మరికొన్ని ఈ- వాణిజ్యం సంస్థలు ఐ.పి.ఓ లకు సంసిద్ధం ఈ-కామర్సు రంగం ఎంతలా దూసుకెళ్తుందో తెలియంది కాదు. అయితే... ఎన్ని సంస్థలు వచ్చినా, ఎంత పెద్ద సంస్థలయినా కూడా ఇంతవరకు ఐపీఓకు రాలేదు. అయితే.. ఇండియాలో నిధుల సమీకరణకు మార్కెట్లను ఆశ్రయించిన మొట్టమొదటి ఈ-కామర్సు సంస్థగా ఇన్ఫీభీం రికార్డులకెక్కింది. మరోవైపు ఆ సంస్థ ఐపీఓకు బ్రహ్మాండమైన రెస్పాన్సు రావడం ఈ-వాణిజ్యంలో పెట్టుబడులకు జనం ఎంతగా ఆసక్తిగా ఉన్నారన్నది కూడా నిరూపణ అయింది. ఇన్ఫీ భీం ఐపీఓకు మ్యూచువల్ ఫండ్సు సంస్థలు దూరంగా ఉన్నప్పటికీ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం పెద్ద ఎత్తున స్పందించారు. మొత్తం 1.25 కోట్ల ఈక్విటీలను విక్రయించగా 1.385 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు 86 శాతం బిడ్లు దాఖలు చేశాయి. కాగా ఇన్ఫీబీం ఒక్కో షేర్ ను రూ.360 నుంచి రూ.432 మధ్య ప్రకటించింది. లోయర్ ఎండ్ ధరలపై ఈక్విటీలన విక్రయించినా కూడా రూ.450 కోట్లు గ్యారంటీగా వస్తాయి. ఈ ఐపీఓ విజయవంతం కావడంతో మరిన్ని ఈ కామర్సు సంస్థలు నిధుల సమీకరణకు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఇన్ఫీ బీం ఐపీఓకు చాలావరకు బిడ్లు అప్పర్ ఎండ్ ప్రైస్ బ్యాండ్ పైనే రావడంతో్ అన్ని క్యాటగిరీల్లో ఈ ఐపీఓ విజయవంతమైనట్లు చెబుతున్నారు. ఇన్ఫీబీం స్ఫూర్తితో మరికొన్ని ఈ-వాణిజ్యం సంస్థలు ఈ మార్గం పడతాయని చెబుతున్నారు. |