్ ఉంది. స్థూల జాతీయోత్పత్తికంటే 17శాతం ఎక్కువగా వీటి ఆదాయవనరులుంటాయి. కాగా చిన్న సంస్థల్లో ఇప్పటికే వెబ్‌సైట్లు ఉన్న వారు 63శాతం మంది ఈ వెబ్‌సైట్ల కారణంగా తమ వ్యాపారం అద్వితీ యంగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. మూడు రెట్లు ఎక్కువమంది తమ వ్యాపారం పదిశాతంకంటే ఎక్కువ ప్రగతిని సాధించిందన్నారు. చిన్నవ్యాపారాల వృద్ధికి ఇంటర్నెట్ అపరిమిత అవకాశాలు కల్పి స్తున్నదన్నారు. ఆఫ్ లైన్ వ్యాపారానికీ ఆన్‌లైన్ సపోర్టు ఉండాలని గోడాడీ భారత్ ఆస్ట్రేలియా ఉపాధ్య క్షుడు రాజీవ్‌సోథి చెబుతున్నారు.. అనేమంది భారతీయ వ్యాపారులు ఇప్పటికీ వెబ్‌సైట్లకు దూరంగానే ఉన్నా రని ఈ అధ్యయనం చెప్తోంది. వెబ్‌సైట్లను రూపొందించుకున్న వ్యాపారుల్లో 79శాతం మంది మూడు లేదా అంతకంటే తక్కువ సంవత్సరాల్లోనే ప్రయోజనం పొందారు. 72శాతం మంది వ్యాపారులు నాలుగైదేళ్లలో లాభాలు చవిచూసారు. మారుతున్న కాలంలో వ్యాపారానికి వెబ్ సైట్ తప్పనిసరని గోడాడీ చెప్తోంది. |