• తాజా వార్తలు

స్నాప్ డీల్ సంచలనం.. ఏదైనా 4 గంటల్లోనే డెలివరీ

ఈ-కామర్సు వ్యాపారంలో దూసుకుపోతున్న ‘స్నాప్ డీల్’లో కొనుగోలు చేసిన ఏ వస్తువైనా ఇకపై నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంటుంది. ఈ మేరకు  నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్ర వంశీ పేర్కొన్నారు. డెలివరీ టైమ్ ను గత ఏడాది కంటే 70 శాతం పెంచుకున్నామని, ఇప్పటివరకు సెల్ ఫోన్ల విక్రయానికే పరిమితమైన నాలుగు గంటల డెలివరీ సమయాన్ని మరిన్ని వస్తువులకు కూడా వర్తింపజేస్తున్నట్టు చెప్పారు. కాగా, దాదాపు ‘స్నాప్ డీల్’ వినియోగదారులు కొనుగోలు చేసే 99 శాతం ఉత్పత్తులను అదేరోజు డెలివరీ ఇస్తున్నామన్నారు. అయితే, ఇప్పుడు ఆయా ఉత్పత్తులను నాలుగు గంటల్లోనే అందించే ప్రణాళికలు చేస్తున్నామని చిత్ర వంశీ తెలిపారు.

ప్రస్తుతం అదేరోజు డెలివరీ చేయడం... తరువాత రోజు డెలివరీ చేయడంలో కొన్ని ఇబ్బందులున్నాయని... అన్నిటినీ పూర్తిగా అధిగమించి ఏ వస్తువునైనా నాలుగు గంటల్లో వినియోగదారుడికి చేర్చేలా నెట్ వర్కు అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డరు తీసుకున్న వస్తువుల రవాణాపై స్నాప్ డీల్ 2015లో పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. 2015లో స్నాప్ డీల్ ఇందుకోసం సుమారు 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.  మరోవైపు స్నాప్ డీల్ నెట్వర్కు కూడా గత ఏడాది కాలంలో దాదాపు అయిదు రెట్లు పెరిగిందట.

ఈ లెక్కన ఏ వస్తువైనా ఆర్డరు చేసిన నాలుగు గంటల్లోనే మన ఇంటిముందు వాలితే ఆఫ్ లైన్ మార్కెట్ కు జనం పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేస్తారేమో? ఎందుకంటే ఆన్ లైన్లో ఎన్ని సౌలభ్యాలున్నా ఒక్కోసారి అదేరోజు వస్తువు అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఆఫ్ లైన్లోనే కొంటున్నారు. ఇపై స్నాప్ డీల్ వంటి ఆన్ లైన్ సంస్థలు 4 గంట్లోల సరకు డెలివరీ ఇస్తే ఇంకేముంది. అర్జంటుగా కొనాల్సినవి కూడా ఆన్ లైన్లోనే కొనుక్కోవచ్చన్నమాట.

 

జన రంజకమైన వార్తలు