తొలి డిజిటల్ లోన్ అందిస్తున్న ఫెడరల్ బ్యాంకు మీకు బ్యాంకులో లోన్ కావాలంటే ఇక మీరు బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు, సంతకం చేయాల్సిన అవసరం లేదు, ఏవిధమైన డాక్యుమెంట్ లూ సమర్పించవలసిన అవసరం లేదు. కేరళకు చెందిన ప్రైవేటు బ్యాంకు అయిన ఫెడరల్ బ్యాంకు లోన్ మంజూరు లో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ పర్సనల్ లోన్ లను లాంచ్ చేయడం ద్వారా లోన్ ఇవ్వడంలో సమూల మార్పులకు నాంది పలికింది. చికాకు పరిచే పేపర్ వర్క్ కు అతీతంగా వినియోగదారులు అప్లై చేసిన నిమిషాల్లోనే లోన్ ను పొందవచ్చు అని తెలిపింది. లోన్ కావాలి అనుకున్న వినియోగదారులు ఫెడరల్ బ్యాంకు యొక్క వెబ్ సైట్ కు లాగ్ఇన్ అయ్యి నిమిషాల వ్యవధిలోనే లోన్ ను పొందవచ్చు. వినియోగదారుని అంగీకారం తర్వాత లోన్ అతని ఎకౌంటుకు ట్రాన్స్ ఫర్ చేయబడుతుంది. దీనికి బ్యాంకుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, సంతకం చేయాల్సిన అవసరం లేదు, ఈ సేవలు నిరంతరం అంటే 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇంతకుముందే ఈ బ్యాంకు BYOM పేరుతొ డిజిటల్ రిటైల్ లోన్ లను అందించింది. అవి డిజిటల్ కార్ లోన్ లూ, టర్మ్ డిపాజిట్ కి సంబందించిన లోన్ లూ. ఈ BYOM సిరీస్ లో ఈ డిజిటల్ పర్సనల్ లోన్ లను మూడవదిగా చెప్పుకోవచ్చు. మొదటి విడతలో పాన్ ఇండియాచే గుర్తింపు పొందిన ఎంపిక చేయబడిన కస్టమర్ లకు మాత్రమే ఇది అందుబాటులో ఉండనుంది. ఇది మొబైల్ మరియ ATM ఫ్లాట్ ఫాం లన్నింటిలో అందుబాటులోనికి వచ్చాక మిగతా అందరు కస్టమర్ లకూ అందుబాటులోనికి తీసుకురానున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చానల్ ల ద్వారా బ్యాంకు 75 శాతం వృద్ది రేట్ ను సాధించింది. ఈ డిజిటల్ లోన్ ల లాంటి సౌకర్యా ల ద్వారా 200 శాతం వృద్ది ని సాధించాలనే లక్ష్యం గా ఈ ఫెడరల్ బ్యాంకు పనిచేస్తుంది. |