ప్రముఖ వాలెట్ కంపెనీ అయిన పే టిఎం అతి త్వరలోనే తన వాలెట్ ను పే టిఎం పేమెంట్ బ్యాంకులో విలీనం చేయనుంది. అవును ఇకపై పే టిఎం వాలెట్ కనుమరుగు కానుంది. ఇది దాని కార్యకలాపాలన్నీ పే టిఎం యొక్క పే మెంట్స్ బ్యాంకులో కలిపివేయనుంది. ఈ మేరకు RBI నుండి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి. RBI అనుమతి ఇచ్చిన వెంటనే పే టిఎం తన బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ పే టిఎం యొక్క మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ పే టిఎం యొక్క ఆన్ లైన్ పోర్టల్ పై ఇతర ఈ కామర్స్ యాక్టివిటీ లను ప్రారంభించనుంది. ఇందులో భాగం గా వాలెట్ సర్వీస్ పే టిఎం యొక్క భవిష్యత్ బ్యాంకింగ్ వ్యాపారంలో భాగంగా మారేందుకు పే టిఎం పే మెంట్స్ బ్యాంకింగ్ లో విలీనం కానుంది. కానీ ఇక్కడ పే టిఎం బ్యాంకు డివిజన్ యొక్క లైసెన్స్ వన్ 97 కమ్యూనికేషన్స్ దగ్గర కాకుండా పే టిఎం వ్యవస్థాపకుడు అయిన విజయ్ శేఖర్ దగ్గర ఉండడం విశేషం. దీనికి సంబంధించి ముందస్తు కార్యకలాపాలను పే టిఎం ఆగస్ట్ లోనే ప్రారంభించింది. ఇండియాలో అలీ బాబా గ్రూప్ యొక్క ఆపరేషన్ లకు ఆపరేటింగ్ బేస్ గా పే టిఎం ఉండనుంది అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి.
మీ పేటిఎం వాలెట్ లో ఉన్న బాలన్స్ పరిస్థితి ఏమిటి?
మనం పైన చెప్పుకున్నట్లు పే టిఎం వాలెట్ పే టిఎం బ్యాంకులు విలీనం అవుతుంది, కాబట్టి వాలెట్ యూజర్ ల పరిస్థితి ఏమిటి? అందులో ఉన్న వారి బాలన్స్ పరిస్థితి ఏమిటి? అనే సందేహాలు సహజo గానే అందరికీ వస్తాయి. అయితే పేటిఎం తన వినియోగదారులకు 15 రోజుల సమయం ఇస్తుంది. ఈ 15 రోజులలో పే టిఎం వినియోగదారులు తమ ఎకౌంటులలోనికి లాగ్ ఇన్ అయ్యి తమ వాలెట్ లో ఉన్న బాలన్స్ తమ తమ బ్యాంకు ఎకౌంటు లకు ట్రాన్స్ ఫర్ చేయవలసి ఉంటుంది. డిసెంబర్ 21 లోపు వినియోగదారులు ఈ పని పూర్తి చేయవలసి ఉంటుంది. లేకపోతే వీరి ఎకౌంటులో ఉన్న బాలన్స్ పే టిఎం యొక్క ఒక ప్రత్యేక ఎకౌంటు లోనికి ట్రాన్స్ ఫర్ అవుతుంది, దానిపై పే టిఎం ఒక నిర్ణయం వెలువరించే వరకూ ఏమీ చేయడానికి వీలు లేదు.
అయితే గత ఆరు నెలల నుండీ తమ పే టిఎం అకౌంట్ ను అసలు వాడకుండా జీరో బాలన్స్ తో ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదు. అలాంటి వినియోగదారులు తమ పే టిఎం ఎకౌంటు లలోనికి లాగ్ ఇన్ అయ్యి తమ అనుమతిని ఈ మెయిల్ ద్వారా పే టిఎం కు తెలియపరచవలసి ఉంటుంది.
పే టిఎం లైసెన్స్
RBI విధివిధానాల ప్రకారం పే టిఎం తన వాలెట్ వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించిన పే మెంట్స్ బ్యాంకు లో విలీనం చేయాలి అంటే కొన్ని తప్పనిసరి అనుమతులను పొందవలసి ఉంటుంది. పే టిఎం వీటిని పొందే క్రమం లో చివరి దశలో ఉంది. ఒక్కసారి అనుమతులు లభించిన వెంటనే పే టిఎం బ్యాంకు తన కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. అయితే ఆలీబాబా తో కలిసి పనిచేసే విషయం గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు, కేవలం ఊహాగానాలే అని కంపెనీ వర్గాలు కొట్టి పారేస్తున్నాయి. అయితే ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే ఆలీబాబా యొక్క డిజిటల్ వాలెట్ అయిన అలీ పే పే టిఎం తో టెక్నాలజీ పరంగా సహాయాన్ని పొందుతూ ఉంది. మరియు దాని ఉప సంస్థ అయిన ant ఫైనాన్షియల్ వన్ 97 కమ్యూనికేషన్ లలో 40 శాతం వాటాను కలిగిఉండి. వన్ కమ్యూనికేషన్ సంస్థ లో ఆలీబాబా సుమారు $ 680 మిలయన్ లను పెట్టుబడులు పెట్టి ఉండడం విశేషం.
"
"